Jump to content

విస్సన్నపేట

అక్షాంశ రేఖాంశాలు: 16°56′26.520″N 80°47′2.328″E / 16.94070000°N 80.78398000°E / 16.94070000; 80.78398000
వికీపీడియా నుండి
విస్సన్నపేట
పటం
విస్సన్నపేట is located in ఆంధ్రప్రదేశ్
విస్సన్నపేట
విస్సన్నపేట
అక్షాంశ రేఖాంశాలు: 16°56′26.520″N 80°47′2.328″E / 16.94070000°N 80.78398000°E / 16.94070000; 80.78398000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఎన్టీఆర్
మండలంవిస్సన్నపేట
విస్తీర్ణం24.15 కి.మీ2 (9.32 చ. మై)
జనాభా
 (2011)
17,852
 • జనసాంద్రత740/కి.మీ2 (1,900/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు9,018
 • స్త్రీలు8,834
 • లింగ నిష్పత్తి980
 • నివాసాలు4,611
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్521215
2011 జనగణన కోడ్589013

విస్సన్నపేట, ఎన్టీఆర్ జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన నూజివీడు నుండి 18 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4611 ఇళ్లతో, 17852 జనాభాతో 2415 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 9018, ఆడవారి సంఖ్య 8834. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3190 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 713. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589013. 2022 లో చేసిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం కృష్ణా జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. [2] [3].ఇది సముద్రంట్టానికి 73 మీ.ఎత్తులో ఉంది.

సమీప గ్రామాలు

[మార్చు]

చంద్రుపట్ల 4 కి.మీ, మద్దులపర్వ 4 కి.మీ, కొండపర్వ 6 కి.మీ, మిట్టగూడెం 3కి ,రెడ్డిగూడెం6 కిమి,ముచనపల్లి 6కిమి

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

విస్సన్నపేటలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. విస్సన్నపేట, పుట్రేల నుండి రోడ్దురవాణా సౌకర్యంకలదు. రైల్వేస్టేషన్: విజయవాడ 55 కి.మీ దూరంలో ఉంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 10, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు ఆరు ఉన్నాయి. 3 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 3 ప్రైవేటు జూనియర్ కళాశాలలు 2 ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు, 2 ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఒక ప్రైవేటు పాలీటెక్నిక్ ఉంది. సమీప ఇంజనీరింగ్ కళాశాల నూజివీడులో ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నూజివీడులోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు విజయవాడలోనూ ఉన్నాయి.

విస్సన్నపేట ప్రభుత్వ కళాశాల

[మార్చు]

ఈ కళాశాలలో నిర్మాణరంగం కోర్సులో ద్వితీయ సంవత్సరం చదువుచున్న మంతెన నాగేశ్వరరావు అను విద్యార్థి, 2015, ఆగష్టు-20వ తేదీనాడు, ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన ఎంపిక పోటీలలో తన ప్రతిభ ప్రదర్శించి, జాతీయస్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపికైనాడు. 2015, ఆగష్టు-28నుండి 30వరకు కేరళ రాష్ట్రంలో నిర్వహించే జాతీయస్థాయి పోటీలలో ఈ విద్యార్థి పాల్గొంటాడు. [7]

వికాస్ పి.జి.కళాశాల

[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

[మార్చు]
  1. ఈ పాఠశాలలో చదువుచున్న కేదాసి పవన్ కృష్ణ అను విద్యార్థి, 2015, డిసెంబరు-21,22,23 తేదీలలో పంజాబు రాష్ట్రంలోని లూధియానాలో నిర్వహించిన జాతీయస్థాయి అండర్-16, షాటోఖాన్ కరాటే పోటీలలో పాల్గొన్నాడు. ఈ పోటీలలో 24 రాష్ట్రాలనుండి 2,000 మంది కరాటే వీరులు పాల్గొని తమ ప్రతిభ ప్రదర్శించారు. ఈ పోటీలలో పవన్ స్పార్వింగ్ (ఫైటింగ్) విభాగంలో పాల్గొని జాతీయస్థాయిలో ప్రథమ బహుమతిని సాధించి బంగారు పతకాన్నీ, కరాటే నైపుణ్య విభాగంలో పాల్గొని ద్వితీయ బహుమతిని సాధించి రజత పతకాన్నీ కైవసం చేసుకున్నాడు. పంజాబు రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి చేతులమీదుగా ఈ పతకాలను అందుకున్నాడు. [8]
  2. ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుచున్న జరపల కిషోర్ అను ఒక పేద గిరిజన కుటుంబానికి చెందిన విద్యార్థి, 2015, డిసెంబరు-28,29,30 తేదీలలో రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో నిర్వహించు జాతీయస్థాయి త్రోబాల్ క్రీడా పోటీలలో, అంధ్రప్రదేశ్ జట్టు తరపున పాల్గొనడానికి ఎంపికైనాడు. [9]
  3. ఈ పాఠశాలకు చెందిన జరపల కిషోర్, పర్వతం దుర్గారావు అను విద్యార్థులు, జాతీయస్థాయిలో నిర్వహించు త్రో బాల్ పోటీలకు సబ్-జూనియర్ విభాగంలో ఎంపికైనారు. వీరిరువురూ 2016, ఫిబ్రవరి-13నుండి తమిళనాడు రాష్ట్రంలోని మదురై నగరంలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో, తొమ్మిదిమందితో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టులో సభ్యులుగా పాల్గొంటారు. [10]
  4. ఇటీవల కేరళ రాష్ట్రంలోని తిరుచూరు పట్టణంలో నిర్వహించిన జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో, ఈ పాఠశాల విద్యార్థి జరపల కిషోర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టులో పాల్గొని, తన ప్రతిభతో, జట్టు దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచేటట్లు చేసాడు. [11]

