కురవి వీరభద్రస్వామి దేవాలయం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
కురవి వీరభద్రస్వామి దేవాలయము | |
---|---|
భౌగోళికాంశాలు : | 17°32′43″N 80°01′42″E / 17.545189°N 80.028419°E |
పేరు | |
ప్రధాన పేరు : | కురవి వీరభద్రస్వామి దేవాలయము |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | మహబూబాబాదు |
ప్రదేశం: | కురవి గ్రామం. |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | వీరభద్రేశ్వర స్వామి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | కాకతీయ, చాళుక్య; హిందూ |
మహబూబాబాదు జిల్లా,కురవి గ్రామ పంచాయితీ పరిధిలో ఈ దేవాలయం ఉంది. సకల శక్తిమూర్తి, వరప్రదాత అయిన శ్రీ వీరభద్రస్వామి శ్రీ భద్రకాళి సమేతంగా కొలువుండటం వల్ల ఈ ఆలయాన్ని 'శ్రీ వీరభద్రేశ్వరాలయం'గా కూడా పిలుస్తారు.
ఆలయ చరిత్ర
[మార్చు]వేంగి రాజధానిగా ఆంధ్రదేశాన్ని పాలించిన రోజుల్లో రాష్ట్రకూటులచేత పరాజితుడైన భీమరాజు కురవి నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. నాటి వేంగి చాళుక్యుల తర్వాత తొలి కాకతీయ రాజైన ఒకటో బేతరాజు ఈ ఆలయాన్ని పునరుద్దరించారు.
ఆలయ నిర్మాణం
[మార్చు]కురవి దేవాలయం అష్టాదశ స్తంభాల మహామండపంతో మూడు గర్భాలయాలతో విస్తరించి ఉంది. ఈ ఆలయంలో శిల్పకళ ఉట్టిపడుతోంది. గర్భగుడిలో మూలవిరాట్ వీరభద్రస్వామి త్రినేత్రుడై దశహస్తాలతో దౌర్రరూపంగా ఉండటం విశేషం. స్వామివారి నోటికిరువైపులా రెండు కోరలు, పాదాల చెంత నందీశ్వరుడి విగ్రహం ఉండగా ఎడమవైపు శ్రీ భద్రకాళి అమ్మవారి విగ్రహం ఉంటుంది.
జాతర
[మార్చు]ప్రతియేటా మహాశివరాత్రి నాడు జాతర ప్రారంభమై ఉగాదికి ముగుస్తుంది. ఈ కాలంలో వివిధ ప్రాంతాల నుండి దాదాపు పదిహేను లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. శివరాత్రి పర్వదినం తర్వాతి రోజు తెల్లవారజామున స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ జాతరను తెలంగాణలో మేడారం జాతర తర్వాత అతి ఎక్కువ మంది భక్తులు హాజరయ్యే గిరిజన జాతరగా పరిగణిస్తారు.