ముర్షిదాబాద్ జిల్లా
ముర్షిదాబాద్ జిల్లా
মুর্শীদাবাদ | |||||||
---|---|---|---|---|---|---|---|
District | |||||||
Country | India | ||||||
రాష్ట్రం | West Bengal | ||||||
Government | |||||||
• Lok Sabha constituencies | Jangipur, Baharampur, Murshidabad | ||||||
• Vidhan Sabha constituencies | Farakka, Samserganj, Suti, Jangipur, Raghunathganj, Sagardighi, Lalgola, Bhagabangola, Raninagar, Murshidabad, Nabagram, Khargram, Burwan, Kandi, Bharatpur, Rejinagar, Beldanga, Baharampur, Hariharpara, Naoda, Domkal, Jalangi | ||||||
• Administrative Division | Presidency | ||||||
• ప్రధాన కార్యాలయం | Baharampur | ||||||
విస్తీర్ణం | |||||||
• District | 5,324 కి.మీ2 (2,056 చ. మై) | ||||||
జనాభా (2011)[1] | |||||||
• District | 71,03,807 | ||||||
• జనసాంద్రత | 1,334/కి.మీ2 (3,460/చ. మై.) | ||||||
• Urban | 14,00,692 | ||||||
• Rural | 57,03,115 | ||||||
Demographics | |||||||
• Population Growth | 21.09% | ||||||
• Literacy | 66.59% | ||||||
• Sex Ratio | 958 | ||||||
భాషలు | |||||||
• అధికార | Bengali,ఆంగ్లం | ||||||
Time zone | UTC+5:30 (IST) |
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 20 జిల్లాలలో ముర్షిదాబాద్ జిల్లా ఒకటి. ఈ జిల్లా గంగానది ఎడమ తీరంలో ఉంది. ఈ జిల్లా భూభాగం చాలా సారవంతమైంది. జిల్లా వైశాల్యం 5,341చ.కి.మీ, జనసంఖ్య 5.863 మిలియన్లు.[2] ఈ జిల్లా జనసాంధ్రతలో దేశంలో 9వ స్థానంలో ఉంది.[3] జిల్లాకేంద్రంగా భహరంపూర్ పట్టణం ఉంది. జిల్లాకు ఈ పేరురావడానికి కారణమైన ముర్షిదాబాద్ ఒకప్పుడు ముస్లిం పాలకుల అధికార కేంద్రంగా ఉంది. ఒకప్పుడు బెంగాల్ ప్రాంతం మొత్తం ఇక్కడి నుండే పాలించబడింది. ప్లాసే యుద్ధం తరువాత సిరాజ్-ఉద్-దుల్లా ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ పాలకుల పరం చేసాడు. తరువాత రాజధాని కొత్తగా స్థాపించబడిన కొలకత్తాకు మారింది.[4]
పేరు వెనుక చరిత్ర
[మార్చు]- See also: Mediaval History of Murshidabad
ముర్షిద్ ఖులి ఖాన్ తరువాత అతని పేరు మీద నిర్మించబడిన చారిత్రక నగరమైన ముర్షిదాబాద్ ఉన్న కారణంగా ఈ జిల్లాకు ఈ పేరు వచ్చింది.
