సారన్‌గఢ్
Sarangarh | |
---|---|
city | |
Sarangarh | |
Nickname: SRGH | |
Coordinates: 21°36′N 83°05′E / 21.6°N 83.08°E | |
Country | భారతదేశం |
State | Chhattisgarh |
District | Sarangarh-Bilaigarh |
Named for | Fort with Bambosa Tree |
Government | |
• Body | Nagar Palika Parishad |
Elevation | 217 మీ (712 అ.) |
జనాభా (2014) | |
• Total | 75,000 |
Languages | |
• Official | Hindi, Chhattisgarhi |
Time zone | UTC+5:30 (IST) |
<Pin Code> | 496445 |
Vehicle registration | CG-13 |
సారంగఢ్' భారతదేశం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని సారన్‌గఢ్ జిల్లా లోని పట్టణం. సారన్‌గఢ్ పట్టణం చుట్టూ ప్రకృతి రమణీయత ఉంది.గోమర్ద వన్యప్రాణుల అభయారణ్యం పట్టణం నుండి 15 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి 216లో ఉంది.
చరిత్ర
[మార్చు]గోండుల రాజ్ గోండ్ రాజవంశంచే పరిపాలించబడిన అనేక రాచరిక రాష్ట్రాలలో సారంగఢ్ రాష్ట్రం ఒకటి. పాలకులు ' రాజా ' అనే బిరుదును ధరించారు. పురాణాల ప్రకారం సారంగఢ్ రాష్ట్రం సా.శ. మొదటి శతాబ్దంలో భండారా నుండి వలస వచ్చిన గోండు పూర్వీకులచే స్థాపించబడింది.ఇది మొదట రతన్‌పూర్ రాజ్యంపై ఆధారపడి ఉంది.తరువాత సంబల్‌పూర్ రాష్ట్రం కింద ఉన్న పద్దెనిమిది గర్జాత్ రాష్ట్రాలలో ఒకటిగా మారింది. సంబల్‌పూర్ రాజులు సైనిక పోరాటాల సమయంలో తమ రాజ్యానికి సహాయం చేయడానికి సంసిద్ధతతో సారన్‌గఢ్ ను ఆదరించారు.
1818లో సారన్‌గఢ్ బ్రిటిష్ రక్షిత ప్రాంతంగా మారింది.1878, 1889 మధ్య కాలంలో సారంగడ్ రాష్ట్రం ఆర్థిక నిర్వహణ లోపం, పాలకుడు భవానీ ప్రతాప్ సింగ్ శైశవదశ కారణంగా బ్రిటీష్ ఇండియా ప్రత్యక్ష పరిపాలన కిందకు వచ్చింది. సారన్‌గఢ్ ఛత్తీస్‌గఢ్ విభాగంలోభాగమైన ఒక చిన్న భూస్వామ్య రాష్ట్రం. 1948 జనవరి 1న న సారన్‌గఢ్ రాష్ట్రం భారతదేశ ఆధిపత్యంలో చేరింది.
