Jump to content

మేదినీనగర్

అక్షాంశ రేఖాంశాలు: 24°02′N 84°04′E / 24.03°N 84.07°E / 24.03; 84.07
వికీపీడియా నుండి
డాల్టన్‌గంజ్
మేదినీనగర్
డాల్టన్‌గంజ్
డాల్టన్‌గంజ్
డాల్టన్‌గంజ్
జార్ఖండ్ పటంలో నగర స్థానం
Coordinates: 24°02′N 84°04′E / 24.03°N 84.07°E / 24.03; 84.07
దేశం India
రాష్ట్రంజార్ఖండ్
డివిజనుపాలము
జిల్లాపాలము
Established1880
Named forమేదినీ రాయ్
విస్తీర్ణం
 • Total150 కి.మీ2 (60 చ. మై)
Elevation
215 మీ (705 అ.)
జనాభా
 (2011)
 • Total1,58,941
 • Rankజార్ఖండ్‌లో 10వ స్థానం
 • జనసాంద్రత1,100/కి.మీ2 (2,700/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ, ఉర్దూ
Time zoneUTC+5:30 (IST)
PIN
822101
telephone06562
Vehicle registrationJH-03

మేదినీనగర్ జార్ఖండ్ రాష్ట్రంలోని నగరం. ఇది పాలము డివిజన్ లోని, పాలము జిల్లాకు మ్ముఖ్యపట్టణం. గతంలో దీన్ని డాల్టన్‌గంజ్ అనేవారు. పట్టణ పరిపాలన నగరపాలక సంస్థ చేతిలో ఉంది. ఈ నగరం ఉత్తర కోయల్ నది ఒడ్డున ఉంది. రాష్ట్రంలో చారిత్రిక ప్రాముఖ్యత కలిగిన పట్టణాలలో ఇదొకటి.

పేరు మూలం

[మార్చు]

1861 లో, బ్రిటీష్ రాజ్ సమయంలో, మానవ శాస్త్రవేత్త, ఛోటా నాగ్‌పూర్ కమిషనరు అయిన ఐరిష్‌మన్ కల్నల్ ఎడ్వర్డ్ ట్యూట్ డాల్టన్ (1815-1880) పేరిట ఈ నగరానికి డాల్టన్‌గంజ్ అనే పేరు వచ్చింది. [1] [2] 2004 లో జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మేదినీనగర్‌ అని మార్చింది. [3] నగరంలోని రైల్వే స్టేషన్ పేరును మార్చకుండా అలాగే ఉంచారు. ఇది 2015 మే 30 న ఏర్పడిన మేదినీనగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పడింది. ఈ నగరానికి చేరో రాజవంశపు రాజు మేదిని రాయ్ పేరు పెట్టారు.

భౌగోళికం

[మార్చు]

మేదినీనగర్ 24°02′N 84°04′E / 24.03°N 84.07°E / 24.03; 84.07 వద్ద, [4] సముద్రమట్టం నుండి సగటున 215 ం. ఎత్తున ఉంది.

నగరం నుండి దాదాపు 20 కి.మీ. దూరంలో బెట్లా నేషనల్ పార్కుఉంది. ఈ పార్కు పులులకు ప్రసిద్ధి. ఇది పాలమౌ టైగర్ ప్రాజెక్ట్ కిందకి వస్తుంది. సమీపంలోని పిక్నిక్ స్పాట్ కెచ్కి. ఇది డాల్టన్‌గంజ్ నుండి 18 కి.మీ. దూరంలో, కోల్, ఔరంగా నదుల సంగమం వద్ద ఉంది. దట్టమైన అడవులతో నిండిన పీఠభూమి అయిన నెతర్‌హాట్ కూడా నగరానికి సమీపంలో ఉంది.

రవాణా

[మార్చు]
డాల్టోన్గంజ్ రైల్వే స్టేషన్

మేదినీనగర్ న్యూ ఢిల్లీకి ఆగ్నేయంగా 1036 కి.మీ. దూరంలో ఉంది. లక్నో, పాట్నా, రాంచీ, కోట, భోపాల్ జంక్షన్, అహ్మదాబాద్, ఢిల్లీ, జబల్‌పూర్, కోల్‌కతా, వారణాసి, గయల నుండి డాల్టన్‌గంజ్ రైల్వే స్టేషనుకు (DTO) రైళ్ళున్నాయి.

