Jump to content

విదురుడు

వికీపీడియా నుండి

విదురుడు, (సంస్కృతం:विदुर) యమధర్మరాజు అంశతో దేవరన్యాయం వల్ల వ్యాసునికి అంబ దాసీకి జన్మిస్తాడు.

విదురుడి జననం

[మార్చు]

కురువంశాన్ని నిలపడానికి సత్యవతి తన కోడళ్ళైన అంబికని అంబాలిక ని దేవరన్యాయం ప్రకారం ధర్మ సమ్మతంగా సంతానం పొందించే ఏర్పాటు చేస్తుంది. అంబిక వ్యాసుడిని చూసి కళ్ళు మూసుకొనడం వల్ల గుడ్డివాడగు ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. అంబాలికకు వ్యాసుడిని చూసి కంపించడం వల్ల పాండు రోగంతో పాండు రాజు జన్మిస్తాడు. మంచి వారసత్వాన్ని ఇవ్వమని కోరితే వ్యాసుడు మళ్లీ దేవరన్యాయం వల్ల అంబకి సంతానం కలిగించడానికి అంగీకరిస్తాడు. గడ్డాలు గల వ్యాసుడితో సంభోగించడానికి ఇష్టం లేని అంబిక తన దాసిని వ్యాసుడి వద్దకు పంపుతుంది.ఈ విధంగా పంపబడిన దాసి ఎంతో సంతోషముతో వ్యాసుడితో సంభోగిస్తుంది. దాసికి జన్మించిన వాడు విదురుడు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=విదురుడు&oldid=3905717" నుండి వెలికితీశారు