Jump to content

వాడుకరి చర్చ:Arjunaraoc/పాత చర్చ 7

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పాత చర్చ 6 | పాత చర్చ 7 | పాత చర్చ 8

నిర్వాహకత్వ బాధ్యతల తొలగింపు విధానం గురించి..

[మార్చు]

మీరు వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ పేజీలో చేసిన మార్పుచేర్పులు చూసాను. వాటిని బట్టి, ఒక నిర్వాహకుని నిర్వాహక హక్కులను అధికారి ఉపసంహరించవచ్చు అని మీ అభిప్రాయంగ ఉందని నాకు అనిపించింది. అది కుదరదు, కదా? __చదువరి (చర్చరచనలు) 05:48, 3 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@చదువరి, అవునండి పొరబాటు పడ్డాను. నిర్వాహకుని హోదా ఇవ్వగలిగినపుడు, తొలగించటం కూడా వుంటుందన్న భ్రమలో వున్నాను. వికీలో సాధారణ నియమాలు పనిచేసేటట్లులేవు.--అర్జున (చర్చ) 09:52, 3 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

220-మాచెర్ల వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

వ్యాసం పేజీనా? మూస పేజీనా?

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. రహ్మానుద్దీన్ (చర్చ) 07:08, 1 ఏప్రిల్ 2019 (UTC) రహ్మానుద్దీన్ (చర్చ) 07:08, 1 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చ:220-మాచెర్ల లో స్పందన చూడండి.--అర్జున (చర్చ) 10:02, 1 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

218-వినుకొండ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఇలాంటి పేజీలను వ్యాసపేరుబరిలో చేర్చరాదు. ఇవి మూసలుగా లేదా ప్రాజెక్టు ఉపపేజీలుగా చేర్చాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. రహ్మానుద్దీన్ (చర్చ) 07:09, 1 ఏప్రిల్ 2019 (UTC) రహ్మానుద్దీన్ (చర్చ) 07:09, 1 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చ:218-వినుకొండ లో స్పందన చూడండి. --అర్జున (చర్చ) 10:02, 1 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

విజయవాడ వ్యాసం మార్పులు

[మార్చు]

అర్జున గారు, నమస్కారం. నేను విజయవాడ వ్యాసంలో అధిక భాగం వ్రాసి, పని చేసి ఉన్నాను. ప్రస్తుతం వాడుకరి: ‎Pavan santhosh.s గారు, అత్యధిక భాగాలు తెవికీకి అనుగుణంగా సమాచారం తొలగిస్తూ అనేక మార్పులు చేస్తున్నారు, ఆ వ్యాసం మీద పని చేసి ఉన్నవాళ్ళు, అందుబాటులో ఉన్నవారితో తెలియజేయ వలసిన అవసరం ఉందో లేదో, అధిక సమాచారం తొలగిస్తున్నప్పుడు చర్చ చేయాలో లేదో కూడా నాకు తెలియదు . తన తెవికీ ధోరణిలో వారు వ్రాయవచ్చును, మార్పులు చేస్తూ ఉండవచ్చును. దయచేసి ఒకసారి పరిశీలించి, ఏమైనా అవసరమైతే వారికి సలహాలు, సూచనలు ముందుగానే ఇస్తే బావుంటుందని నా అభిప్రాయం. JVRKPRASAD (చర్చ) 12:22, 27 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@JVRKPRASAD గారికి, విజయవాడ వ్యాసాన్ని ఆదర్శ నగర వ్యాసంగా కృషి చేస్తున్నానని పవన్ సంతోష్ గారు రచ్చబండలో చెప్పివున్నారు, మీరు ఆ వ్యాసంపై అధికంగా కృషిచేశారంటున్నారు కాబట్టి, ఆయన చేసే మార్పులు, వాటికి ఇచ్చిన వ్యాఖ్యలు చూసి మీకు సమంజసంగా అనిపించకపోతే ఆ వ్యాస చర్చాపేజీలో చర్చ ప్రారంభించండి. {{సహాయం కావాలి}} మూస కూడా చేర్చితే ఆసక్తివున్న సభ్యులు కూడా చర్చలో పాల్గొంటారు. సమర్ధవంతమైన చర్చలు ద్వారానే కదా, ఏ వ్యాస నాణ్యతైనా మెరుగుపడేది.--అర్జున (చర్చ) 00:28, 28 ఏప్రిల్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Please Block

[మార్చు]

Bonadeav and Bonadea Trsnxine (చర్చ) 04:38, 2 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ఈరోజు వికీపీడియా చదువుతున్నాను. అయితే ఒక పేజీని ఎంతగా నాశనం చేశారో చూడండి Please block following wikipedia telugu accounts Bonadeav and Bonadea

ఈ రెండు ఐడీల హిస్టరీ చూడండి

వారు ఏం చేశారో మీకు తెలుస్తుంది

నాకు విషయం చెప్పండి.


