శ్రీ త్రిలింగరాజరాజేశ్వరస్వామి దేవాలయం
శ్రీ త్రిలింగరాజరాజేశ్వారస్వామి ఆలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 18°46′29″N 79°31′18″E / 18.7747336°N 79.5215368°E |
పేరు | |
ఇతర పేర్లు: | త్రికూటాలయం |
ప్రధాన పేరు : | శ్రీ త్రిలింగరాజరాజేశ్వరస్వామి ఆలయం |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | పెద్దపల్లి |
ప్రదేశం: | జనగామ (గ్రా), గోదావరిఖని (ప), రామగుండం (మం) |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | శ్రీ రాజరాజేశ్వర స్వామి (శివుడు) |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సా.శ.. పన్నెండో శతాబ్దం |
శ్రీ త్రిలింగరాజరాజేశ్వరస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని, పెద్దపల్లి జిల్లా, రామగుండం మండలం, జనగామ గ్రామంలో ఉన్న బహు పురాతన శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని 12 వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించారు.[1]
ఆలయ చరిత్ర
[మార్చు]ఈ ఆలయాన్ని పురాతన గ్రామమైన జనగామలో 12 వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో జైనులు నిర్మించారు. ఈ ఆలయాన్ని 16 పోళ్ళతో, మొత్తం ఇసుకరాయితో నిర్మించారు. ఈ ఆలయం తూర్పున ఊర చెరువు, ఉత్తరాన గోదావరి నది ఉంది. ఈ నదిలో ఋషులు, మునులు ఈ ఆలయంలో ఉండే రహస్య మార్గం గుండా వెళ్లి స్నానం ఆచరించేవారట.
ఆలయ ప్రత్యేకతలు
[మార్చు]ఈ ఆలయంలో ప్రతి రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజున, కార్తీక పౌర్ణమి రోజున మూడు రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాల జరుగుతాయి. ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు వస్తూ ఉంటారు.
రవాణా సౌకర్యం
[మార్చు]ఈ ఆలయానికి రామగుండం మండలంలోని గోదావరిఖని పట్టణం నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
చిత్రమాలికలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "శ్రీ త్రిలింగరాజరాజేశ్వారస్వామి ఆలయం". 3 February 2019.[permanent dead link]