భాస్కర శతకము
భాస్కర శతకం | |
---|---|
కవి పేరు | మారవి వెంకయ్య కవి |
వ్రాయబడిన సంవత్సరం | 16వ శతాబ్దం |
దేశం | భారత దేశము |
భాష | తెలుగు |
మకుటం | భాస్కరా! |
విషయము(లు) | నారశింహుని కీర్తిస్తూ |
పద్యం/గద్యం | పద్యములు |
ఛందస్సు | వృత్తములు |
మొత్తం పద్యముల సంఖ్య | 106 |
అంకితం | భాస్కరుడు (సూర్యనారాయణ స్వామి) |
శతకం లక్షణం | భక్తి శతకం, నీతి శతకం |
భాస్కర శతకం ప్రాశస్త్యం పొందిన నీతీ శతకాలలో ఒకటి. దీనిని వ్రాసిన మారవి వెంకయ్య కవి (క్రీ.శ. 1550 – 1650) రచించాడు. అతను సూర్య భగవానుని భక్తుడు. శ్రీకాకుళం-విజయనగరం దగ్గర నివసించిన ఈ కళింగ కవి, అరసవిల్లి సూర్య నారాయణ భక్తుడు అగుట వలన, సూర్యదేవుని పేరు మీదగా ఈ శతక పద్యాలు రాయటం జరిగింది. ఈ పద్యాలకు మకుట పదం – భాస్కరా. ఆ ప్రదేశాలలో సూర్యనారాయణుని భక్తులు ఉండటం వలన, మారవి కవి పద్యాలు ఎంతొ పొందికగా, నీతీ బద్ధమైనవిగా ఉండటం వలన బాగా ప్రాశస్తం పొందాయి.[1]
భాస్కర శతకంలో మొట్టమొదటగా దృష్టాలంకారం ఉపయోగింపబడింది. పద్యాలు రెండు ఛందో ప్రక్రియలలో చెయ్యబడ్డాయి. ఉత్పలమాలలో 64 పద్యాలు, చంపకమాలలో 42 పద్యాలు చెయ్యబడ్డాయి. పురాణాలనుండి ఎన్నో ఉదాహరణలు ఉపయోగించి నైతిక విలువల గురించి, మనిషి ప్రవర్తన, ఆలోచన, నిమీషమాత్రమైన ధన వైభవం గురించి, వ్యక్తీ సామాజిక బాధ్యతల గురించి, త్యాగ బుద్ధి, పట్టుదల, స్త్రీలతో సంబంధముల తదితర విషయముల గురించి పెక్కుగా రాయబడ్డాయి.
కొన్ని ఉదాహరణలు:
[మార్చు]- శ్రీగల భాగ్యశాలిఁ గడుఁ జేరఁగవత్తురు తారుదారె దూ
- రాగమన ప్రయాసము కాదట నోర్చియైన నిల్వ న
- ద్యోగము చేసి; రత్న నిలయుండని కాదె సమస్త వాహినుల్
- సాగరుఁ జేరుటెల్ల ముని సన్నుత మద్గురుమూర్తి భాస్కరా!
ఓ సూర్యభగవానుడా! సాగరుడు రత్ననిలయుడు కనుకనే నదులన్నీ సముద్రములో చేరుటకు పొర్లివచ్చును. అలాగే సదూరప్రాంతాలనుండి కూడ జనులు ధనవంతుని ఆశ్రయిస్తారు.
- ఊరక సజ్జనుండొదిగి యుండిననైన, దురాత్మకుండు ని
- ష్కారణ మోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా;
- చీరలు నూరు అంకములు చేసెడివైనను బెట్టెనుండగాఁ
- జేరి చినింగిపోఁ గొఱుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా!
ఎంతో ఖరీదైన చీరలను పెట్టెలో పెడితే చిమ్మెట పురుగు వాటిని తెగ కొరుకుతుంది. అలాగే మంచివాడు తనమానాన తానున్నా దుష్టుడు పూనుకొని ఏదో హాని తలపెడతాడు.
- చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
- చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం;
- బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
- పొదవెడొ నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా!
ఎంత గొప్పగా వండినా ఉప్పు లేని కూర రుచించదు. అలాగే ఎంత చదివినా, ఆ చదువు సార ము గ్రహించలేకపోయినట్లయితే ఆ చదువు నిరుపయోగము. ఎవరూ మెచ్చుకొనరు.
ఆధారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "BhAskara Satakam". web.archive.org. 2006-07-16. Archived from the original on 2006-07-16. Retrieved 2022-12-19.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)