ఈ రెండు ఐడి లు చేసిన నష్టాన్ని నిన్ను చూశాను అందుకే మీకు కంప్లైంట్ చేస్తున్నాను

నమస్కారములు

తెలుగు వికీపీడియాకి మీరు చేసే సేవలు చాలా గొప్పవి. నాకు ఏదో ఒక విషయం సమాధానం చెప్పండి.

Trsnxine గారికి, ఇప్పుడు వికీపీడియాలో సార్వత్రిక ఖాతాలున్నాయి. మీరు ఫిర్యాదు చేస్తున్న వ్యక్తి తెలుగులో చేసిన రచనలు చాలా కొద్ది మరి, అవి ఇతరులు చేసిన రచనలతో పోలివున్నవి. అటువంటి వాటిని తొలగించాలని తెలుగువికీలో నిర్ణయం కాలేదు. మరియు మీరు వాడుకరిపేరు ఎడల అభ్యంతరము గురించి, తెలుగువికీకి సంబంధించినంతవరకు ఆ పదం దేవుడిపేరుగా వాడుకలో లేనిది కనుక, ఇక్కడ చర్యతీసుకోవటము సరికాదనుకుంటాను. ఇకమీదట నిర్వాహక చర్యల గురించి సంప్రందించదలిస్తే మీరు వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు లో వ్యాఖ్య చేర్చండి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 05:49, 2 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు సమాధానం చెప్పినందుకు ధన్యవాదములు నేను మీరు చెప్పినట్లుగానే కంప్లైంట్ చేశాను :Trsnxine 2019-05-02T12:38:35

Thanq for correction my mistake

[మార్చు]

I was added 3 jesus links which which were blocked for violate user name policy ( God names prohibited in wiki) Trsnxine (చర్చ) 07:08, 2 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మీ ప్రోఛాహానికి కృతగ్నురాలను

[మార్చు]

"50 రోజులు ఆడిన సూపర్ హిట్ సినిమాలు" .ప్రతి సినిమా కు మూలాలు జోడించాను. పోస్ట్ చేసాను ..నమస్కారముల తో (అరుణ (చర్చ) 15:15, 9 మే 2019 (UTC))[ప్రత్యుత్తరం]

అరుణ గారికి, నా స్పందన చర్చ:2018 లో విడుదలై 50 రోజులు ఆడిన సినిమాలు లో చూడండి.--అర్జున (చర్చ) 04:04, 10 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

ఉన్నది రెండు పర్యాయాలు ఒకే ముఖ్యమంత్రి ఉన్నారు. ఇప్పటికి జాబితా ప్రయోజనకరం కాదు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. పవన్ సంతోష్ (చర్చ) 04:50, 1 జూన్ 2019 (UTC) పవన్ సంతోష్ (చర్చ) 04:50, 1 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చ:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా లో స్పందన ఇవ్వబడింది.--అర్జున (చర్చ) 04:15, 5 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Hi. I am usual content editor of Bangla Wikipedia. I want to start editing in telegu wikipedia. I want to know about it. The first question is - how many content in telegu wikipedia and how to show it?Wiki Ruhan (చర్చ) 18:37, 2 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@Wiki Ruhan, Please check https://stats.wikimedia.org/v2/#/te.wikipedia.org/content/pages-to-date/normal%7Cline%7Call%7C~total%7Cmonthly -- అర్జున (చర్చ) 05:27, 3 ఆగస్టు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

మీ సాంకేతిక కృషి

[మార్చు]

అర్జున గారూ, మీ సాంకేతిక సంపత్తి తెవికీకి ఎంతో బలం. బాటు ద్వారా గాని, మూసలు, సమాచారపెట్టెల ద్వారా గానీ తెవికీ అభివృద్ధికి మీరు చేస్తున్న కృషి అద్వితీయం. మీ కృషికి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతూ గౌరవ పురస్సరంగా ఈ చిరు కానుక సమర్పిస్తున్నాను. స్వీకరించగలరు.

