గొడ్డా
గొడ్డా | |
---|---|
పట్టణం | |
Coordinates: 24°50′N 87°13′E / 24.83°N 87.22°E | |
దేశం | India |
రాష్ట్రం | జార్ఖండ్ |
జిల్లా | గొడ్డా |
విస్తీర్ణం | |
• Total | 8.59 కి.మీ2 (3.32 చ. మై) |
Elevation | 87 మీ (285 అ.) |
జనాభా (2011) | |
• Total | 48,480 |
• జనసాంద్రత | 5,600/కి.మీ2 (15,000/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ, ఉర్దూ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 814133 |
Telephone code | 06422 |
Vehicle registration | JH17 Jha04111993 / [ BR36 ? (Discontinued )] |
గొడ్డా, జార్ఖండ్ రాష్ట్రం, గొడ్డా జిల్లాలోని పట్టణం. ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. పట్టణ పాలనను పురపాలక సంస్థ నిర్వహిస్తుంది.
స్థానం
[మార్చు]గొడ్డా 24°50′N 87°13′E / 24.83°N 87.22°E వద్ద, [1] సముద్రమట్టం నుండి సగటున 77 మీటర్ల ఎత్తున ఉంది. గొడ్డా 1983 మే 25 న అవిభక్త బీహార్ లో 55 వ జిల్లా ఉనికిలోకి వచ్చినపుడూ గొడ్డా దానికి రాజధానిగా ఏర్ప్డింది. 2000 నవంబరు 15 న బీహార్ నుండి జార్ఖండ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత. ఇది జార్ఖండ్‌లోని 18 జిల్లాలలో ఒకతైంది. జాతీయ రహదారి 133 గొడ్డా నగరం గుండా వెళుతుంది.
జనాభా వివరాలు
[మార్చు]జనాభా
[మార్చు]గొడ్డా జనాభా | |||
---|---|---|---|
Census | Pop. | %± | |
1961 | 7,500 | — | |
1971 | 9,733 | 29.8% | |
1981 | 14,917 | 53.3% | |
1991 | 23,637 | 58.5% | |
2001 | 37,008 | 56.6% | |
2011 | 48,480 | 31.0% | |
మూలం:[2] |
2011 భారత జనగణన ప్రకారం, గొడ్డా మొత్తం జనాభా 48,480. ఇందులో 25,707 (53%) పురుషులు, 22,773 (47%) మహిళలు. 0-6 సంవత్సరాల మధ్య వయస్సు గల వారి సంఖ్య 6,745. గొడ్డాలో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 4,1735 (6 సంవత్సరాలకు పైబడిన జనాభాలో అక్షరాస్యత 84.30%). [3]
ఆర్థిక వ్యవస్థ
[మార్చు]ఈ ప్రాంతంలో వ్యవసాయం ప్రధానమైన జీవనాధారం. వరి, గోధుమ, మొక్కజొన్న ఇక్కడ పండే ప్రధానమైన పంటలు. వీటితో పాటు, కూరగాయలు, లిన్సీడ్స్, చెరకు కూడా సాగు చేస్తారు. మామిడి, అరటి, పనస, రేగు వంటి పండ్లు కూడా పండిస్తారు. గొడ్డాలో కొన్ని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా ఉన్నాయి.
గొడ్డా ఇటీవలి కాలంలో పారిశ్రామికీకరణ జరిగింది, అనేక ప్రధాన పరిశ్రామలు ఇక్కడ వచ్చాయి. తేసుబత్తన్‌లో జిందాల్ స్టీల్ & పవర్స్ వారి 1320 మెగావాట్ల తాప విద్యుత్కేంద్రం వచ్చింది. [4]
అదానీ పవర్ లేదా అదానీ గొడ్డా తన 1600 మెగావాట్ల తాప విదుత్కేంద్రాన్ని గొడ్డా వద్ద స్థాపిస్తోంది. భారత విద్యుత్తు రంగంలో ఇది మొట్టమొదటి స్పెషల్ ఎకనామిక్ జోన్ అవుతుంది . [5]
రాజమహల్ కోల్ మైన్స్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా గ్రూపు లోని సంస్థ. మహాగామా వద్ద ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ వారి లాల్మాటియా గనిని నిర్వహిస్తోంది. [6] ECL భారతదేశంలోని అత్యంత పురాతన అతిపెద్ద మైనింగ్ సంస్థల్లో ఒకటి. ఈస్టేన్ కోల్‌ఫీల్డ్స్ సుందర్‌పహరి, గొరిడాలోని బోరిజోర్ బ్లాక్స్ వద్ద బొగ్గు గనులను నిర్వహిస్తోంది.
రవాణా
[మార్చు]గొడ్డా నుండి ఇతర ప్రాంతాలకు చక్కటి రోడ్డు, రైలు మార్గాలున్నాయి. పట్టణ కేంద్రం నుండి గొడ్డా రైల్వే స్టేషను 4 కి.మీ దూరంలో ఉంది. 2021 ఏప్రిల్ 8 న మొదలైన హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్, గొడ్డా రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిన మొదటి రైలు. [7] వారానికోసారి నడిచే ఈ రైలు, భాగ్యపూర్, గయల మీదుగా న్యూఢిల్లీకి వెళ్తుంది.
జాతీయ రహదారి-133 గొడ్డా గుండా వెళుతుంది.
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- భగవత్ జా ఆజాద్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి
- రామేశ్వర్ ఠాకూర్ : మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్
- కీర్తి ఆజాద్ : మాజీ క్రికెటర్, టీమ్ ఇండియా.
మూలాలు
[మార్చు]- ↑ Falling Rain Genomics, Inc - Godda
- ↑ "District Census Handbook Godda, Census of India 2011, Series 20, Part XII A" (PDF). Section II Town Directory, Statement I: Status and Growth History, Page 1082. Directorate of Census Operations, Jharkhand. Retrieved 23 November 2020.
- ↑ "District Census Handbook, Godda, Series 21, Part XII B" (PDF). Page 25: District primary census abstract, 2011 census. Directorate of Census Operations Jharkhand. Retrieved 19 November 2020.
- ↑ Majumdar, Rakhi (2013-04-30). "JSPL to come up with 1320 MW thermal power plant at Godda". The Economic Times. Retrieved 2020-01-16.
- ↑ Chandrasekhar, Aruna. "In final days of Modi government, Adani project in Jharkhand becomes India's first power sector SEZ". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-01-16.
- ↑ "The best site". www.esselmining.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-01-16. Retrieved 2020-01-16.
- ↑ "Indian Railways launches Hansdiha-Godda new line in Jharkhand; starts Godda-New Delhi Humsafar special train".
{{cite web}}
: CS1 maint: url-status (link)