వికీపీడియా చర్చ:టైపింగు సహాయం
help for Tamil wikipedia
[మార్చు]నమస్కారం. బ్రౌజర్‌లొనె టైప్ చెయ్యటం చాలా సులభంగా ఉంది. వెరు సాఫ్ట్‌వేర్ల వాడకానికి అవసరం లేకుండా పోతుంది. తమిళ వికిపీడియాలొ కూడా ఈ విధంగా టైపింగ్‌ను ఎంబెడ్ చేసే ఫీచర్‌ను ఇంట్రో చేద్దదం అని అనుకుంటున్నాను. తమిళ వికిపీడియాలొ ప్రస్తుతం తమిళ్‌లొ టైప్ చేయడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్లను డౌన్‌లోడ్ చేసి వాడవలిసిన అవసరం ఉంది. దయ చేసి మీరు ఎలా ఈ విషయాన్ని ఇంప్లిమెంట్ చెస్తున్నారు అని చేప్తే తమిళ వికిపీడియాలో కూడా ఇట్లాంటి ఒక మంచి విషయాన్ని ఇదే విధంగా చెయ్యోచ్చు.
తర్వాత, మన మతృ భాషా వికిపీడియాను భారత భాషను భారత భాషలులొ అన్నిటికన్న మొదటి స్థానానికి తెచ్చెనందుకు నా అభినందనలు. అక్కడ తమిళ వికిపీడియాలొ, మీరు ఎలా ఇంత ఆర్టిక్ల్స్ రాసి మొదటి స్థానానికి వచ్చచరని ఆశ్చర్యబడుతున్నారు. మీరు ఇంకా పెరుగి, లక్షలాది ఆర్టిక్ల్స్ రాయాలనేది నా ఆశ. ఏమో, నా వల్ల అయిన వరకు, తమిళం సంబందిచ్చిన ఆర్టిక్ల్స్‌ను తమిళ వికిపీడియానుంచి తెలుగులో అనువదించాలని అనుకుంటున్నాను. (నాకు తెలుగు జ్ఞానం అంతగా లేదు. ఉంటేకూడా ఎమైన తప్పకుండా ప్రయత్నిస్తాను). అదే విధంగా, మన తెలుగు భాషా, సంస్కృతి , హాహిత్యం గురించి తమిళ వికిపీడియాలొ రాయలని అనుకుంటున్నాను వినోద్ 12:10, 26 నవంబర్ 2007 (UTC)
చక్కగా వున్నది
[మార్చు]- టైపింగు సహాయం చాలా చక్కగా వున్నది. చాలా విషయాలు తెలిసాయి. రచయిత(ల)కు ధన్యవాదాలు. సభ్యుడు nisar 13:45, 27 ఏప్రిల్ 2008 (UTC)
కొన్ని అక్షరాలు టైపు చెయ్యటం ఎలా
[మార్చు]వికీలో సభ్యుడైన తరువాత మొదటిసారి ఈ పుటలోకి వచ్చి చూశాను. ఇన్నాళ్ళూ కీ బోర్డు తో కుస్తీ పట్టి నేర్చుకున్నవన్నీ ఇక్కడ ఉన్నాయి!! ఉదాహరణలో ఇచ్చిన ఈ కింది మాటలు టైపు చేసేటప్పుడు ఈ గుర్తు ^ ఎలా తెప్పించాలో తెలియ చెయ్యగలరు. నా కీబోర్డ్^లో కనబడలేదు(ఇక్కడ జస్ట్ కాపీ చేశాను) . ఏవో రెండు కీలను ఒత్తితే వస్తుందనుకుంటాను. దయచేసి చెప్పగలరు.--SIVA 01:58, 23 డిసెంబర్ 2008 (UTC) ఫైర్‌ఫాక్స్ fair^faaks
- 5 పైన % ఉన్నట్టు 6 పైన ^ ఉంటుంది. shift పట్టుకొని 6 నొక్కితే చాలు --వైజాసత్య 02:39, 23 డిసెంబర్ 2008 (UTC)
పొల్లు వేరుపడుట
[మార్చు] సహాయం అందించబడింది
నా చర్చా పేజీలో User:K.Venkataramana గారు ఇలా రాశారు. "అర్జున రావు గారూ, కొన్ని పదాలు రాసేటప్పుడు దోషాలొస్తున్నాయి. ఉదాహరణకు teens వ్రాసినపుడు "టీన్స్" అని టైప్ అవుతుంది. ఇందులో పొల్లు బయటికి వెళ్ళి పోతుంది. దీనిని సరిదిద్దగలరు.", ఈ వ్యాఖ్య ఈ పేజీలో వుంచి పరిష్కరించడంమంచిదని చర్చని ఇక్కడ కొనసాగిస్తున్నాను. --అర్జున (చర్చ) 11:57, 18 జూలై 2020 (UTC)