The da Vinci Barnstar
తెవికీకి మీరు అందిస్తున్న సాంకేతిక శక్తికి గాను, కృతజ్ఞతలతో.. చదువరి (చర్చరచనలు) 06:59, 20 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, మీ కానుకకి ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 03:59, 21 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

దీన్ని పరిశీలించగలరు

[మార్చు]

మూస:Yashwanth Chinthapatla లో లిప్యంతరీకరణ గురించి రాసుకున్నారు. తొలగించే ముందు, లిప్యంతరీకరణ గురించిన ఈ సమాచారం ఏ పేజీలో ఉందా అని చూసాను గానీ కనబడలేదు. ఈ పేజీని తొలగించాలో, ప్రధాన పేరుబరికి తరలించాలో పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 13:34, 10 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారికి, వికీపీడియా:టైపింగు సహాయం కు నకలు మాత్రమే. తొలగించుతాను.--అర్జున (చర్చ) 05:19, 11 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
సరే, సార్. ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 05:21, 11 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు సృష్టించిన ఈ వ్యాసాలు ఒకసారి పరిశీలించండి

[మార్చు]

అర్జునరావు గారూ నమస్కారం.తెలుగు వికీపీడియాలో ఉండవలసిన ఈ దిగువ వ్యాసాలు మంచి ఆలోచనతో సృష్టించారు.కానీ ఆ వ్యాసాలు చాలాకాలం నుండి ఆ వ్యాసాలకు తగ్గట్టు పూర్తిరూపం సంతరించుకోకుండా అసంపూర్తిగా ఉన్నవి.బహుశా వాటిని గమనించిఉండరని అనుకుంటున్నాను. వీటిని వ్యాసాలకు తగ్గట్టుగా పూర్తిరూపం కల్పించగలరు.

--యర్రా రామారావు (చర్చ) 03:59, 5 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారికి, పై వ్యాసాలు తాజా చేసి కొంత విస్తరించాను.-- అర్జున (చర్చ) 10:26, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జునరావు గారూ మీరు స్పందించి, మీ సమయాన్ని వెచ్చించి వ్యాసాలు అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 10:47, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ పాత వ్యాసాల్లోని మూలాలను ఆర్కైవ్ చేయడం గురించి

[మార్చు]

నమస్కారం అర్జున గారు, తెలుగు వికీపీడియాలో మూలాల సమస్య ఉన్న విషయం మీకూ తెలుసు. ఈరోజు మనం పెట్టిన మూలం లింక్ కొన్నిరోజులకు డెడ్ లింక్ అవుతోంది. పాత వ్యాసాలలో మూలాల లింకులు కొన్ని డెడ్ లింకులు అవ్వగా, కొన్ని లైవ్ గానే ఉన్నాయి. వాటిని మనం ఆర్కైవ్ చేయకుంటే అవికూడా డెడ్ లింక్స్ అయ్యే అవకాశం ఉంది. User:InternetArchiveBot కొత్త వ్యాసాల మూలాల లింకులను, పాత వ్యాసాలలో పెట్టిన కొత్త మూలాల లింకులను మాత్రమే ఆర్కైవ్ చేస్తోంది. పాత వ్యాసాలలోని పాత లింకులను కూడా ఆర్కైవ్ చేసేందుకు బాటు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:16, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

