శ్రీ కుమార శతకము
స్వరూపం
కుమార శతకము | |
---|---|
కవి పేరు | రావు భాస్కర రావు |
అనువాదకుడు | దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి |
వ్రాయబడిన సంవత్సరం | 1897 |
మొదటి ప్రచురణ తేదీ | 1900 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మకుటం | కుమార! |
విషయము(లు) | రాజనీతి |
పద్యం/గద్యం | పద్యం |
ఛందస్సు | తేటగీతి |
ప్రచురణ కర్త | క్రొత్తపల్లి పద్మనాభశాస్త్రి |
ప్రచురణ తేదీ | 1900 |
మొత్తం పద్యముల సంఖ్య | 101 |
అంకితం | రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు |
ముద్రాపకుని పేరు | క్రొత్తపల్లి పద్మనాభశాస్త్రి |
ముద్రణా శాల | లారెన్స్ అసైలం ప్రెస్, మద్రాసు |
శ్రీ కుమారశతకము[1] సంస్కృతములో రావు భాస్కరరావు చేత రచింపబడి దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి చేత ఆంధ్రీకరించబడింది. ఇది 1900 ఆగస్టు 1వ తేదీన కోలంక వీరవరం జమీందారిణి రాజా చెల్లయ్యమ్మ రావుబహద్దూరు ఆజ్ఞానుసారం మద్రాసు లారెన్స్ అసైలమ్ ప్రెస్సులో క్రొత్తపల్లి పద్మనాభశాస్త్రిగారిచే ముద్రించబడింది. ఈ శతకంలో 101 శ్లోకాలు, ప్రతి శ్లోకానికి వెనువెంటనే ఆంధ్రీకృతపద్యము ఉన్నాయి. రావు వంశపు కులవృద్ధుడైన రావు భాస్కరరావు పిఠాపురం మహారాజా రావువేంకటకుమార మహీపతి సూర్యారావును ఉద్దేశించి రాజనీతిని బోధించిన శతకము ఇది. రావు వంశపుటౌన్నత్యము, మహారాజా వారి మాతృపితృ నగర మహిమ, మహారాజా వారి విద్వత్తు మొదలైన విషయాలు ఈ శతకంలో పొందుపరచబడి ఉంది. "కుమార!" అనేది ఈ శతకానికి మకుటంగా ఉంది.
మచ్చుతునకలు
[మార్చు]- తే|| తత్తనూజులు సర్వజ్ఞ మాధవులనంగ
- శైవవైష్ణవ ధర్ములై ఠీవి గనిరో
- మీదయిన యన్వయంబున కాదిపురుషు
- లట్టి వంశోచ్ఛ్రయముఁ బొందుమా కుమారా!
- తే|| తత్తనూజులు సర్వజ్ఞ మాధవులనంగ
- తే||చేయఁదగినట్టి పనియును జేయరాని
- పనియుఁదెలియ నశక్యమైపరఁగుఁగాన
- మహిని బండి తులైన బ్రహ్మణుల నీదు
- సభల నిలుపబంగఁ దగును నిచ్చలుఁ గుమార!
- తే||చేయఁదగినట్టి పనియును జేయరాని
మూలాలు
[మార్చు]- ↑ పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973