- User:K.Venkataramana గారు, నేను ఉబుంటు18.04, ఫైర్ఫాక్స్ 68.10.0esr లో LOHIT Telugu ఖతి వాడుతూ వికీపీడియా లిప్యంతరీకరణ ఎంచుకొని Teens అని టైపు చేస్తే టీంస్ అని కనబడింది పొల్లు వేరుపడలేదు. మీరు వాడుతున్న వ్యవస్థ వివరాలు తెలియచేయండి. అలాగే ఇతరులకు కూడా ఇలాంటి సమస్య వుంటే వివరాలు తెలియచేయండి. --అర్జున (చర్చ) 12:04, 18 జూలై 2020 (UTC)
- అర్జున గారూ నేను గూగుల్ క్రోం వాడుతున్నాను. అందులో పొల్లు వేరుచేయబడినట్లు కనిపిస్తుంది. మీరు పైన రాసినది కూడా "టీంస్" అని కనిపిస్తుంది. "న" కింద సవత్తు కాకుండా "టీ" ప్రక్కన సున్న తరువాత "స్" కనిపిస్తుంది. గూగుల్ క్రోం కనిపిస్తున్న ఈ అక్షర దోషాన్ని సరిచేయగలరు. K.Venkataramana(talk) 12:12, 18 జూలై 2020 (UTC)
- User:K.Venkataramanaగారు, పేజీలోని ఉదాహరణల ప్రకారం Teen&s రాస్తే సున్న రాదు. ప్రయత్నించండి. నేను సరిగా అర్థం చేసుకోకపోతే తెరపట్టుతో వివరించండి.-- అర్జున (చర్చ) 12:18, 18 జూలై 2020 (UTC)
- User:K.Venkataramanaగారు, సమస్య పరిష్కారమైనట్లేనా?--అర్జున (చర్చ) 06:38, 22 జూలై 2020 (UTC)
- అర్జున గారూ నేను గూగుల్ క్రోం వాడుతున్నాను. అందులో పొల్లు వేరుచేయబడినట్లు కనిపిస్తుంది. మీరు పైన రాసినది కూడా "టీంస్" అని కనిపిస్తుంది. "న" కింద సవత్తు కాకుండా "టీ" ప్రక్కన సున్న తరువాత "స్" కనిపిస్తుంది. గూగుల్ క్రోం కనిపిస్తున్న ఈ అక్షర దోషాన్ని సరిచేయగలరు. K.Venkataramana(talk) 12:12, 18 జూలై 2020 (UTC)
అర్జున గారూ, వికీపీడియాలోనే కాకుండా గూగుల్ సెర్చ్ లో కూడా teens రాసేటప్పుడు "న్స"లో తలకట్టు బదులుగా పొల్లు కాకుండా తలకట్టు ఉంటూ ప్రక్కన పొల్లు కనిపిస్తుంది. సమస్య పరిష్కారం కాలేదు. K.Venkataramana(talk) 08:00, 22 జూలై 2020 (UTC)
- User:K.Venkataramanaగారు, మీరు తెలిపినదాన్నిబట్టి చూస్తే "న్స‌్ " లా కనబడుతుండవచ్చు. ఇది మీరు గూగుల్ క్రోం సెర్చ్ లో కూడా కనబడుతుందంటున్నారు కాబట్టి, మీరు వికీపీడియా లిప్యంతరీకరణ వాడుతున్నట్లు లేదు. వికీపిడియా సవరణ పెట్టెలలో మూల కనబడే కీ బోర్డు బొమ్మ నొక్కితే use native keyboard ఎదురుగా టిక్ మార్క్ కనబడుతుండాలి లేక వికీపీడియా లో Disable Input tools చేసివుండాలి. అలా అయితే మీరు విండోస్ ద్వారానో లేక గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ ద్వారానో కీ బోర్డు పద్ధతి వాడుతుండాలి. అక్షరాలు సరిగా కనబడడం, ఆపరేటింగ్ సిస్టమ్, ప్రవేశపెట్టు పద్ధతి, ఖతి పై ఆధారబడుతుంది కావున, మీరు స్పష్టంగా తెలపకపోతే దీన్ని పరిష్కరించడం కష్టం. మీకు సాధ్యం అయితే హేంగౌట్ లేక ఇతర తెర పంచుకొనే పద్ధతులు వాడాలి లేక దగ్గరిలోని సాంకేతిక నిపుణుడిని కలవాలి. --అర్జున (చర్చ) 09:12, 22 జూలై 2020 (UTC)
