వరంగల్ జిల్లా కథా రచయితలు
ఆంధ్రదేశంలోని ప్రతీ జిల్లాలో కథకులు ఉద్భవించారు. తెలుగు కథకు అత్యంత ఆదరణగల జిల్లాలో వరంగల్ జిల్లా ఒకటి. వరంగల్ జిల్లా కథా రచయితలు చాలా మందే ఉన్నారు.
కథ ప్రాశస్త్యం
[మార్చు]మానవ సమాజ చరిత్రలో కథ ప్రక్రియకు ఎంతో ప్రాధాన్యత ఉంది. రాతి యుగపు మనిషి సంజ్ఞలతో అభివృద్ధికి బాటలు వేస్తే అనంతర కాలంలో మనిషికి సంఘజీవనం ప్రాణావసరమయ్యింది. ఆ సమయంలోనే భాష ఆవిర్భవించింది. మనిషి నుండి మనిషికి సమాచారం చేరవేయడానికి చిన్న చిన్న పదాలతోకూడిన కథలు ఊపిరి పోసుకున్నాయి. దేశాలవారీగా ప్రాంతాలవారీగా భాష రూపాంతరం చెందుతూ ప్రాంతీయ జీవన స్థితిగతుల నేపథ్యంలో అప్పటి ఆలోచనాపరులు మౌఖిక కథల ప్రచారప్రయాణం ప్రారంభించారు. తదనంతర కాలంలో భాష లిపిరూపం సంతరించుకోవడంతో కథాప్రయాణం వేగం పుంజుకుంది. నాటి రాజుల కాలం నుంచి ఈ ప్రాంతంలో కథ ప్రచారంలో ఉన్నప్పటికి ముద్రణా రంగం అందుబాటులోకి వచ్చిన తరువాత సామాన్య ప్రజానీకానికి సైతం చేరువ అయ్యింది. మన జీవితంలో కథ ఒక భాగమయ్యింది.
వరంగల్ జిల్లాలో తెలుగు కథా ప్రక్రియ
[మార్చు]ఆంధ్రదేశంలోని ప్రతీ జిల్లాలో లాగానే వరంగల్ జిల్లాలో కూడా తెలుగు కథకులు ఉద్భవించారు. వరంగల్ జిల్లాలో పుట్టి అక్కడే పెరిగి, అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్న కథా రచయితలు అంపశయ్య నవీన్, కోవెల సుప్రసన్నాచార్యులు, బుర్ర రాములు, రామా చంద్రమౌళి మొదలైనవారు కాగా, వరాంగల్ జిల్లాలో పుట్టి, కొంతకాలం అక్కడే ఉండి వివిధ కారణాలతో వేరే ప్రాంతానికి వెళ్ళి స్థిరపడ్డవారు దాశరధి రంగాచార్యులు, దాశరధి కృష్ణమాచార్యులు, తుమ్మేటి రఘోత్తం రెడ్డి, పేర్వారం రాములు, జైపాల్ రెడ్డి, ప్రొ. ననుమాసస్వామి మొదలైన కథా రచయితలు కనబడుతారు.[1] ఈ జిల్లాలో నుండి వచ్చిన కథలలో చాలావరకు సాయుధ పోరాటాన్ని, తెలంగాణ సాధన ఉద్యమాన్ని, రైతాంగ జీవితాన్ని, తెలంగాణ ప్రాంతంలోని భౌగోళిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లోని సమస్యలని స్పృశిస్తూ నడుస్తాయి. డా. వేలూరి శ్రీదేవి వరంగల్ జిల్లాలో పుట్టిన కథా ప్రక్రియను విశ్లేషిస్తూ ఇక్కడ " పుట్టిన కథ నిత్య నూతనం , నవ యవ్వనం , ఎందరికో ప్రేరణ . బాధితుల ఆర్తనాదాలు , దుర్మార్గుల దౌష్ట్యాలు, విప్లవ రక్తాక్షరాలు, తేట తెలుగు హృదయాల స్వచ్చతా పరిమళాలు, బోసినవ్వుల పాపాయిల నుండి, కరుడు గట్టిన నియంతల పాశవిక చర్యల వరకు, కులం కుళ్ళును, మతం మత్తును…. ఇలా ఒకటేమిటి సమస్తాంశాలను వరంగల్ జిల్లా కథ నింపుకుని రాబోయే కొత్త రచయితలకు ప్రేరణగా నిలుస్తూ ముందుకు సాగుతూనే ఉంది" అని అభివర్ణించారు.[1]
వరంగల్ జిల్లాలో జన్మించిన తెలుగు కథా రచయితల జాబితా
[మార్చు]ఈ క్రింది జాబితాలో వరంగల్ జిల్లాకథకుల వివరాలుక్రోఢీకరించబడ్డాయి[1][2][3]