చరిత్ర
[మార్చు]చరిత్ర కాలానికి ముందు
[మార్చు]క్రీ,శ 7వ శతాబ్దం గౌడా రాజ్యానికి చెందిన ప్రముఖ రాజైన శశాంక రాజ్యానికి (దాదాపు బెంగాల్ ప్రాంతం మొత్తం) ఇది రాజధానిగా ఉండేది. తరువాత బెంగాలును పాలించిన పాలా రాజులలో ఒకరైన మహీపాలా ఈ ప్రాంతంలో నివసించారు. ఈ ప్రాంతం క్రీ.పూ 1500 నుండి మానవసివాసితంగా ఉందని భావిస్తున్నారు.[5]
మద్యయుగం
[మార్చు]ఈ జిల్లాకు ఈ పేరు 18వ శతాబ్దంలో వచ్చింది. అలాగే ఇప్పటి ఆకారం అదే శతాబ్దం తరువాతి కాలంలో వచ్చింది. ముర్షదాబాద్ నగరం పేరును జిల్లాకు పెట్టారు. దీర్ఘకాలగా యాత్రీకులు ఈ ప్రాంతం సౌందర్యానికి ముగ్ధులౌతూ వచ్చారు. భాగీరధీనదికి తూర్పు భాగంలో ఉన్న జిల్లా భూభాగం వ్యవసాయానికి, పట్టునేతకు, వ్యాపారానికి కేంద్రంగా ఉంది. దీని అసలు పేరు మఖ్సుదాబాద్. 16వ సతాబ్ధంలో మొగల్ చక్రవర్తి అక్బర్ దీనిని స్థాపించాడు.[6]1702లో ఔరంగజేబు ఈ ప్రాంతానికి (సుభాహ్ భూభాగం) దివానుగా కర్తలాబ్ ఖాన్‌ను నియమించాడు. తరువాత ఆయన 1702లో తన రాజధానిని డక్కా (ఢాకా) నుండి మక్సుదాబాద్‌కు మార్చాడు. 1703లో ఔరంగజేబు కర్తలాబ్ ఖాన్‌ను " ముర్షిద్ ఖులి ఖాన్ " బిరుదుతో సత్కరించాడు. అలాగే మఖ్సుదాబాద్ నగరానికి ముర్షిదాబాద్ అనే పేరు మార్చడానికి అనుమతి ఇచ్చాడు. 1704 నుండి ఇది ముర్షిదాబాద్‌గా పిలువబడుతుంది.[7] స్యూబ్ రాజాస్థానం బెంగాల్, బీహార్, ఒడిషా భూభాగాల సమంవయం. ముర్షీబాద్‌లో జగత్‌సేత్ కుటుంబం తరతరాలుగా ఆర్థిక లావాదేవీలను సాగిస్తూ ఉండేది. ప్లాసా యుద్ధం జరిగిన చాలాకాలం తరువాత ఈ ప్రాంతంలో ఈస్టిండియా కంపనీ ప్రవేశించింది.
1752లో వారెన్ హేస్టింగ్ కొలకత్తాలో ఉన్న సుప్రీం సివిల్, క్రిమినల్ కోర్టులను 1775లో ముర్షిదాబాదుకు మార్చబడ్డాయి. 1790లో లార్డ్ క్రోన్‌వాల్స్, మొత్తం రెవెన్యూ, జ్యుడీషియల్ సిబ్బందిని కొలకత్తాకు పంపాడు. నగరంలో ఇప్పటికీ నవాబుల నివాస స్థలంగా ఉంది. ముర్షిదాబాద్ ప్యాలెస్ 1837 నాటిదని భావిస్తున్నారు. అద్భుతమైన ఈ భవనం ఇటలీ నిర్మాణశైలిలో నిర్మించబడింది. నగరంలో ఇప్పటికీ ఉన్న ప్యాలెసులు, మసీదులు, సమాధులు, పూలతోటలు, దంతం కళాఖండాలు, వెండి, బంగారు వస్తు సామాగ్రి, పట్టు నేత వంటి పలు పరిశ్రమలు నవాబులను వారి పాలనను గుర్తుకు తీస్తుకువస్తుంటాయి. నవాబు కుటుంబం పేరుతో ఉన్న విద్యా సంస్థ కూడా అందులో ఒకటి. .[5]
ఆధునిక శకం
