అక్షాంశ రేఖాంశాలు: 24°38′N 87°51′E / 24.63°N 87.85°E / 24.63; 87.85

పాకూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాకూర్
పాకౌర్
పట్టణం
పాకూర్ లోని స్టోన్ క్రషరు
పాకూర్ లోని స్టోన్ క్రషరు
పాకూర్ is located in Jharkhand
పాకూర్
పాకూర్
జార్ఖండ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 24°38′N 87°51′E / 24.63°N 87.85°E / 24.63; 87.85
దేశం India
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాపాకూర్
విస్తీర్ణం
 • Total11.08 కి.మీ2 (4.28 చ. మై)
జనాభా
 (2011)
 • Total45,840
 • జనసాంద్రత4,100/కి.మీ2 (11,000/చ. మై.)
భాషలు (*For language details see Pakur block#Language and religion)
 • అధికారికహిందీ, ఉర్దూ
Time zoneUTC+5:30 (IST)
PIN
816107
Telephone code+91-06435
Vehicle registrationJH-16

పాకూర్ జార్ఖండ్ రాష్ట్రంలోని పాకూర్ జిల్లాలో పాకర్ ఉపవిభాగంలోని పట్టణం. ఈ జిల్లకు ముఖ్యపట్టణం కూడా. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం చుస్తుంది.

స్థానం

[మార్చు]

పాకూర్ 24°38′N 87°51′E / 24.63°N 87.85°E / 24.63; 87.85 వద్ద ఉంది

పట్టణ విస్తీర్ణం 11.08 చదరపు కిలోమీటర్లు (4.28 చ. మై.) . [1]

అవలోకనం

[మార్చు]

జనాభా

[మార్చు]
పాకూర్ పట్టణంలో మతం
మతం శాతం
హిందువులు
  
66.71%
ముస్లిములు
  
28.09%
క్రైస్తవులు
  
3.12%
ఇతరులు
  
1.20%

2011 భారత జనగణన ప్రకారం, పాకూర్ మొత్తం జనాభా 45,840, వీరిలో 23,653 (52%) మంది పురుషులు కాగా, 22,167 (48%) మంది మహిళలు. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల జనాభా 6,352. పాకూర్‌లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 39,488 (6 సంవత్సరాలకు పైబడిన వారిలో అక్షరాస్యత 77.60%). [1]

మౌలిక సదుపాయాలు

[మార్చు]

జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ 2011 ప్రకారం, పాకూర్ 11.08 చ.కి,.మీ. విస్తీర్ణంలో ఉంది. పట్టణంలో రోడ్ల పొడవు 34.2 కి.మీ. బహురంగ మురుగునీటి పారుదల ఉంది. రక్షిత నీటి సరఫరాలో చేతి పంపు, శుద్ధి చేయని వనరుల నుండి పంపు నీరు, ఓవర్‌హెడ్ ట్యాంకులు ఉన్నాయి. పట్టణంలో 7,704 గృహ విద్యుత్ కనెక్షన్లు, 443 వీఢి లైట్లు ఉన్నాయి. వైద్య సదుపాయాలలో, 4 ఆసుపత్రులు, 2 డిస్పెన్సరీలు, 2 ఆరోగ్య కేంద్రాలు, 1 కుటుంబ సంక్షేమ కేంద్రం, 1 ప్రసూతి, శిశు సంక్షేమ కేంద్రం, 1 ప్రసూతి గృహము, 1 TB ఆసుపత్రి/ క్లినిక్, 2 నర్సింగ్ హోమ్‌లు, 1 ధార్మిక ఆసుపత్రి/ నర్సింగ్ హోమ్, 1 పశువైద్యశాల, 26 మందుల దుకాణాలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలలో 33 ప్రాథమిక పాఠశాలలు, 19 మధ్యమ పాఠశాలలు, 4 మాధ్యమిక పాఠశాలలు, 4 సీనియర్ మాధ్యమిక పాఠశాలలు, 1 సాధారణ డిగ్రీ కళాశాల, 2 గుర్తింపు పొందిన షార్ట్‌హ్యాండ్ టైప్‌రైటింగ్, ఒకేషనల్ ట్రైనింగ్ సంస్థలు, 1 అనధికారిక విద్యా కేంద్రం (సర్వ శిక్షా అభియాన్) ఉన్నాయి.

సామాజిక, సాంస్కృతిక వినోద సౌకర్యాలలో, 2 స్టేడియంలు, 2 సినిమా థియేటర్లు, 5 ఆడిటోరియం/ కమ్యూనిటీ హాల్‌లు, 1 పబ్లిక్ లైబ్రరీ, 1 రీడింగ్ రూమ్ ఉన్నాయి.

పట్టణంలో తయారయ్యే మూడు ముఖ్యమైన వస్తువులు బీడీ, స్టోన్ క్రషర్ మెషిన్, బేకరీ ఉత్పత్తులు. ఇక్కడ 11 జాతీయం చేయబడిన బ్యాంకులు, 1 ప్రైవేట్ వాణిజ్య బ్యాంకు, 1 సహకార బ్యాంకు, 3 వ్యవసాయ రుణ సంఘాల శాఖ కార్యాలయాలు ఉన్నాయి. [2]

నగరం లోని ప్రధాన వ్యాపారాలలో ఒకటి మైనింగ్, స్టోన్ క్రషింగ్. క్రషరు, స్క్రీనింగ్ పరికరాల తయారీకి కూడా ఈ పట్టణం పేరు పొందింది. పాకూర్ లోనే భగవతీ ప్రసాద్ అగర్వాలా మొట్టమొదటి స్వదేశీ జా క్రషర్ తయారు చేసాడు.

గత దశాబ్దం నుండి ఈ ప్రాంతంలో బొగ్గు తవ్వకంజరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కేవలం ఒక బొగ్గు బ్లాక్ మాత్రమే చురుకుగా ఉంది. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి బంధించిన థర్మల్ పవర్ ప్లాంట్ల కోసం దీన్ని కేటాయించారు. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున తవ్వకం పని జరుగుతోంది. ఇది పంజాబ్ ప్రభుత్వం, AMTA ల మధ్య ఉన్న ఒక ప్రైవేట్ పబ్లిక్ జాయింట్ వెంచర్.

రవాణా

[మార్చు]

పాకూర్ రైల్వే స్టేషన్ సాహిబ్‌గంజ్ లూప్‌ మార్గంలో ఉంది .

చదువు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "District Census Handbook, Pakur, Series 21, Part XII B" (PDF). Page 25: District Primary Census Abstract, 2011 census. Directorate of Census Operations Jharkhand. Retrieved 24 November 2020. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "census2011" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. "District Census Handbook Pakur, Census of India 2011, Series 20, Part XII A" (PDF). Pages 637-642. Directorate of census Operations, Jharkhand. Retrieved 23 November 2020.

 

"https://te.wikipedia.org/w/index.php?title=పాకూర్&oldid=4339302" నుండి వెలికితీశారు