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

బ్యాంకులు

[మార్చు]

ఆంధ్రా బ్యాంక్.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

విస్సన్నపేటలో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, 8 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నలుగురు డాక్టర్లు, 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. మూడు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఆరుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో13 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఐదుగురు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు నలుగురు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. ఆరు మందుల దుకాణాలు ఉన్నాయి.

గ్రామ పంచాయితీ

[మార్చు]
  1. 1970 లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, 23 ఏళ్ళ కోట రామకోటేశ్వరరావు, వార్డు సభ్యునిగా గెలిచి రాజకీయ జీవితానికి ఆరంగ్రేట్రం చేశారు. ఆనాటి వార్డు సభ్యులంతా ఇతనిని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత ప్రజలు సర్పంచిని నేరుగా ఎన్నుకొనేటప్పుడు ఇతను సర్పంచి పదవికి పోటీచేసి 1986, 1994లలో ఎన్నికై 1999 లో పదవీ కాలం ముగిసేదాకా పనిచేశారు. 2001 లో ఎం.పి.టి.సి సభ్యునిగా ఎన్నికై, మండల పరిషత్తు ఉపాధ్యక్షునిగా పనిచేశారు. తన నలుగురు కొడుకులలో ఒక్కరిని గూడా రాజకీయ రంగం వైపు ప్రోత్సహించలేదాయన. వారంతా ప్రస్తుతం రైతులుగానే ఉన్నారు.
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో పల్లిపాల లక్ష్మయ్య 1207 ఓట్ల ఆధిక్యంతో సర్పంచిగా గెలుపొందాడు.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 12 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ భ్రమరాంబా సమేత శ్రీచంద్రశేఖర స్వామివారి ఆలయం

[మార్చు]

శ్రీ గోపరాజు సమేత శ్రీ లక్ష్మీతిరుపతమ్మ తల్లి దేవాలయం

[మార్చు]

విస్సన్నపేట గ్రామంలో సత్తుపల్లి రహదారిలో, రు. 75 లక్షల వ్యయంతో, నూతనంగా నిర్మించిన ఈ దేవాలయంలో ఏర్పాటు చేయనున్న అమ్మవారి మూలవిరాట్టు విగ్రహాలను, ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న ద్వజస్తంభాన్నీ, 2014, మార్చి-16, ఆదివారం (ఫాల్గుణ పౌర్ణమి) నాడూ, మరియూ,17వ తేదీ, సోమవారం నాడూ, ఊరేగింపు నిర్వహించి, సోమవారం సాయంత్రానికి ఆలయ ప్రాంగంణానికి చేర్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా వస్తున్న మూలవిరాట్టుకూ, ద్వజస్థంబానికీ, ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ దేవాలయ ప్రతిష్ఠా కార్యక్రమాలను, 2014, మార్చి-23న ప్రారంభించారు. 2014, మార్చి-27న విగ్రహాలు, బొడ్డురాయి, ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహించెదరు. ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. అనంతరం భక్తులకు భారీగా అన్నసమారాధన నిర్వహించెదరు. [4] & [5]

శ్రీ రామాలయం

[మార్చు]

స్థానిక కొత్తపేటలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2015, మే-31వ తేదీ ఆదివారంనాడు, శ్రీ సీతా, రామ, లక్ష్మణ, హనుమత్, గణపతి, నాగేంద్రస్వామి వారల విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు భక్తులు విచ్చేసి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా పెద్ద యెత్తున అన్నసమారాధన నిర్వహించెదరు. [6]

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

భూమి వినియోగం

[మార్చు]

విస్సన్నపేటలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 60 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 235 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 264 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 89 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 96 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 280 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 204 హెక్టార్లు
  • బంజరు భూమి: 190 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 993 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1337 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 49 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

విస్సన్నపేటలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 49 హెక్టార్లు

గ్రామ ప్రముఖులు

[మార్చు]

నండూరి రామమోహనరావు ప్రముఖ రచయిత. మేడా.కమలాకర్ చురుకైన జాతీయ యువ నాయకుడు,నైపుణ్య ఛాయాగ్రాహకుడు

విస్సన్నపేట పట్టణ దృశ్యాలు

[మార్చు]

వనరులు

[మార్చు]
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "ఆంధ్రప్రదేశ్ రాజపత్రము" (PDF). ahd.aptonline.in. Archived from the original (PDF) on 2022-09-06. Retrieved 2022-09-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు

[మార్చు]