గుళ్ళపల్లి
స్వరూపం
గుళ్ళపల్లి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°03′01″N 80°41′16″E / 16.050139°N 80.687761°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | చెరుకుపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522309 |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
గుళ్ళపల్లి బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామంలోని విద్యా సౌకర్యాలు
[మార్చు]- జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
- మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల (హెచ్.ఇ).
- బి.సి.బాలుర వసతిగృహం.
గ్రామంలోని మౌలిక సదుపాయాలు
[మార్చు]బ్యాంకులు
[మార్చు]ఆంధ్రా బ్యాంకు. బ్రాంచి ఉంది.
గ్రామ పంచాయతీ
[మార్చు]- చెరుకుపల్లి, గుళ్ళపల్లి కవల (జంట) గ్రామాలు. జనాభా సుమారు 50,000. (రెండూ కలిపి), వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రామాలు.
- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ తలతోటి వెంకటేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- శ్రీ గంగాంబికా సమేత ఆనందీశ్వరస్వామి ఆలయం:- ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చు, శివుని జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం నకు అత్యంత విశిష్టత ఉన్నది గనుక, ఆ రోజున ఇక్కడ శివునికి ఆన్నాభిషేకం జరిపించెదరు. స్వామివారికి పలు రకాల పండ్లరసాలతో ఏకాదశరుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించెదరు. [2]
- గ్రామ దేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి 19వ తిరునాళ్ళు, 2014,మే- 23 నుండి 25 వరకు నిర్వహించెదరు. 23 ఉదయం గ్రామస్థులు అమ్మవారికి బిందెలతో నీరు సమర్పించెదరు. 24న పద్మశాలీయ సంఘ సభ్యులతో పసుపు, కుంకుమ, చద్ది నివేదనల సమర్పణ, 25న విశేష పూజలతో అమ్మవారి తిరునాళ్ళు, రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. 2016,ఆగస్టు-12వ తేదీ నుండి మొదలగు కృష్ణానది పుష్కరాలకు, ఈ ఆలయ అభివృద్ధిపనులకై, ప్రభుత్వం 4.5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది. [3]&[7]
- శ్రీ నాగారమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారికొలువులు 2014, మే-29 నుండి జూన్-2 వరకు వైభవంగా నిర్వహించారు. చివరి రోజున అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరె సమర్పించారు. పొంగళ్ళు వండి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. సాయంత్రం గ్రామంలో అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. [4]
- శ్రీ అంకమ్మ తల్లి ఆలయం:- గుళ్ళపల్లి గ్రామంలోని "ఉల్లంగుంట" వంశస్తుల ఇలవేలుపు, శ్రీ అంకమ్మ తల్లి మూడురోజుల కొలువులు, 2014 శ్రావణమాసంలో ఆగస్టు-1,2,3 తేదీలలో ఘనంగా నిర్వహించారు. ఆఖరి రోజైన 3వతేదీ ఆదివారం నాడు, ఉదయం అమ్మవారికి భక్తులు పసుపు, కుంకుమ సమర్పించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. యువతీ యువకులు ఒకరిపై ఒకరు పసుపు నీళ్ళు జల్లుకుంటూ, అమ్మవారికి వసంతోత్సవం నిర్వహించారు. [5]
- శ్రీ రామాలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. మరుసటిరోజున సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించి, గ్రామంలో అన్నదానం నిర్వహించెదరు. [6]
- శ్రీ సువర్చలా సమేత శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2017,జులై-3వతేదీ సోమవారం రాత్రి, స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. 5వతేదీ రాత్రి గుళ్ళపల్లి, చెరుకుపల్లి గ్రామాలలో, శ్రీ సువర్చలా సమేత శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు స్వామివారి ప్రసాదం పంపిణీ చేసారు. [8]
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవశాఆయాఆధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
[మార్చు]- ఇంకొల్లు వెంకటేశ్వరరావు, బాల సాహిత్యకారుడు,కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత