Jump to content

ననుమాస స్వామి

వికీపీడియా నుండి

ననుమాస స్వామి తెలంగాణకు చెందిన కవి, రచయిత. ఇతడు 1952, జనవరి 1న వరంగల్లు జిల్లా, చెన్నారావుపేట గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఇతడు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు, చరిత్రలలో ఎం.ఎ. పట్టాలు పుచ్చుకున్నాడు. మాలపల్లి - గోదాన్ నవలల తులనాత్మక పరిశీలన అనే అంశంపై ఎం.ఫిల్, తెలుగు నవల - అస్పృశ్యతా సమస్య అనే అంశంపై పి.హెచ్.డి చేశాడు. రైల్వేడిగ్రీ కాలేజి, ఎ.వి.కాలేజిలలో అధ్యాపకుడిగా పనిచేశాడు.

రచనలు

[మార్చు]
  1. దృక్సూచి (వ్యాస సంపుటి)
  2. మాలపల్లి-గోదాన్ నవలల తులనాత్మక పరిశీలనం (సిద్ధాంతగ్రంథం)
  3. జానపద పురాణాలు - పటం కథలు
  4. మడేలు పురాణం (సంక్షిప్త పటం కథ)
  5. గౌడ పురాణం : పటం ప్రదర్శన - యక్షగానం
  6. దండోరా (ఉస్మానియా దళిత బహుజన కవిత)
  7. అస్పృశ్యతా సమస్య - తెలుగునవల
  8. దిశ
  9. గౌడ పురాణం - ద్విపద కావ్యం
  10. కంఠ మహేశ్వర పటం కథ
  11. మేము మీకోసమే (గేయకథా సంపుటి)
  12. మోహిని దళిత నవల
  13. మూలవాసి పాటలు
  14. శాలివాహన శకంలో గౌడులు కైఫీయతుల్లో గౌడనాడులు
  15. సురాభాండేశ్వరం రూపకం
  16. తెలుగు సాహిత్యంలో అత్యాధునిక ధోరణులు సంవీక్షణము
  17. Cultural Reflections in Scroll Narratives in Telangana A Study

సాధించిన ఘనత

[మార్చు]
  • ఇతడు 13 గంటలపాటు నిర్విరామంగా "ఊసెత్తితే చాలు ఉలిక్కిపడే వృత్తి పురాణాలు" అనే అంశంపై ప్రసంగించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకున్నాడు.

మూలాలు

[మార్చు]