మారేమండ
స్వరూపం
మారేమండ | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | విస్సన్నపేట |
ప్రభుత్వం | |
- సర్పంచి | శ్రీమతి చాట్ల సావిత్రి |
పిన్ కోడ్ | 521215 |
ఎస్.టి.డి కోడ్ | 08598 |
మారేమండ గ్రామం కృష్ణా జిల్లా లోని విస్సన్నపేట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామం పేరు వెనుక చరిత్ర
[మార్చు]"మారేమండ" అనగా "మారెమ్మతల్లి స్థలం" అని అర్థం. ఈ ప్రాంత దైవం మారమ్మతల్లి.
గ్రామ భౌగోళికం
[మార్చు]ఇది సముద్రమట్టానికి 73 మీ.ఎత్తులో ఉంది.
విస్సన్నపేట గ్రామానికి 4 కి.మీ దూరంలో ఉంది.
సమీప గ్రామాలు
[మార్చు]నూజివీడు, హనుమాన్ జంక్షన్, ఏలూరు, విజయవాడ
గ్రామ విశేషాలు
[మార్చు]- ఈ గ్రామ సమీపంలో వేప చెట్టు ఉంది. దీని వయస్సు 150 సంవత్సరాలు ఉంటుంది. [ఆధారం చూపాలి].
- విస్సన్నపేటలోని ఇండేన్ గ్యాస్ కంపెనీవారు దత్తత తీసుకున్న విస్సన్నపేట మండలంలోని రెండు గ్రామాలలో ఇది ఒకటి. ఆ కంపెనీవారు ఈ గ్రామస్తులందరికీ గ్యాస్ కనెక్షన్ పంపిణీ చేసారు. అందువలన అధికారులు ఈ గ్రామానికి, 2016, ఫిబ్రవరి-1వ తేదీనాడు, పొగరహిత గ్రామంగా ధ్రువీకరణ పత్రం అందజేసినారు. ఈ గ్రామంలో మొత్తం 232 కుటుంబాలు ఉండగా, 46 గృహాలకు ఇదివరకే గ్యాస్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు మిగతా 186 మందికి గూడా, "దీపం" పథకం క్రింద గ్యాస్ కనెక్షన్ పంపిణీ చేయడంతో గ్రామం పొగరహిత గ్రామంగా గుర్తించబడింది.
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]విస్సన్నపేట, పుట్రేల నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 56 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]జిల్లాపరిషత్ హైస్కూల్, వేమిరెడ్డిపల్లి శ్రీ ప్రజ్నహైస్కూల్, విస్సన్నపేట
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
[మార్చు]పెద్ద చెరువు.
గ్రామ పంచాయతీ
[మార్చు]- ఈ గ్రామం 2001 వరకూ తాతకుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో అనుబంధ గ్రామంగా ఉండేది, 2001 లో ప్రత్యేక పంచాయతీగా ఆవిర్భవించింది. 2001లో ప్రథమంగా ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గ్రామస్థులు సర్పంచిగా వడిత్యా భద్రుని ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఈ గ్రామం అతని హయాంలో నిర్మల్ పురస్కారానికి ఎన్నికైంది.
- 2006 లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గ్రామస్థులు చాపలమడుగు దేవసహాయాన్ని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇతని హయాంలో మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుండి ఉత్తమ సర్పంచిగా పురస్కారం గ్రహించారు.
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో చాట్ల సావిత్రి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైంది
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]ఈ గ్రామంలో ప్రసిద్ధ రామాలయం ఉంది. ఈ గ్రామ ప్రజలు ప్రతి సంవత్సరం ఉత్సవాలను జరుపుకుంటారు.
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]మామిడి, వరి, చెరకు పండిస్తుంటారు.
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]ఈ గ్రామ ప్రజల్లో అనేక మంది వ్యవసాయదారులు.