రచయిత పేరు | ప్రస్తుత నివాసం | కలం పేరు | పుట్టిన సంవత్సరం | పుట్టిన ఊరు |
---|---|---|---|---|
అన్వర్ పాషా | వరంగల్ | అన్వర్ | 02.06.1969 | శివనగర్, వరంగల్ |
బుర్రా రాములు | గౌడ | 1954 జూన్ 10 | ఓరుగల్లు కోట, వరంగల్ | |
బొడ్డు శ్రీశైలం | హైదరాబాద్ | కృష్ణశ్రీ, ప్రభ | 1939 జనవరి 01 | రాఘవాపూర్ |
మైదం చంద్రశేఖర్ | హైదరాబాద్ | చంద్ర, అశ్వని, ఎమ్వీ శేఖర్, విజయభార్గవి, భార్గవీచంద్ర | 1946 ఆగస్టు 25 | వరంగల్ |
చల్లా జైపాల్ రెడ్డి | వరంగల్ | 1961 ఆగస్టు 15 | తాటికొండ | |
దేవరాజు మహారాజు | హైదరాబాద్ | 1951 ఫిబ్రవరి 21 | వరంగల్ | |
దార్ల రామచంద్రం | వరంగల్ | 1960 నవంబరు 15 | గొల్లచర్ల, డోర్నకల్ మండలం | |
గన్ను కృష్ణమూర్తి | మెదక్ | ఎక్స్ రే, ప్రభంజనం, యుగంధర్, భారతి | 1945 సెప్టెంబరు 02 | నెక్కొండ |
ప్రొ. ననుమాస స్వామి | ||||
పేర్వారం రాములు | ||||
తుమ్మేటి రఘోత్తమరెడ్డి | ||||
దాశరధి కృష్ణమాచార్యులు | ||||
దాశరధి రంగాచార్యులు | ||||
అంపశయ్య నవీన్ | ||||
కోవెల సుప్రసన్నాచార్య | ||||
రామా చంద్రమౌళి | ||||
సదానంద్ శారద | ||||
అడ్లూరి అయోధ్యరామకవి | ||||
కాళోజీ | ||||
కోవెల సంపత్కుమారాచార్య | ||||
జయధీర్ తిరుమలరావు | ||||
దేవులపల్లి రామానుజారావు | ||||
అంపశయ్య నవీన్ | ||||
విజయార్కె | ||||
దాస్యం లక్ష్మయ్య | ||||
సముద్రాల లక్ష్మి నర్సయ్య | ||||
సయ్యద్ ఖుర్షీద్ | ||||
టి.శ్రీరంగస్వామి | ||||
ఎస్. శ్రీదేవి | ||||
వడ్డేబోయిన శ్రీనివాస్ | ||||
వంగా నర్సయ్య | ||||
మెట్టు మురళీధర రావు | ||||
మెండు ఉమా మాహేశ్వర్ రావు | ||||
మహేశ్వరం రత్నాకర్ రావు | ||||
మద్దెర్ల రమేష్ | ||||
బి.పద్మజ | ||||
డా. పసునూరి రవీందర్ | శివనగర్, వరంగల్ | |||
పల్లె నాగేశ్వరరావు | హనుమకొండ |
ఇవి కూడా చూడండి
[మార్చు]- అనంతపురం జిల్లా తెలుగు కథారచయితలు
- కర్నూలు జిల్లా కథా రచయితలు
- చిత్తూరు జిల్లా కథా రచయితలు
- తూర్పు గోదావరి జిల్లా కథా రచయితలు
- పశ్చిమగోదావరి జిల్లా కథా రచయితలు
- కరీంనగర్ జిల్లా కథా రచయితలు
- మెదక్ జిల్లా కథా రచయితలు
- కడప జిల్లా కథా రచయితలు
- అదిలాబాద్ జిల్లా కథా రచయితలు
- నల్గొండ జిల్లా కథా రచయితలు
- మహబూబ్ నగర్ జిల్లా కథా రచయితలు
- కృష్ణా జిల్లా కథా రచయితలు
- ప్రకాశం జిల్లా కథా రచయితలు
- నెల్లూరు జిల్లా కథా రచయితలు
- గుంటూరు జిల్లా కథా రచయితలు
- ఖమ్మం జిల్లా కథా రచయితలు
- జాతీయ తెలుగుకథా రచయితలు
మూలాల జాబితా
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "డా. వేలూరి శ్రీదేవి, తెలంగాణా కథలో రైతు జీవితం". Archived from the original on 2015-05-25. Retrieved 2014-01-07.
- ↑ ఉత్తర తెలంగాణ కథకుల పరిచయం – 1 తెలంగాణా సోయి, 07 జూన్, 2007 సంచిక[permanent dead link]
- ↑ కథానిలయం జాలగూడులో రచయితల వివరాలు