User:Pranayraj1985 గారికి, నాకు తెలిసినంతవరకు, InternetArchiveBot తనకు తాను ఆర్కైవ్ చేయదు. ఇతరులు ఆర్కైవ్ చేసినవి పనిచేయని లింకు, లేక పనిచేస్తున్న లింకుకు ఆర్కైవ్ మూలం చేరుస్తుంది. కొత్త వ్యాసాలు రాసేవారు ఆర్కైవ్ చేయటవలన, బాట్ తర్వాత లింకు చేరుస్తుండవచ్చు. మీ గమనింపులో బాటే ఆర్కైవ్ చేసిన వెబ్ మూలపు పేజీ ఏదైనా వుంటే దాని లింకు తెలపండి. అన్నట్లు ఈ బాటుకు సాంకేతికంగా మార్పులు చేయటం కేంద్రీకృతమైనందున, అభ్యర్ధనలు ఆంగ్ల వికీలో చేయాలి. --అర్జున (చర్చ) 06:49, 14 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మీ స్పందనకు ధన్యవాదాలు అర్జున గారు, పాత వ్యాసాలలోని పాత లింకులను కూడా ఆర్కైవ్ చేసేందుకు ఏదైన బాటు ఉందేమో చూడాలి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:09, 15 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు, కబడ్డీ కబడ్డీ వ్యాసంకు సంబంధించిన ఈ మార్పును చూడండి. వ్యాసానికి 2016 డిసెంబరు 1న ఇచ్చిన మూలానికి 2017 జూలై 10న అర్కైవ్ చేసిన ఆర్కైవ్ మూలం User:InternetArchiveBot ద్వారా జతచేయబడింది. అలా అన్ని వ్యాసాలకు కూడా ఆర్కైవ్ లింకు InternetArchiveBot ద్వారా చేరిస్తే బాగుంటుంది.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 14:52, 9 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Pranayraj Vangari గారికి, ఆ ఆర్కైవ్ లింక్ లో About the capture అనేది చూస్తే Alexa Internet Search engine ద్వారా భద్రపరచబడినదని తెలిసినది. మన వికీపీడియా లో కొన్ని లింకులను Alexa Internet Search Engine భద్రపరుస్తున్నది కావున IABot వాడుతున్నది. Alexa Internet Search engine, ఎక్కువ ప్రజాదరణ పొందిన సైట్లను మాత్రమే భద్రపరుస్తుందనుకుంటాను. మనకు కావలసిన వాటిని మనం భద్రపరచటమే మంచిది. అర్జున (చర్చ) 05:42, 10 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మనలో కొందరు వాడుకరులకూ, కొత్త వాడుకరులకు లింకులను వెబ్ ఆర్కైవ్ లో భద్రపరచాలనికానీ, భద్రపరిచే విధానం కానీ తెలియకపోవచ్చు. అలాంటి సందర్భంలో బాట్ ద్వారా లింకులను భద్రపరిచేలా చూడాలి. Pranayraj Vangari (Talk2Me|Contribs) 05:58, 10 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

[Small wiki toolkits – Indic workshop series 2020] Register now! - Reminder

[మార్చు]

Note:You have received this message as you an interface-admin on your home Wikimedia project.


Greetings, hope this message finds you all in the best of your health, and you are staying safe amid the ongoing crisis.

Firstly, to give you context, Small wiki toolkits (SWT) is an initiative to support small wiki communities, to learn and share technical and semi-technical skills to support, maintain, and grow. We are happy to inform you that the SWT group has planned a series of four online workshops for Indic Wikimedia community members during June & July 2020. These workshops have been specifically designed and curated for Indic communities, based on a survey conducted early this year. The four workshops planned in this regard are;

  • Understanding the technical challenges of Indic language wikis (by Birgit): Brainstorming about technical challenges faced by contributors to Indic language Wikimedia projects.
  • Writing user scripts & gadgets (by Jayprakash12345): Basics to intermediate-level training on writing user scripts (Javascript and jQuery fundamentals are prerequisites).
  • Using project management & bug reporting tool Phabricator (by Andre): Introduction to Phabricator, a tool used for project management and software bug reporting.
  • Writing Wikidata queries (by Mahir256): Introduction to the Wikidata Query Service, from writing simple queries to constructing complex visualizations of structured data.
You can read more about these workshops at: SWT Indic Workshop Series 2020/Workshops -- exact dates and timings will be informed later to selected participants.

Registration is open until 24 May 2020, and you can register yourself by visiting this page! These workshops will be quite helpful for Indic communities to expand their technical bandwidth, and further iterations will be conducted based on the response to the current series. Looking forward to your participation! If you have any questions, please contact us on the talk page here. MediaWiki message delivery (చర్చ) 14:06, 22 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Twinkle not working correctly

[మార్చు]

