వికీపీడియా:సమావేశం/ఇందూ జ్ఞాన వేదిక పుస్తకాల పునర్విడుదల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆహ్వాన పత్రం

తెలుగు వికీపీడియా, వికీసోర్స్ ద్వారా తమ సంస్థ ప్రచురణలను జనాలకి అందివ్వాలని ఇందూ జ్ఞాన వేదిక సంస్థ వారు వారి పుస్తకాలను CC-BY-SA 3.0 లైసెన్స్ ద్వారా విడుదల చేయనున్నారు.

కార్యక్రమ వేదిక

[మార్చు]

తేదీ, సమయం

[మార్చు]

జూన్ 22, 2014 - ఉదయం 10 గం॥ నుండి 1 గం॥

సమయప్పట్టిక

[మార్చు]
క్రమ సంఖ్య కార్యక్రమ అంశం అంశం విస్తృతం నిడివి సమయం వరకు
1 స్వాగతం స్వాగత సందేశం, అతిథులను సభపైకి పిలవటం 5-10 ని॥ 10:10
2 నివేదిక ఇందూ జ్ఞాన వేదిక – శ్రీ ప్రబోధానంద 20 ని॥ 10:30
3 తెలుగులో అంతర్జాలం - రహంతుల్లా 15 ని॥ 10:45
4 స్వేచ్ఛా లైసెన్సులు వాడుకరి దృక్కోణంలో - వీవెన్ 10 ని॥ 10:55
5 భారతీయ భాషలలో క్రియేటివ్ కామన్స్ స్వేచ్ఛా లైసెన్సుల ప్రాముఖ్యత - విష్ణు 10 ని॥ 11:05
6 ఇందూ జ్ఞాన వేదిక పుస్తకాల పునర్విడుదల క్రమము - ఉషశ్రీ 5 ని॥ 11:10
7 సమ్మతిపత్రం పై దస్ఖతు 11:15
8 టీ విరామం 15 ని॥ 11:30
9 వికీసోర్స్ ప్రదర్శన ప్రశ్నోత్తరాలతో సహా 30 ని॥ 12:00
10 క్రియేటివ్ కామన్స్ పై చర్చా వేదిక (వీవెన్(వాడుకరి), భువన్ కృష్ణ (స్వేచ్ఛ), విష్ణు, పెద్ది రామా రావు(రచయిత) - తాత్కాలికంగా ) ప్రశ్నోత్తరాలతో సహా 60 ని॥ 1:00
11 ప్రెస్ మీట్ 30 ని॥ 1:30
12 భోజన విరామం 1:15 నుండి 60 ని॥ 2:15
13 తెవికీ నెలవారీ సమావేశం 2:30 నుండి
14 ఇందూ జ్ఞాన వేదిక సభ్యులకు తెవికీ శిక్షణ ఏకకాలంలో పక్క పక్కనే

తప్పక పాల్గొనేవారు

[మార్చు]
  1. రహ్మానుద్దీన్ (చర్చ)
  2. వీవెన్ (చర్చ)
  3. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ) 14:04, 17 జూన్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  4. విష్ణు (చర్చ)06:41, 18 జూన్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  5. --Rajasekhar1961 (చర్చ) 18:03, 18 జూన్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  6. Malladi kameswara rao (చర్చ) 20:00, 18 జూన్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  7. Bhaskaranaidu (చర్చ) 09:13, 19 జూన్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  8. వాడుకరి:గుళ్ళపల్లి (చర్చ) --గుళ్ళపల్లి 10:10, 19 జూన్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]
  9. ప్రవీణు (చర్చ)
  10. ప్రవీణ్ కుమార్ గోలివాడ (చర్చ) 12:15, 20 జూన్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

<హ్యాష్ వాడి మీ పేరు నమోదు చేయండి>

బహుశా పాల్గొనే వారు

[మార్చు]
  1. నాగ బాబు
  2. <#--Nrahamthulla (చర్చ) 14:38, 19 జూన్ 2014 (UTC)>[ప్రత్యుత్తరం]

కార్యక్రమ నివేదిక

[మార్చు]

తెలుగు పుస్తక ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఒకే రచయిత రాసిన 10 పుస్తకాలు క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ ద్వారా విడుదల అయ్యాయి. ఈ కార్యక్రమం 2014, జూన్ 22 న ఉదయం 10 గంటలకు హైదరాబాదు లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో జరిగింది.

అనుకున్నవిధంగా కార్యక్రమ ఏర్పాట్లు జరిగాయి. హైదరాబాదు లోని గోల్డెన్ త్రెషోల్డ్ ప్రముఖులతో కళకళలాడింది. ఉదయం 9 గంటలకు తెలుగు వికీపీడియన్లు, ఇందూ జ్ఞాన వేదిక సంస్థ ప్రతినిధులు రావడం జరిగింది. 9.30 ని.లకు ఇందూ జ్ఞాన వేదిక సంస్థ స్థాపకులు, త్రైత సిద్ధాంత ఆదికర్త ప్రబోధానంద యోగీశ్వర్లు గారు వచ్చారు.

10 గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా రహ్మనుద్దీన్ గారు స్వాగతోపన్యాసం చేస్తూ...ప్రబోధానంద యోగీశ్వర్లు గారిని, శ్రీశైలం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్, తెలుగు భాషోద్యమకారులు రహంతుల్లా గారిని, వీవెన్ గారిని, సీఐఎస్ ప్రతినిధులు విష్ణువర్థన్ గార్లను వేదికపైకి ఆహ్వానించారు.