[మార్చు]19వ సతాబ్ధంలో మొదటిసారిగా ఉలేమా పేరుతో మొదలైన స్వాతంత్ర్య ఉద్యమం కులమతాలకు అతీతంగా ప్రజలందరినీ ఐక్యం చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురై నికిచింది. బెంగాల్‌లోని ఇతర ప్రాంతాలలో వలెనే ముర్షిదాబాద్ కూడా స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఉంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ముర్షిదాబాద్ కమిటీ 1921లో రూపుదిద్దుకుంది. దీనికి మొదటి అద్యక్షుడుగా బ్రజభూషణ్ గుప్తా నియమించబడ్డాడు. విద్యార్థులు ఉద్యమకారులతో సంబంధాలు ఏర్పరచుకుని " విదేశీ వస్తు బహిష్కరణలో " పాలుపంచుకున్నారు. బెహరంపోర్ లోని కృష్ణనాథ్ కాలేజీ విద్యార్థులు సూర్యసేన్, నిరంజన్ సేన్ వారి కాలేజి రోజులను ఈ జిల్లాలో గడిపారు. కాజీ నజ్రుల్ ఇస్లాం, నేతాజీ సుభాస్ చంద్రబోస్ తమ కారాగార జీవితాలను ఇక్కడ కొంతకాలం గడిపారు. స్వాతంత్ర్య సమరం కాలంలో మహాత్మా గాంధీ, నేతాజీ, డాక్టర్ రాజేంద్రప్రసాదు, సి.ఆర్ దాస్ వంటి జాతీయ నాయకులు ఈ ప్రాంతానికి విచ్చేసారు. గుర్తించతగిన విషయాలలో 1937లో నవాబు వాసిం అలి మిర్జా హిందూ ముస్లిముల ఐక్యతకు " హిందూ ముస్లిం యూనిటీని " స్థాపించాడు. 1943లో ఫాజిల్ హాక్ ఆహ్వానం అందుకుని కొలకత్తాలో ఒక కాంఫరెంస్ నిర్వహించబడింది. 1940లో త్రిదీప్ చౌదరి నాయకత్వంలో రెవెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ స్థాపించబడింది. క్విట్ ఇండియా ఉద్యమ ఈ ప్రాంతంలో కూడా ప్రభావం చూపింది. 1947 ఆగస్టు 15 న ఇండియాకు స్వతంత్రం వచ్చింది. అప్పుడు ఇండియా విభజన జరిగినప్పుడు 2 రోజులపాటు ముస్లిముల ఆధిక్యం కారణంగా తూర్పు పాకిస్థాన్‌లో భాగంగా ఉంది. రాడ్క్లిఫ్ కమిషన్ చివరి సవరణ తరువాత ఇది తిరిగి భారతదేశంలో భాగంగా మారింది. .[5]
భౌగోళికం
[మార్చు]జిల్లా ఉత్తర సరిహద్దులో మల్దా జిల్లా, వాయవ్య సరిహద్దులో జార్ఖండ్ రాష్ట్ర సాహిబ్‌గంజ్, పాకూర్, పశ్చిమ సరిహద్దులో బిర్బం, నైరుతీ సరిహద్దులో బర్ధామన్, సరిహద్దులో, దక్షిణ సరిహద్దులో నాడియా, తూర్పు సరిహద్దులో బంగ్లాదేశ్లోని రైషాహి జిల్లాలు ఉన్నాయి.
పూల తోటలు, నదులు , వృక్షజాతులు
[మార్చు]ముర్షిదాబాద్ జిల్లాను బాగీరధినది రెండుగా చేస్తుంది. పశ్చిమ దిశలో చోటానాగపూరుకు చెందిన ఎత్తిపల్లాలతో కూడిన రాహ్ ఎగువభూములు ఉన్నాయి. తూర్పు భాగంలో సారవంతమైన గంగా మైదానం ఉంది. జిల్లా వ్యవసాయ భూములకు భాగీరధి, జలంగి నదులు వాటి ఉపనదులు అవసరమైన నీటిని సరఫరాచేస్తున్నాయి. భాగీరధి గంగానది యొక్క శాఖలలో ఒకటి. ఇది దక్షిణంగా ప్రవహిస్తూ జిల్లాను రెండు భాగాలుగా విభజిస్తుంది. అధికభాగం పొడిగా ఉండి వ్యవసాయానికి ఉపయోగపడుతూ ఉంది. జిల్లాలో సాధారణంగా వేప, మామిడి, పనస చెట్లు కనిపిస్తుంటాయి. నౌడా థానా వద్ద ఉన్న జఒబొనా గ్రామాన్ని పశ్చిమ బెంగాల్ హరితగ్రామం అని అంటారు.