Sorry for not writing in Tamil. Please check this problem. I think as stated in this, the file మీడియావికీ:Vector.css needs to be edited in the following method: Under the comment 'Menu over FR box', the word div.vectorMenu needs to be replaced by div.vector-menu and the last css block in the same page needs the same correction. If you can, please check if Twinkle works correctly after making this change and if it resolves the issue, please mention it here. Adithyak1997 (చర్చ) 17:33, 18 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ, మీడియావికీ:Vector.css లో పైన చూపిన మార్పులు చేసాను గానీ, పని జరగలేదు. సరిగా చేసానో లేదో పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 00:12, 19 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Thanks Adithyak1997 for your help. చదువరి గారికి, It needed changes to Mediawiki:Gadget-Twinkle.js as well. I made an attempt but could not fix the error. Requested help on en:WT:TW--అర్జున (చర్చ) 11:04, 19 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 11:10, 19 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు అర్జున గారూ --యర్రా రామారావు (చర్చ) 11:24, 19 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
@చదువరి ,@యర్రా రామారావు It is fixed now. --అర్జున (చర్చ) 11:55, 19 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
టింక్విల్ అయితే పరిశీలించలేదుగానీ, చేతనం చేసినా ఎడిట్ మోడ్ అదివరకటిలాగే ఉంది.--యర్రా రామారావు (చర్చ) 12:03, 19 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, సమస్య పరిష్కారమై పోయింది. ధన్యవాదాలు. యర్రా రామారావు గారూ, మీరు చెప్పేది అర్థం కాలేదు. ఉన్న సమస్యల్లా ట్వింకిల్ తోటే కదా. గతంలో TW అనే పేరు మీదకు మౌసు పోయినపుడు ట్వింకిల్ మెనూ కనబడేది. ఈ మధ్య ఆ మెనూ అంశాలన్నీ ముందే పేజీలో పరుచుకుని కనిపించేవి, చిరాక్కలిగించేవి. ఇప్పుడు మళ్ళి తమ మామూలు స్థితికి వెళ్ళిపోయాయి, సుఖాంతమై పోయింది. మీరు గమనించినది ఇది కాదా? __చదువరి (చర్చరచనలు) 05:22, 20 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఆటోమేటిక్ మూలం చేర్పులో దోషం

[మార్చు]

కొన్ని సైట్లను ఆటోమేటిక్ గా మూలాలు చేర్చే విధానంలో .html తరువాత "/" గుర్తు చేరుతున్నందున (.html/) మూలం చేర్చిన తరువాత ఆ మూలం ఓపెన్ కావడం లేదు. సరిచేయగలరు. ఉదా:

"Andhra Pradesh Assembly Election Results in 2019". Elections in India. Retrieved 2020-07-12.  K.Venkataramana(talk) 13:29, 12 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
User:K.Venkataramana గారు, ఆటోమేటిక్ గా అంటే ఏ విధంగా, విజువల్ ఎడిటర్లోనా, వివరించండి. చివరిలో /వస్తే అప్రమేయంగా విహరిణి index.html కొరకు చూస్తుంది. కావున చేర్చేటప్పుడే అలాకాకుండా చూసుకోవాలి.--అర్జున (చర్చ) 13:38, 12 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
విజువల్ ఎడిటర్ లో మూలం చేర్చేటప్పుడు చివరికి html మూలాలకు అలా దోషం వస్తుంది. చివరికి .com వచ్చేవాటికి అలా దోషం రావడం లేదు. K.Venkataramana(talk) 13:44, 12 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
User:K.Venkataramana గారు,https://www.mediawiki.org/wiki/Help:VisualEditor/User_guide#Adding_a_new_reference లో ఏ పద్ధతిలో మూలాలు చేరుస్తున్నారు. నేను ప్రయత్నించాను కాని దోషం కనబడలేదు. మరింత వివరించండి.--అర్జున (చర్చ) 05:12, 13 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

టైపింగ్ దోషం

[మార్చు]

అర్జున రావు గారూ, కొన్ని పదాలు రాసేటప్పుడు దోషాలొస్తున్నాయి. ఉదాహరణకు teens వ్రాసినపుడు "టీన్స్" అని టైప్ అవుతుంది. ఇందులో పొల్లు బయటికి వెళ్ళి పోతుంది. దీనిని సరిదిద్దగలరు. K.Venkataramana(talk) 17:07, 17 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

.User:K.Venkataramana గారు, చర్చ సంబంధిత చర్చాపేజీలో కొనసాగించుతున్నాను. --అర్జున (చర్చ) 11:59, 18 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు అనువాద వ్యాసాల పతకం

[మార్చు]
తెలుగు అనువాద వ్యాసాల పతకం
Arjunaraoc గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున (చర్చ) 07:40, 13 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

We sent you an e-mail

[మార్చు]

Hello Arjunaraoc/పాత చర్చ 7,

Really sorry for the inconvenience. This is a gentle note to request that you check your email. We sent you a message titled "The Community Insights survey is coming!". If you have questions, email surveys@wikimedia.org.

You can see my explanation here.