అనంతరం ఇందూ జ్ఞాన వేదిక సంస్థ స్థాపకులు, త్రైత సిద్ధాంత ఆదికర్త ప్రబోధానంద యోగీశ్వర్లు గారు ఇందూ జ్ఞాన వేదిక గురించి వివరిస్తూ... బ్రహ్మ విద్యా శాస్త్ర ఆధారంగా శాస్త్రీయతను, అశాస్త్రీయతను, ఆస్తికుల, నాస్తికుల వాస్తవమును, మూఢనమ్మకముల మూఢత్త్వమును తెలియజేయుటకు, కుల, మత రహిత సమాజ నిర్మాణ ఉద్దేశ్యంతో 2004 సంవత్సరములో ఇందూ జ్ఞాన వేదిక (Regd. No. 168/2004) స్థాపించబడినదని, మనుషులందరికీ దేవుడు ఒక్కడేననీ, భగవద్గీత, బైబిలు మరియు ఖురాన్ లలో ఉన్న దైవ జ్ఞానం ఒక్కటేనని శాస్త్ర బద్ధంగా తెలియచేస్తూ తన రచనలను, ప్రసంగాలను ఇందూ జ్ఞాన వేదిక ప్రచారం చేస్తున్నదని తెలిపారు. అంతేకాకుండా భగవంతుడు తనకు ఉచితంగా ఇచ్చిన జ్ఞానాన్ని ప్రపంచానికి ఉచితంగానే ఇవ్వాలనే సంకల్పంతో కాపి హక్కులు విడుదలచేశామన్నారు.

ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్, తెలుగు భాషోద్యమకారులు రహంతుల్లా గారు తెలుగులో అంతర్జాలం గురించి మాట్లాడుతూ.. తెలుగు అధికార భాష కు సంబంధించి ఆయన చేసిన కృషిని జరుగవలసిన కృషిని వివరిస్తూ... ప్రభుత్వం తెలుగుకు ప్రాధాన్యత ఇస్తేనే ప్రజల్లో తెలుగు పునర్వైభవం పొందుతుందని పేర్కొన్నారు. చిత్తశుద్ది ఉంటే తెలుగును ప్రభుత్వపరంగా అమలుచేయడానికి సాంకేతిక సమస్యలేవి లేవన్నారు.

వీవెన్ గారు వాడుకరి దృక్కోణంలో స్వేచ్ఛా లైసెన్సులు అనే అంశంపై మాట్లాడుతూ... రచయితలకు క్రియేటివ్ కామన్స్ ఎందుకు అవసరం అన్న విషయం వివరించారు. ప్రతి రచయిత కాపీ హక్కుల గురించి, సీ సీ లైసెన్స్ గురించి తెలుసుకొని తమ అవసరానికితగ్గ సీ సీ లైసెన్స్ లో పుస్తకాలు విడుదలచేయాలన్నారు.

సీఐఎస్ ప్రతినిధులు విష్ణువర్థన్ భారతీయ భాషలలో క్రియేటివ్ కామన్స్ స్వేచ్ఛా లైసెన్సుల ప్రాముఖ్యత గురించి వివరించారు.

ఉషశ్రీ గారు ఇందూ జ్ఞాన వేదిక పుస్తకాల పునర్విడుదల క్రమము ఎలా జరిగింది అన్నదానిపై వివరణ ఇచ్చారు.

అనంతరం పుస్తకాల కాపీ హక్కుదారులు, రచయిత ప్రబోధానంద యోగీశ్వర్లు క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ లో విడుదల చేసేందుకు సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు.

అనంతరం పది పుస్తకాలను వికీపీడియన్లు రాజశేఖర్, భాస్కరనాయుడు, గుళ్లపల్లి, రహంతుల్లా, వీవెన్, రహ్మనుద్దీన్, ఇళ్ల ప్రవీణ్, పవన్ సంతోష్, ప్రణయ్‌రాజ్ లకు తొలి ప్రతులు అందజేశారు. ఇంత భారీ స్థాయిలో క్రియేటివ్ కామన్స్ లో తెలుగు పుస్తకాలను విడుదల చేయడం ఇదే మొదటి సారి.

ఆపై సీఐఎస్ ప్రతినిధులు విష్ణు, రహ్మానుద్దీన్ తెలుగు వికీపీడియా, వికీసోర్స్, క్రియేటివ్ కామన్స్ గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హిందూ జ్ఞాన వేదిక జాయింట్ సెక్రటరీ ఎం. సూర్యనారాయణ, కోశాధికారి గుత్త యోగానంద చౌదరి, ఖుదా ఇస్లామిక్ స్పిరిట్యువల్ సొసైటీ ఉపాధ్యక్షలు షేక్ ఇబ్రహీం, ప్రముఖ పాత్రికేయులు మహ్మద్ అజీజ్ రహ్మన్ తదితరులు పాల్గొన్నారు.

పుస్తకాల క్రియేటివ్ కామన్స్ విడుదల

[మార్చు]

10 పుస్తకాలను క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ కింద విడుదల చేసిన పత్రం

ప్రబోధానంద ద్వారా ఈ పుస్తకాలన్నీ విడుదల చేయబడ్డాయి

చిత్రమాలిక

[మార్చు]

మరికొన్ని చిత్రాలు

[మార్చు]

ఇతరములు

[మార్చు]