బలరాంపూర్ (ఛత్తీస్‌గఢ్)
Jump to navigation
Jump to search
బలరాంపూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 23°36′18″N 83°37′01″E / 23.605°N 83.617°E | |
దేసం | India |
రాష్ట్రం | ఛత్తీస్‌గఢ్ |
జిల్లా | బలరాంపూర్ |
జనాభా (2011) | |
• Total | 4,456 |
భాషలు | |
• అధికారిక | హిందీ, ఛత్తీస్‌గఢీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 497119 |
Telephone code | 07831 |
Vehicle registration | CG-30 |
బలరాంపూర్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బలరాంపూర్-రామానుజ్‌గంజ్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. అంతగా గుర్తింపు లేని ఈ పట్టణం, కొత్తగా స్థాపించిన జిల్లాకు ముఖ్య పట్టణం కావడంతో వెలుగు లోకి వచ్చింది. ఇది రాష్ట్ర రాజధాని రాయపూర్ నుండి 441 కి.మీ. దూరంలో ఉంది.
భౌగోళికం
[మార్చు]అంబికాపూర్, రామానుజ్‌గంజ్, కుస్మి, ప్రతాప్‌పూర్, రాజ్‌పూర్ లను కలిపే ముఖ్యమైన జంక్షను, బలరాంపూర్.
పట్టణంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీసు శిక్షణా కేంద్రం ఉంది.
రవాణా
[మార్చు]రోడ్డు
[మార్చు]బలరాంపూర్‌కు, జిల్లాలోని అన్ని పట్టణాల నుండి చక్కటి రోడ్డు సౌకర్యం ఉంది. పట్టణం నుండి జార్ఖండ్ లోని గర్వాకు, ఛత్తీస్‌గఢ్ లోని అంబికాపూర్‌కూ జాతీయ రహదారి 343 ద్వారా రోడ్డు సౌకర్యం ఉంది.
రైలు
[మార్చు]పట్టణానికి సమీపం లోని రైల్వే స్టేషన్లు అంబికాపూర్, గర్హ్వా.