MediaWiki message delivery (చర్చ) 18:54, 25 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నాయిబ్రాహ్మణ వికీపీడియా లాక్ తొలిగించవలసిందిగా ప్రార్ధన

[మార్చు]

నాయీబ్రాహ్మణ వికీపీడియా ఒక సంవత్సరం పైగా లాక్ లో ఉంది.. దయచేసి ఆ లాక్ తొలగిస్తే వికీపీడియా లోని మ్యాటర్ పెంచగలము Nayeevaidya (చర్చ) 03:29, 11 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Nayeevaidya గారు, ఈ చర్చ సంబంధిత చర్చా పేజీలో చర్చించటమే మెరుగు. వ్యాసానికి సంబంధించిన గత చర్చలను పరిశీలించాను. సంవత్సరం పైగా సంరక్షించబడిందని సంరక్షణ తొలగించటానికి కారణం కాదు. ఎందువలన సంరక్షించబడిందో, ఆ పరిస్థితులు లేవని తెలిపితే సంరక్షణ విధించిన నిర్వాహకులు లేక క్రియాశీలంగా వున్న నిర్వాహకులు సంరక్షణ తొలగించే విషయం పరిశీలిస్తారు. కావున మీరు ఆ వ్యాసంలో చేర్చవలసిన వివరణ చిత్తు ప్రతిని మీ వాడుకరి ఉపపేజీ లో రాసి ఆ విషయం ఆ వ్యాస చర్చాపేజీలో తెలియజేయండి. ఆ చర్చలో {{సహాయం కావాలి}} మూస చేర్చితే ఇతర వికీపీడియన్లకి తెలిసి స్పందించే అవకాశముంటుంది. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 04:26, 12 అక్టోబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రజోపయోగ పరిధి వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

ప్రజోపయోగ పరిధి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2012 జులై 5 న సృష్టించబడింది.మొలకవ్యాసం.మూలాలు లేవు.సుమారు ఎనిమిది సంవత్సరాలు కాలం గడిచినప్పటికీ విస్తరణకు నోచుకోలేదు.దీనిని వ్యాసం పరిగణించలేం.2021 ఫిబ్రవరి 5 వతేదీలోపు తగిన మూలాలతో విస్తరించనియెడల తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ప్రజోపయోగ పరిధి పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 07:09, 28 జనవరి 2021 (UTC) యర్రా రామారావు (చర్చ) 07:09, 28 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

స్పందన చూడండి. --అర్జున (చర్చ) 00:12, 1 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్: కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు

[మార్చు]

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్ వారు ఫిబ్రవరి 1 నుండి మర్చి 14 వరకు, కమ్యూనిటీ ద్వారా ఎన్నుకోబడే బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి కారణం; గత పది సంవత్సరాలలో వికీమీడియా ఫౌండేషన్, ప్రాజెక్టులు ఐదు రెట్లు పెరగగా, బోర్డ్ పనితీరు, ఏర్పాట్లు, ఏమి మారలేదు. ఇప్పుడు ఉన్న విధానాల ప్రకారం, బోర్డుకు తగినంత సామర్థ్యం, ప్రాతినిధ్యం లేవు. మామూలుగా జరిగే ఎన్నికలు, బహిర్ముఖులుగా ఉంటూ ఇంగ్లీష్ వికీపీడియా వంటి పెద్ద ప్రాజెక్టులు లేదా అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు నుండి వచ్చేవారికి తోడ్పడుతున్నాయి. మిగిలిన వారికీ ఎన్ని శక్తిసామర్ధ్యాలు ఉన్నా తగినంత ప్రచారం లేనందు వలన వారికి ఓటు వేసే వారు తక్కువ మంది. ఉదాహరణకి, వికీమీడియా ఫౌండేషన్ పదిహేను సంవత్సరాల చరిత్రలో, భారత ఉపఖండం నుండి కేవలం ఒక్కళ్ళు మాత్రమే బోర్డు లో సేవలు అందించారు. వారు కూడా నిర్దిష్ట నైపుణ్యం కోసం నేరుగా నియమించబడ్డవారే గాని, ఎన్నుకోబడలేదు.

రానున్న నెలలో, మొత్తం ఆరు కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు జరుగుతున్న సంప్రదింపుల ద్వారా బోర్డు వారు కమ్యూనిటీల నుండి వారి పద్ధతుల మీద అభిప్రాయం సేకరిస్తున్నారు. ఈ నిమిత్తం తెలుగు కమ్యూనిటీలో తో మాట్లాడేందుకు ఒక ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇది ఫిబ్రవరి 6 (శనివారం), 6:00 pm నుండి 7:30 pm వరకు జరుగుతుంది; పాల్గొనడానికి గూగుల్ మీట్ లింకు ఇది https://meet.google.com/oki-espq-kog. ఈ కార్యక్రమములో పాల్గొనవలసిందిగా మిమల్ని ఆహ్వానితున్నాను. KCVelaga (WMF), 11:24, 1 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]