వాతావరణం
[మార్చు]ముర్షిదాబాద్ ఉష్ణమండల తడి, పొడి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. (కొప్పెన్ వాతావరణ వర్గీకరణ). వార్షిక సగటు ఉష్ణోగ్రత సుమారు 27 °C; నెలవారీ సగటు ఉష్ణోగ్రతలు 17 °C నుండి 35 °C వరకు ఉంటాయి (సుమారు గణాంకాలు). వేసవికాలం వేడి, తేమతో ఉంటుంది, తక్కువ 30లలో ఉష్ణోగ్రతలు ఉంటాయి, పొడి కాలాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మే జూన్‌లలో తరచుగా 40 °C కంటే ఎక్కువగా ఉంటాయి. శీతాకాలం దాదాపు రెండున్నర నెలలు మాత్రమే ఉంటుంది, డిసెంబరు, జనవరి మధ్య కాలానుగుణంగా 9 °C – 11 °C వరకు తగ్గుతుంది. సగటున, మే నెల అత్యంత వేడి నెల. రోజువారీ సగటు ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 27 °C నుండి గరిష్ఠంగా 40 °C వరకు ఉంటాయి, జనవరిలో అత్యంత శీతలమైన నెలలో ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 12, °C నుండి గరిష్ఠంగా 23 ° వరకు ఉంటాయి. తరచుగా వేసవి ప్రారంభంలో, ఉరుములతో కూడిన తుఫానులు లేదా వడగళ్ళుతో భారీ వర్షాలు, మంచు తుఫానులు జిల్లాను అతలాకుతలం చేస్తాయి, తేమతో కూడిన వేడి నుండి ఉపశమనం పొందుతాయి. ఈ ఉరుములు ఉష్ణప్రసరణ స్వభావం కలిగి ఉంటాయి.[8]
బంగాళాఖాం నుండి వీచే నైరుతీ రుతుపవనాలు జిల్లాకు జూన్, సెప్టెంబరు మాసాల మద్య వర్షాన్ని అందిస్తున్నాయి. ఇవి జిల్లాకు సంవత్సరానికి సరిపడా వర్షాన్ని (దాదాపు 1,600 మి.మీ) అందిస్తున్నాయి. ఆగస్టు మాసంలో అత్యధికంగా వర్షం (దాదాపు 300మి.మీ) కురుస్తుంది. వర్షాకాలంలో సంభవించే వరదలు ప్రజల ఆస్తి, పంట, ప్రాణాలకు నష్టం కలిగిస్తుంది.
ఆర్ధికం
[మార్చు]జిల్లాలో ప్రజలో అత్యధికులు వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు. జిల్లాలో కొన్ని పట్టుతయారీ సంస్థలు, నేత యంత్రాలు ఉన్నప్పటికీ ఆధునిక పరిశ్రమల కారణంగా అవి నష్టాలలో మునుగుతూ ఉన్నాయి. నాణ్యత కలిగిన పట్టుకు ముషీరాబాద్ ప్రసిద్ధిచెందినది. జిల్లాలో పలు బీడీ ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి.
2011 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ముర్షిదాబాద్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[9] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[9]
వ్యవసాయం
[మార్చు]జిల్లాలో వరి, జనపనార, చిక్కుళ్ళు, నూనెగింజలు, గోధుమ, బార్లీ, మామిడి వంటి ప్రధానపంటలు పండించబడుతున్నాయి. జిల్లా పశ్చిమ భూభాగంలో మలబరీ పండించబడుతుంది. జిల్లాలో వైవిధ్యత, నాణ్యత కలిగిన మామిడి పండ్లు పండించబడుతున్నాయి. అయినప్పటికీ పొరుగున ఉన్న మల్దా జిల్లాలోలాగా ముర్షిదాబాద్ పంటలలో మామిడి పంట ప్రధానమైనది కాదు.
దంతం , పట్టు
[మార్చు]బెంగలీ నవాబులకు ముర్షిదాబాద్ రాజధానిగా ఉన్నప్పటి నుండి ఈ ప్రాంతంలో దంతం, కొయ్య శిల్పాల పరిశ్రమ ఉంటూ వచ్చింది. విలాసవంతమైన రాజసభ, సంపన్నుల ఆదరణతో ఈ పరిశ్రమ అభివృద్ధి పథంలో సాగింది. నవాబు పాలన పతనం తరువాత రాజ్యసభతో పనిలేక పోయిన తరువాత ఈ పరిశ్రమకు గడ్డు పరిస్థితి ఎదురైంది. బ్రిటిష్ ప్రభుత్వ ఆరంభకాలంలో ముర్షిదాబాద్ దంతపు చెక్కడాలు విదేశీయుల ప్రశంశలను పొందాయి. 1851లో లండన్‌లో జరిగిన ప్రదర్శనలో భారతదేశం నుండి పంపబడిన వివిధ దంతపు కళాఖండాల సూక్ష్మమైన నైపుణ్యనికి చూపరుల ప్రశన్శలను అందుకున్నాయి. 1888లో తిరిగి ముర్షిదాబాద్ దంతపు కళాఖండాలు భరతదేశంలో ఉత్తమమైనవన్న ప్రశంశలకు పాత్రమయ్యాయి. నైపుణ్యం, పురాణదృశ్యాలను ప్రతిబింబించే ముర్షిదాబాద్ దంతపు కళాల్హండాలు ఈ జిల్లాకు ప్రత్యేకత సంతరించి పెట్టాయి.