- అర్జున గారూ నేను చేస్తున్న కంప్యూటర్ లో అలా వస్తుందండీ. వేరొక కంప్యూటర్ లో లాగిన్ అయినప్పుడు అలా రాస్తే సరిగానే వస్తుంది. ఎందువలన అలా వస్తుందో అర్థం కావడం లేదు. నా సిస్టంలో లోపం అయి ఉండవచ్చు. సహాయం మూసను తొలగించండి. K.Venkataramana(talk) 12:29, 22 జూలై 2020 (UTC)
- User:K.Venkataramanaగారు, ఇదేదో విండోస్ అప్డేట్ కు సంబంధించినది, ట్విట్టర్ లో ఇలాంటి సమస్యకు సంబంధించిన ట్వీట్లు కనబడుతున్నాయి. (లింకు)--అర్జున (చర్చ) 04:49, 23 జూలై 2020 (UTC)
- User:K.Venkataramanaగారు, లోహిత్ తెలుగు ఖతి స్థాపించుకొని ప్రయత్నించండి. --అర్జున (చర్చ) 05:01, 23 జూలై 2020 (UTC)
- అర్జున గారూ నేను చేస్తున్న కంప్యూటర్ లో అలా వస్తుందండీ. వేరొక కంప్యూటర్ లో లాగిన్ అయినప్పుడు అలా రాస్తే సరిగానే వస్తుంది. ఎందువలన అలా వస్తుందో అర్థం కావడం లేదు. నా సిస్టంలో లోపం అయి ఉండవచ్చు. సహాయం మూసను తొలగించండి. K.Venkataramana(talk) 12:29, 22 జూలై 2020 (UTC)
ర్రా రాసినపుడు, ర్ర రాసినపుడు క్రావడి పరిమాణంలో తేడా
[మార్చు]అర్జున గారూ నాకు కూడా గత నాలుగు రోజుల కిందట నుండి ఉన్నది.నా సంతకం లోగడ యర్రా కు క్రావడి ర్ర కింద ఎలా ఉండేదో అలా ఉంటుంది.గత నాలుగు రోజుల కిందట నుండి ర్రా కు దీర్ఘం ఇచ్చినప్పుడ ఇలా మారుతుంది.ఇది వరకు అలా ఉండదు.ఇది ఏమంత పెద్ధ సమస్య కాదని అనుకోవచ్చు.అర్థం కాని అంతుపట్టని సమస్యలాగా ఉంది.వికీ మీడియా కామన్స్ (కామన్సు ఎలా ఉందో చూడండి) ఫోటోలు వ్యాసలలో ఎక్కించాలంటే అసలు చూపటలేదు.ఏమిటా వికీమీడియా కామన్స్ అభిరుచులులోకి వెళ్లి పరిశీలించగా "Your current signature is invalid. Although you can still use it, you won't be able to change it until you correct it.
Your signature must include a link to your user page, talk page or contributions. Please add it, for example: యర్రా రామారావు (చర్చ)." అని ఉంది.పరిష్కారం కనుగొనగలరు.--యర్రా రామారావు (చర్చ) 09:39, 22 జూలై 2020 (UTC)
- యర్రా రామారావు గారు, మీరు రెండు విషయాలు ప్రస్తావించారు. వాటిని వేరుచేసి సమాధానమిస్తాను. ఖతుల రూపనిర్మాణంలో అక్షరాన్ని బట్టి వేరు వేరు పరిమాణం గల చిహ్నలు వాడబడతాయి. పొట్టి అక్షరాలకు ఒకలా, దీర్ఘాక్షరాలకు ఇంకోలా. విండోస్ అప్రమేయంగా తాజా పరచబడుతుంటే మీరు వాడుతున్న ఖతులు కూడా మార్పులకు లోనయినపుడు ఇలా మార్పు వుండవచ్చు. అలాగే ఖతిని బట్టి కూడా అక్షరరూపం మారుతుంది. ఇప్పుడు చాలా యూనికోడ్ ఖతులు ఉచితంగా అందుబాటులోకివున్నాయి కాబట్టి మీరు పరీక్షించి వాడండి. --అర్జున (చర్చ) 09:50, 22 జూలై 2020 (UTC)
- రెండో విషయం గురించి మీ చర్చాపేజీలో చూడండి.--అర్జున (చర్చ) 10:45, 22 జూలై 2020 (UTC)