రాజశేఖర్ సమావేశాన్ని ప్రారంభించి... కొన్ని కారణాల వల్ల గత రెండు నెలలుగా తెలుగు వికీపీడియా నెలవారి సమావేశాలు జరగలేదని అన్నారు. గత నెలలో జరిగిన వికీ అభివృద్ధి గురించి వివరించారు.
పవన్ సంతోష్ చేస్తున్న ప్రాజెక్టు గురించి వివరించారు. దానిద్వారా ఉపయోగాన్ని తెలియజేశారు.
వికీమీడియా ఫౌండేషన్ ఇచ్చే వివిధ రకాలు గ్రాంట్ల గురించి విష్ణు వివరించారు. ఐ.ఈ.జి (ఇండ్యూజివల్ ఎంగేజ్ మెంట్ గ్రాంట్), పి.ఈ.జి (ప్రాజెక్టు అండ్ ఈవెంట్ గ్రాంట్), ఎ.పి.జి (ఆనువల్ ప్లాన్ గ్రాంట్) అని మొత్తం 3 రకాలు గ్రాంట్లు ఉంటాయని... ఇండ్యూజివల్ ఎంగేజ్ మెంట్ గ్రాంట్ వ్యక్తిగతమైన ప్రాజెక్టు కొరకు అనీ, ప్రాజెక్టు అండ్ ఈవెంట్ గ్రాంట్ సమాదాయం అంతా కలిసి ప్రాజెక్టు లేదా ఏదేనా ఒక కార్యక్రమాన్ని చేయడం కొరకు అనీ, ఆనువల్ ప్లాన్ గ్రాంట్ CIS-A2K, WMIN వంటి సంస్థలకు ఇచ్చేవని తెలిపారు. ఎఫ్.డి.సి (ఫండ్స్ డెసిమినేషన్ కమిటీ) ఫండ్స్ డెసిమినేషన్ కమిటీ ఫండ్స్ ని ప్రణాళికబద్ధంగా ఉపయోగించడానికని వివరణ ఇచ్చారు.
వికీమీడియా ఫౌండేషన్ వికీమీడియా పార్టనర్స్ కి మరియు మూమెంట్ పార్టనర్స్ కి ఫండింగ్ ఇస్తుంది. వికీమీడియా పార్టనర్స్ మూడు రకాలు 1) థీమాటిక్ గ్రూప్స్, 2) యూజర్ గ్రూప్స్, 3) ఛాప్టర్స్(ఇండియా ఛాప్టర్). మూమెంట్ పార్టనర్స్(సి.ఐ.ఎస్) అనీ.. అవి నిర్వర్తించే విధుల గురించి విష్ణు తెలియజేశారు. వి
ఈ నెల 4, 5 తేదీలలో బెంగుళూరులో జరిగిన వికీపీడియనుల అంతర్గత సమూహ సంప్రదింపుల సమావేశం విషయాలను విశ్వనాధ్, పవన్ సంతోష్ లు వివరించారు. తెలుగు సముదాయానికి ప్రత్యేకంగా యూజర్ గ్రూప్స్ ఎందుకు అవసరమో ?, దానిద్వారా ఏంఏం పనులు చేయగలమో తెలిపారు. దీనికోసం వికీమీడియా ఫౌండేషన్ సభ్యులను సంప్రదించామని, వారు సానుకూలంగా స్పందించాని, ఒకటి రెండు వారాల్లో యూజర్ గ్రూపుకై కావలసిన పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. బెంగుళూరులో జరిగిన వికీపీడియనుల అంతర్గత సమూహ సంప్రదింపుల సమావేశం విషయాలను ఇక్కడ చూడవచ్చని అన్నారు.
వికీ జీరో గురించి విష్ణు వివరించారు. అన్ని నెట్ ప్రొవైడర్లు వికీ కొరకు ఉచితంగా డాటా ఇచ్చేవిధంగా ప్రతిపాదనలు తెస్తున్నామనీ, దానికోసం ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు.
మూలాల గురించి, సమగ్ర వ్యాసాల నాణ్యతను మెరుగుపరచడం వంటి వాటి గురించి పవన్ సంతోష్ అడిగిన ప్రశ్నలకు రాజశేఖర్, వీవెన్ క్లారిటీ ఇచ్చారు.
వచ్చే నెలలో వికీసోర్స్ లో కాంపిటీషన్ నిర్వహిస్తున్నామనీ, దానికోసం కొన్ని కళాశాలను ఎంచుకున్నామనీ త్వరలోనే అది మొదలవుతుందని చెపుతూ... ఎలా నిర్వహించదలచారో విష్ణు వివరించారు.
కొత్తగా 12 పుస్తకాలను వికీపీడియాలో చేర్చేందుకు ఆ పుస్తక రచయిత ఒప్పుకున్నారనీ.. వికీపీడియా నెలవారి సమావేశంలో ఆ పుస్తకాల విడుదల కార్యక్రమం నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నామని విష్ణు తెలిపారు.
గతంలో నిర్వహించిన తెవికీ ఉగాది మహోత్సవం, తెవికీ దశాబ్ది మహోత్సవాల్లో వికీపీడియన్లు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరకిందనీ... అలాంటి కార్యక్రమం ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తే బాగుంటుందనీ సమావేశంలో పాల్గొన్న సభ్యులు కోరగా... విష్ణు కూడా సానుకూలంగా స్పందించి తమ అంగీకారాన్ని తెలిపారు. తక్షణమే తెలుగు వికీపీడియా 11వ వార్షికోత్సవ కార్యక్రమ ఏర్పాట్లు ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ వికీపీడియన్లు బాధ్యత వహించాలనీ.. మిగతా వారంతా సహకారం అందించాలని నిర్ణయించారు.