ఈ ప్రాంతంలో బెర్హంపోర్ సైనిక కేంద్రంగా ప్రధాన్యత సంతరించుకున్న సమయంలో సుసంపన్నంగా ఉన్న ఈ పరిశ్రమ పట్టణానికి సైనికపరమైన ముఖ్యత్వం తగ్గిన తరువాత క్షీణించడం మొదలైంది. ముందుగా ఈ కళాఖండాలు వ్యాపారం రైలుమార్గం మీద ఆధారపడక ఉంటే ఈ కళ పూర్తుగా అనరించి ఉండేది. మొదట భారతదేశం, ఇంగ్లాండ్, ఐరోపా దేశాలలోని ఎగ్జిబిషన్లలో ప్రదర్శించడానికి బ్రిటిష్ ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున ఆర్డర్లను అందుకున్నది. తరువాత కళాకాండాలను సంపన్నులు, జమీందారుల నుండి లోన్ రూపంలో సేకరించడం కారణంగా ఈ పరిశ్రమకు తిరిగి సమస్యలు ఎదురైయ్యాయి. ముర్షిదాబాద్ నవాబు, కాసింబజార్ మహారాజా వారి వద్ద ఉన్న కళాకాండాలను ఇవ్వడానికి అంగీకరించారు. ముర్షిదాబాద్ సమీపంలో ఉన్న మథ్రా, దౌలత్ బజార్, రంసంగోగ్రాం ఈ కళాఖండాల తయారీకి ఖ్యాతిగాంచాయి. పరిశ్రమ క్షీణదశ ఆరంభం అయిన తరువాత ఇవి మరుగునపడ్డాయి.
ఇండియన్ కార్క్ (షోలా)
[మార్చు]మిల్కీ-వైట్ స్పాంజ్ - వుడ్‌ను షోలాపిథ్ అంటారు. దీనిని సున్నితంగా చెక్కి అందమైన కళావస్తువులు తయారు చేస్తారు. షోలా అనే మొక్క చిత్తడి నేలల మద్య ఉన్న ప్రంతంలో పెరుగుతుంది. షోలా బయలాజికల్ పేరు అస్చినోమెనే ఇండికా లేక అస్చినోమెనే అస్పెరా (బీన్ కుటుంబం). అంతేకాక ఇది ఔషధ గుణం కలిగిన మొక్కగా గుర్తించబడుతుంది. షోలాపిథ్ కాండం 1.5 అంగుళాల మందం ఉంటుంది. కఠినమైన వెలుపలి బెరడును నైపుణ్యంతో విడదీయబడుతుంది. లోపలి పాలవర్ణంలో మెత్తని పదార్థం కృత్రిమంగా కర్మాగారాలలోతయారు చేయబడే ధర్మాకోలులా ఉంటుంది. అయినప్పటికీ షోలాపిథ్ ధర్మాకోల్ కంటే అన్నింటా అత్యధికమైన నాణ్యతకలిగి ఉంది. కళాకారులు దీని నుండి కళావస్తువులను తయారుచేస్తారు. ముర్షిదాబాద్‌లో పూల డిజైన్ కలిగిన షోలా వస్తువులు, అలంకరించిన టోపీలు, దేవతాబొమ్మలు, పూలమాలలు, దేవతల ముఖాలు, ఎలిఫెంట్ - హౌడాస్, పీకాక్- నౌకలు, పల్లకీలు తయారుచేయబడుతున్నాయి.
