Jump to content

ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయం

వికీపీడియా నుండి
ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయం
భౌగోళికం
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాకరీంనగర్ జిల్లా
ప్రదేశంఇల్లందకుంట, ఇల్లందకుంట మండలం
సంస్కృతి
దైవంసీతారామచంద్రస్వామి
వాస్తుశైలి
నిర్మాణ శైలులుకాకతీయ శైలీ

ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, ఇల్లందకుంట గ్రామంలో ఉన్న దేవాలయం.[1] శ్రీరాముడు తన అరణ్యవాసంలో భాగంగా ఇక్కడ అందుకే ఆ గ్రామాలకు లక్ష్మాజీపల్లె, శ్రీరాములపల్లె, సీతంపేట, లక్ష్మన్నపల్లె, రామన్నపల్లె, సిరిసేడు అని పేర్లు వచ్చాయని ఇక్కడి పెద్దలు చెబుతుంటారు.

చరిత్ర

[మార్చు]

త్రేతాయుగంలో రాముడు, సీత, లక్ష్మణుడు అరణ్యవాసం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి, ఇక్కడ 13 రోజులు గడిపారు. ఆ సమయంలోనే తండ్రి దశరథుడు మరణించిన విషయం తెలుసుకున్న రాముడు.. ఇక్కడి ఇల్లంద వృక్షానికి సంబంధించిన ఇల్లంద పలుకులతో దశరథుడికి శ్రాద్ధకర్మలు జరిపించాడని, రాముడు ఇల్లంద పలుకులతో శ్రాద్ధకర్మలు జరిపించడంతో.. ఈ ప్రాంతానికి ఇల్లందకుంట అని పేరు వచ్చిందని ప్రతీతి. ఈ దేవాలయంలోని ఉత్సవమూర్తులకు పుట్టు మచ్చలు ఉండడం ఇక్కడి ప్రత్యేకత.[2]

బ్రహ్మోత్సవాలు

[మార్చు]

ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా ఈ దేవాలయంలో 13 రోజులపాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రీరామనవవి రోజున జరిగే స్వామి కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించబడుతాయి.[3]

  1. మొదటిరోజు స్వామివారి ఉత్సవమూర్తులను గ్రామ దేవాలయం నుంచి ప్రధాన దేవాలయానికి బాహ్యమందిర ప్రవేశం
  2. రెండోరోజు విశ్వక్సేనారాదన పుణ్యహవచనం, రక్షబంధనం, అంకురార్పణ
  3. మూడోరోజు ఉదయం 9 గంటలకు ధ్వజారోహనం, అగ్నిప్రతిష్ట, 10 గంటలకు ఎదుర్కోళ్లు, మధ్యాహ్నం 12 గంటలకు శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవ కార్యక్రమం, రాత్రి 8 గంటల శేషవాహన సేవ
  4. నాలుగోరోజు పట్టాభిషేక మహోత్సవం, సాయంత్రం 6గంటలకు ప్రభుత్వోత్సవం ప్రారంభం, 7 గంటలకు హంసవాహన సేవ
  5. ఐదోరోజు రాత్రి 8 గంటలకు గరుడవాహన సేవ
  6. ఆరోరోజు 8 గంటలకు హన్‌మత్‌ వాహన సేవ
  7. ఏడోరోజు రాత్రి 8 గంటలకు గజవాహన సేవ
  8. ఎనిమిదవరోజు రాత్రి 8 గంటలకు అశ్వవాహన సేవ (దీపోత్సవం)
  9. తొమ్మిదవరోజు రాత్రి 7 గంటలకు బండ్లు తిరుగుట, సూర్యరథోత్సవం (చిన్న రథం)
  10. పదవరోజు సాయంత్రం 6 గంటలకు స్వామివారి చంద్రరథోత్సవం
  11. పదకొండవరోజు మధ్యాహ్నం 3గంటల వరకు భక్తులకు చంద్రోరథోత్సవంపై స్వామివారి దర్శనం, తిరుమాడ వీధుల్లో రథ ఊరేగింపు, రాత్రి 7గంటలకు మహాపూర్ణాహుతి, మహాకుంభ సంప్రోక్షణ
  12. పన్నెండవరోజు అష్టోత్తరశత (108) కలశ అభిషేకం, అవబృధ చక్రస్నానం, రాత్రి 7 గంటలకు ద్వాదశారోదన శ్రీపుష్పయాగం (నాఖబలి)
  13. పదమూడవరోజు రాత్రి 7 గంటలకు సప్తవర్ణాలు.. ఏకాంతసేవ, గరుడసేవ

మూలాలు

[మార్చు]
  1. "ఘనంగా సీతారాముల కళ్యాణం". Prabha News. 2022-04-10. Archived from the original on 2022-04-10. Retrieved 2023-03-29.
  2. ABN (2023-03-28). "రాములోరి కల్యాణానికి సర్వసిద్ధం". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-03-29. Retrieved 2023-03-29.
  3. "వైభవంగా సీతారాముల కల్యాణం". NavaTelangana. 2019-04-15. Archived from the original on 2023-03-29. Retrieved 2023-03-29.