పాలకులు
[మార్చు]బ్రిటీష్ రాజ్ కాలంలో, రాజ్‌పుత్‌ల రాజ్ గోండ్ రాజవంశంచే పరిపాలించిన అనేక రాచరిక రాష్ట్రాలలో సారన్‌ఘఢ్ రాష్ట్రం ఒకటి.ఇది మొదట రతన్‌పూర్ రాచరిక రాజ్యంపై ఆధారపడి ఉంది.తరువాత సంబల్‌పూర్ రాష్ట్రం క్రింద ఉన్న పద్దెనిమిది గర్జాత్ రాష్ట్రాలలో ఒకటిగా మారింది.[1]
పాలకుల చరిత్ర
[మార్చు]- ఉదయభన్ సింగ్
- బీర్భన్ సింగ్
- ఉధో సాయి సింగ్ - 1736
- కళ్యాణ్ సాయి -1736 -1777
- విశ్వనాథ్ సాయి - 1777 - 1808
- సుభద్రాదేవి -1808 - 1815
- భిఖాన్ సాయి (మ. 1828) - 1827 – 1828 జనవరి 5 వరకు
- టికాన్ సాయి -1828 జనవరి 5– 1828
- గజరాజ్ సింగ్ (మ. 1829) - 1828 –1829 మే వరకు
- సింగ్రామ్ సింగ్ -1829 మే - 1872
- భవానీ ప్రతాప్ సింగ్ (జ:1865 – మ. 1889) - 1872 – సెప్టెంబరు నుండి 1889 వరకు
- లాల్ రఘుబీర్ సింగ్ (మ. 1890) - 1889 సెప్టెంబరు నుండి 1890 ఆగస్టు 5 వరకు
- బహదూర్ జవహీర్ సింగ్ - (జ. 1886 - మ. 1946) 1890 ఆగస్టు 5 నుండి 1946 జనవరి 11 వరకు
- నరేష్ చంద్రసింగ్ (జ. 1908 - మ. 1987) - 1946 జనవరి 11 నుండి – 1947 ఆగస్టు 15 వరకు
- రాజా శిశిర్ రాజ్ బిందు సింగ్ - (జ.1988- మ.2016)
- (2016 - ప్రస్తుతం) రాజ్ సింగ్
జనాభా గణాంకాలు
[మార్చు]2001 భారత జనాభా లెక్కలు, [2] సారన్‌గఢ్ పట్టణంలో 2,14,458 మంది జనాభా ఉన్నారు.అందులో పురుషులు 51% మంది ఉండగా, స్త్రీలు 49% మంది ఉన్నారు.సగటు అక్షరాస్యత 70% ఉంది, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువఉంది.పురుషుల అక్షరాస్యత 80% ఉండగా, స్త్రీల అక్షరాస్యత 60%.ఉంది సారన్‌గఢ్ మొత్తం జనాభాలో 13% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని చారిత్రాత్మక, ముఖ్యమైన పట్టణాలలో సారన్‌గఢ్ ఒకటి. జిల్లా కేంద్రంగా ఏర్పడక ముందు సారన్‌గఢ్ పట్టణం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ ఉంది. పూర్వపు సారన్‌గఢ్ రాచరిక రాష్ట్ర ప్రాంతాన్ని కలిగి ఉంది.సారన్‌గఢ్ పట్టణంలో 15 వార్డులతో కూడిన "నగర్ పాలిక పరిషత్" ఉంది.ఇది అదే పేరుతో ఉన్న ఉప విభాగ ప్రధాన కార్యాలయం.ఈ పట్టణం సముద్ర మట్టానికి 217 మీటర్లు (711 అడుగులు) ఎత్తులో ఉంది. సారన్‌గఢ్ ప్రపంచ స్థానం ఉత్తర అక్షాంశం 21 డిగ్రీల, 6 నిమిషాల నుండి తూర్పు రేఖాంశం 83 డిగ్రీల, ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది.
సమీప ముఖ్య గ్రామాలు
[మార్చు]- సర్సివా
- మధుబన్
- సాపోస్
- జస్పూర్
- బరంకెలా
- చందర్‌పూర్
- రామ్‌టెక్
- కోసిర్
చదువు
[మార్చు]సారన్‌గఢ్ పట్టణంలో ఎనిమిది సెకండరీ స్థాయి పాఠశాలలు, రెండు గ్రాడ్యుయేట్, పోస్ట్-గ్రాడ్యుయేట్ స్థాయి కళాశాలలు ఉన్నాయి. సాంకేతిక విద్య కోసం, పారిశ్రామిక శిక్షణా సంస్థ ఉంది.
ఆరోగ్యం
[మార్చు]పట్టణంలో ముగ్గురు పూర్తికాల వైద్యులతో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఉంది
లోక్‌సభ నియోజకవర్గం
[మార్చు]1971 భారత జనాభా లెక్కల తర్వాత సారన్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం పేరుతో కొత్త లోక్‌సభ నియోజకవర్గం ఉనికిలోకి వచ్చింది. దానికి మొదటి ఎన్నికలు 1977లో జరిగాయి.అయితే 2001 జనాభా లెక్కల ప్రకారం రాజకీయ నియోజకవర్గాల విభజన తర్వాత, సారన్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం ప్రాంతం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్, జాంజ్‌గిర్, మహాసముంద్ నియోజకవర్గాలలో విలీనం చేయబడింది.
మూలాలు
[మార్చు]- ↑ Sarangarh (Princely State)
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.