కంచు తయారీ
[మార్చు]కంచు, ఇత్తడి పాత్రలు పెద్ద ఎత్తున కాంగ్రా, బెర్హంపోర్, కండి, బరానగర్, జంగిపూర్ తయారుచేయబడుతున్నాయి. అవి ప్రాంతీయ మార్కెట్లలో ఎగుమతి చేయడం, అమ్మడం జరుగుతూ ఉంటుంది. అతుత్తమ నాణ్యత కలిగిన తాళాలు, అడకత్తెరలు ధులియన్‌లో తయారు చేయబడుతుండగా, ఐరన్ చెస్టుల తయారీ జంగిపూరులో జరుగుతుంది. ముడిసరుకు సరఫరాలో సమస్యలు ఉన్నా తయారీ సజావుగా సాగుతూనే ఉంది. ముడిసరకు కొరకు అభ్యర్ధనలను అంగీకరించడంలో జాప్యం వంటి సమస్యలు ఈ ఉత్పత్తిదారులకు ఆటకాలను కలిగిస్తుంది. స్టెయిన్‌లెస్ స్టీల్, ప్లాస్టిక్, సెరామిక్ వస్తువులు క్రాకరీ వస్తువుల పట్ల ప్రజాదరణ అధికరిస్తూ ఉన్నందున ఈ పరిశ్రమ కొంత దెబ్బతింటూ ఉంది.
భారీపరిశ్రమలు
[మార్చు]సాగర్దిఘి వద్ద రఘునాథ్‌గంజ్‌కు 12కి.మీ దూరంలో ఉంది. ఫరక్కా వద్ద కేంద్రప్రభుత్వ పవర్‌ప్లాంట్ " ఎన్.టి.పి.సి " 1600 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. జిల్లాలో బీడీ ఉత్పత్తి అత్యధిక స్థాయిలో జరుగుతుంది. జిల్లా బీడీ ఉత్పత్తిలో అత్యధికంగా స్త్రీలు భాగస్వామ్యం వహిస్తున్నారు. జిల్లాలో జంగీపూర్ వద్ద ఒక ఇనుము & ఉక్కు తయారీ సంస్థ ఉంది. గృహావసర ఫ్లాస్టిక్ వస్తు ఉత్పత్తిలో ఒమర్పూర్ ముందంజలో ఉంది.
పట్టు , చీరెలు
[మార్చు]ముర్షిదాబాద్ జిల్లాలో బలుచార్ నగరంలో బలుచారి చీరెలు తయారు చేయబడుతున్నాయి. బకుచారి చీరెలు పట్టునేత, పట్టు అంచులతో వివిధ వర్ణాలతో తయారు చేయబడుతున్నాయి. బలుచారి డిజైలలో వివిధ వర్ణాలు ఉండక సెల్ఫ్ డిజైన్లకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ వస్త్రాలను తయారుచేయడానికి ఎరుపు, నీలివర్ణం, పసుపు, స్కార్లెట్ వర్ణాలను అధికంగా ఉపయోగిస్తారు. బలుచారి డిజైన్లలో పెద్ద పూలు, పూచిన పొదలు ప్రాధాన్యత వహిస్తాయి. ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు నేసే డిజైన్లలో సభాసన్నివేశాలు, గుర్రపుస్వారీ చేస్తున్న వీరులు, హుక్కా త్రాగుతున్న స్త్రీలు ఉంటారు. కలకా డిజైన్ లేక కోన్ డిజైన్లు పూలతో చేర్చి తయారు చేయబడతాయి.