సమీప విమానాశ్రయం 165 కి.మీ. దూరంలో రాంచీలో ఉంది. నగరానికి దగ్గరలో, దక్షిణాన, చియాంకి ఎయిర్‌స్ట్రిప్ ఉంది. దీనిని ఎక్కువగా ప్రైవేట్ ఛాపర్లు, చిన్న విమానాలు ఉపయోగిస్తాయి. మీడియం సైజు విమానాల ఆపరేషన్ కోసం ఎయిర్‌స్ట్రిప్‌ను బలోపేతం చేయడానికీ, విస్తరించడానికీ ఒక ప్రణాళిక ఉంది. [5]

మేదినీనగర్ నుండి పాట్నా, రాంచీ, రాయపూర్, అంబికాపూర్, కోల్‌కతా, దుర్గాపూర్, వారణాసి, జంషెడ్‌పూర్, ధన్బాద్, ఢిల్లీ, లక్నో, అలహాబాద్, కోట, కాన్పూర్ గయ, మొదలైన నగరాలకు చక్కటి రోడ్డు మార్గాలున్నాయి.

జనాభా

[మార్చు]

2011 జనగణన నాటికి,[6] మేదినీనగర్‌ జనాభా 3,89,307. జనాభాలో పురుషులు 53% కాగా మహిళలు 47%. అక్షరాస్యత 87.29%. ఇది జాతీయ సగటు 74.04%కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 91.92%, స్త్రీల అక్షరాస్యత 82.10%. జనాభాలో 13% 6 సంవత్సరాల లోపు వారు.

సంస్కృతి

[మార్చు]

మేదినీనగర్‌లో ప్రధాన హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ పండుగలు జరుపుకుంటారు. ఈ పట్టణం డాల్టన్‌గంజ్ రోమన్ కాథలిక్ డియోసెస్‌కు స్థానం. పట్టణంలో పాలమౌ క్లబ్బు, రోటరీ క్లబ్బు, రిడా ఫౌండేషన్‌తో సహా అనేక సొసైటీలు, క్లబ్బులు, NGO లూ ఉన్నాయి. [7]

సత్యజిత్ రే బెంగాలీ చిత్రం, ఆరణ్యేర్ దిన్ రాత్రిని పాలములో చిత్రీకరించారు. బాలీవుడ్ చిత్రం అర్జున్ రాంపాల్ నటించిన <i id="mwaw">నాస్తిక్</i> చిత్రీకరణ కూడా మేదినీనగర్‌లో చేసారు. [8]

శీతోష్ణస్థితి

[మార్చు]

మేదినీనగర్‌లో తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ఉంది ( కొప్పెన్ వాతావరణ వర్గీకరణ Cwa ).

శీతోష్ణస్థితి డేటా - Medininagar (1981–2010, extremes 1901–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 34.2
(93.6)
40.6
(105.1)
43.9
(111.0)
46.5
(115.7)
47.8
(118.0)
46.9
(116.4)
43.8
(110.8)
40.2
(104.4)
39.7
(103.5)
40.0
(104.0)
36.5
(97.7)
33.2
(91.8)
47.8
(118.0)
సగటు అధిక °C (°F) 25.2
(77.4)
28.4
(83.1)
33.9
(93.0)
39.3
(102.7)
40.8
(105.4)
37.8
(100.0)
32.8
(91.0)
32.0
(89.6)
32.3
(90.1)
31.9
(89.4)
29.5
(85.1)
26.3
(79.3)
32.5
(90.5)
సగటు అల్ప °C (°F) 9.1
(48.4)
11.9
(53.4)
16.5
(61.7)
22.0
(71.6)
26.2
(79.2)
27.4
(81.3)
25.9
(78.6)
25.5
(77.9)
24.5
(76.1)
20.4
(68.7)
14.3
(57.7)
9.7
(49.5)
19.5
(67.1)
అత్యల్ప రికార్డు °C (°F) 0.0
(32.0)
0.6
(33.1)
5.6
(42.1)
11.2
(52.2)
17.8
(64.0)
18.6
(65.5)
18.2
(64.8)
20.6
(69.1)
17.2
(63.0)
10.0
(50.0)
5.0
(41.0)
1.7
(35.1)
0.0
(32.0)
సగటు వర్షపాతం mm (inches) 11.9
(0.47)
19.6
(0.77)
15.6
(0.61)
9.4
(0.37)
24.8
(0.98)
151.6
(5.97)
285.2
(11.23)
288.6
(11.36)
179.0
(7.05)
49.5
(1.95)
8.4
(0.33)
6.3
(0.25)
1,049.8
(41.33)
సగటు వర్షపాతపు రోజులు 1.1 1.6 1.8 0.9 1.9 7.0 14.9 13.5 9.4 2.9 0.6 0.7 56.2
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 50 41 32 24 30 52 77 79 76 62 57 57 53
Source: India Meteorological Department[9][10]

విద్య

[మార్చు]

మేదినీనగర్‌ లోని నీలాంబర్-పీతాంబర్ విశ్వవిద్యాలయాన్ని 2009 లో స్థాపించారు. [11] [12]

అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇతర ఉన్నత విద్య కోసం మేదినీనగర్‌ చుట్టుపక్కల అనేక కళాశాలలు ఉన్నాయి:

  • మేదినిరాయ్ మెడికల్ కాలేజి, హాస్పిటల్ [13]
  • DAV ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ [14] DAV కాలేజ్ మేనేజింగ్ కమిటీ స్థాపించింది.
  • భీష్మ నారాయణ్ సింగ్ లా కాలేజ్ [15]
  • గణేష్ లాల్ అగర్వాల్ కళాశాల [16]
  • యోధ్ సింగ్ నామధారి మహిళా మహా విద్యాలయం [17]
  • జన శివరాత్రి కళాశాల [18]
  • ఎలైట్ పబ్లిక్ B.Ed. కళాశాల [19]
  • జ్యోతి ప్రకాష్ మహిళా B.Ed. కళాశాల [20]

చూడదగ్గ ప్రదేశాలు

[మార్చు]
కోయల్ నది నుండి మేదినీనగర్ దృశ్యం
  • బెట్లా నేషనల్ పార్క్, అనేక రకాల వన్యప్రాణులకు నెలవు
  • పాలము టైగర్ రిజర్వ్, భారతదేశంలో మొదటి పులుల సంరక్షణ ప్రాజెక్టులలో ఒకటి.
  • పాలము కోట, చేరో రాజవంశపు జంట కోటలను రాజా మేదిని రే నిర్మించారు.
  • మొఘల్ జాగీర్దార్, హిదాయత్ అలీ ఖాన్ నిర్మించిన హుస్సేనాబాద్ కోట.
  • షాపూర్ కోట, చేరో పాలకుడు నిర్మించారు
  • బిష్రాంపూర్ కోట, చేరో పాలకులు నిర్మించారు
  • కాలా-కబ్రా మట్టిదిబ్బ, హరప్పా కాలం నాటి కళాఖండాలు [21]
  • భీమ్ చుల్హా, 5,000 సంవత్సరాల పురాతన స్టవ్, భీముడు పాండవుల అజ్ఞాన సమయంలో ఆహారం తయారు [22]

మూలాలు

[మార్చు]

 

  1. "Daltonganj". University of Swansea. Archived from the original on 2 ఫిబ్రవరి 2017. Retrieved 23 January 2017.
  2. "The story of Edward Tuite Dalton. | Farbound.Net". farbound.net (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-08-04. Retrieved 2021-02-07.
  3. Government of India Ministry of Home Affairs. "LOK SABHA UNSTARRED QUESTION NO.3572" (PDF).
  4. Falling Rain Genomics, Inc - Daltonganj
  5. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  6. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  7. "Rotary Club Profile:Daltonganj". Rotary International. Retrieved 2013-02-28.
  8. "Puff penalty for Rampal". The Telegraph.
  9. "Station: Daltonganj Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 221–222. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 18 August 2020.
  10. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M81. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 18 August 2020.
  11. "Nilamber Pitamber University acquires ownership rights of 15-acre land | Ranchi News". The Times of India. Archived from the original on 2013-04-11.
  12. "Nilamber-Pitamber University". Retrieved 2012-12-27.
  13. "Medinirai Medical College and Hospital – Medininagar, Palamu" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2020-01-16. Retrieved 2020-01-16.
  14. "DAV IET". www.davietpalamau.org. Archived from the original on 2020-01-16. Retrieved 2020-01-16.
  15. "B.N.S Law College, Jharkhand". Bhishma Narain Singh Law College. Archived from the original on 5 ఫిబ్రవరి 2020. Retrieved 22 February 2020.
  16. "Ganesh Lal Agrawal College". www.glanpu.org.in. Archived from the original on 2020-01-16. Retrieved 2020-01-16.
  17. "Yodh Singh Namdhari Mahila Mahavidyalaya". www.ysnmnpu.org.in. Archived from the original on 2020-01-16. Retrieved 2020-01-16.
  18. "Janta Shivratri College, Daltonganj, Palamau, Jharkhand". Janta Shivratri College.
  19. "Elite Public B.Ed. College". Elite Public B.Ed. College. Archived from the original on 2020-04-25. Retrieved 2021-09-18.
  20. "Jyoti Prakash Mahila B.Ed College". Jyoti Prakash Mahila B.Ed College. Archived from the original on 22 ఫిబ్రవరి 2020. Retrieved 22 February 2020.
  21. "Artifacts dating back to Harappan era unearthed in Jharkhand". DNA India (in ఇంగ్లీష్). 2010-06-26. Retrieved 2020-05-04.
  22. "half bhim chulha gathers dust of neglect". www.dailypioneer.com. Retrieved 2020-05-04.