పశ్చిమ బెంగాల్ పూర్వం నుండి పట్టువస్త్రాలకు ప్రసిద్ధి. ముర్షిదాబాద్‌కు ఆగౌరవంలో కొంత దక్కుతుంది. బెంగాల్ పట్టు ఉత్పత్తిదారులు ఈస్టిండియా తరఫున ఎగుమతి సంస్థను ఆరంభించి ఇంగ్లాండుకు పట్టును ఎగుమతి చేయడం ఆరభించినందున భారతీయ పట్టువస్త్రాలకు ఆసియా దేశాలలో సంతలో సముచిత స్థానం లభించింది. మాల్దా, కాసింబజార్ వద్ద ఆంగ్లేయులు టెక్స్టైల్ ఫ్యాక్టరీలు ఆరంభించిన తరువాత బెంగాలుకు చెందిన ఇంగ్లీష్ కంపనీ వ్యాపారులు అభివృద్ధి చెందారు. చౌకగా లభించడం, నాణ్యత కారణంగా భారతీయ వద్త్రాలకు ఆగ్లేయుల మద్య ఆదరణ లభించింది. 18వ శతాబ్ధపు మద్యకాలానికి దేశం మొత్తానికి కాసింబజార్ పట్టువస్త్రాల గురించి తెలిసివచ్చింది. పలు ఉపయుక్తమైన పరిశ్రమలు ఉన్నందున ఈ ప్రాంతంలో నివసిస్తున్నవారిలో పలువురు శ్రామికులు ఉన్నారు. సా.శ. 1663 కాసింబజారులో డచ్ వారు స్థాపించిన ఫ్యాక్టరీలో 700 మంది నేతవారు పనిచేయసాగారు. అలాగే ఇంగ్లాండు, ఇతర యురేపియన్ సంస్థలలో పనిచేస్తున్న శ్రామికులు తక్కువ సంఖ్యలో ఉంది. మొత్తంగా నగరంలో సంవత్సరానికి 22,000 బేళ్ళు తయారు చేస్తూ ఉండేవారు. ఒక్కో బేలు 100 పౌండ్ల బరువు ఉండేది. మొత్తం వస్త్రాల బరువు 12,03,120 కిలోల బరువు ఉండేది. డచ్ తయారీ వస్త్రాలు జపాన్, హాలండుకు 6,000-7000 బేళ్ళు ఎగుమతి చేయబడేవి. మిగిలిన 9,000 బేళ్ళు దేశీయంగా విక్రయించబడేవి. దేశీయంగా విక్రయించడానికి ప్రత్యేకవిధానంలో వస్త్రాలు తయారు చేయబడేవి. అహమ్మదాబాద్, సూరత్ లకు తీసుకురాబడిన పట్టు ఇక్కడ దేశీయ అవసరాలకు తగిన విధంగా వస్త్రాలుగా తయారు చేయబడుతుండేవి.
ప్రయాణ వసతులు
[మార్చు]జిల్లాలో ప్రధానంగా రహదారి, రైలు మార్గాలు ప్రయాణవసతులు కలిగిస్తున్నాయి. జిల్లాలో ప్రధాన నదులు ప్రవహిస్తున్నప్పటికీ జలమార్గం రవాణాకు ఉపయోగించడం లేదు. నదుల మీద వంతెనలు లేవు. అయినప్పటికీ అక్కడక్కడా ఫెర్రీలు, బోట్లు వంటివి ప్రయాణ వసతి కల్పిస్తుంది.
రహదారి
[మార్చు]జిల్లా అంతటా సులభంగా లభించే బసులు సాధారణంగా ప్రయాణ వసతులు కల్పిస్తున్నాయి. బసులు దగ్గర, దూరం అలాగే జిల్లా లోపల, వెలుపలి భాగాలకు బసు వసతి ఉంది. బసు చార్జీలు చౌకగా ఉంటాయి. వస్తువులు అధికంగా ట్రక్కులలో రవాణాచేయబడుతుంది. ట్రక్కులలో అధికమైన లోడును ఎక్కించడం సాధారణం. రహదారులు స్థితి తగ్గడానికి ట్రక్కుల కారణంగా ఉన్నాయి.[10]
రైలు
[మార్చు]జిల్లాలో 2 ప్రధాన రైలు మార్గాలు ఉన్నాయి. ప్రధాన రైలు మార్గం ఉత్తర దక్షిణంగా ఉంది. ఇది ఉత్తర బెంగాల్‌ను కొలకత్తాతో అనుసంధానిస్తూ ఉంది.ఈ మార్గంలో అజింగంజ్ నుండి సాహిబ్‌గంజ్ జంక్షన్ వరకు వేయబడి ఉంది.
విభాగాలు
[మార్చు]ఉపవిభాగాలు
[మార్చు]- జిల్లాలో 5 ఉపవిభాగాలు : బ్రహ్మపూర్, దొంకొల్ ఉపవిభాగం, లాల్బాగ్, కండి ఉపవిభాగం, జంగిపూర్ ఉపవిభాగం ఉన్నాయి. పురపాలకాలు కాక ఒక్కొక ఉపవిభాగంలో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు కలిగిన కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు ఉన్నాయి.[11]
- జిల్లాలో మొత్తంగా 29 నగరప్రాంతాలు, 7 పురపాలకాలు, 22 పట్టణాలు, బహరాంపూర్, కాసిం బజార్ కలిపి మొత్తంగా ఉర్బన్ అగ్లోమరేషన్.
- బహరాంపూర్ ఉపవిభాగం :- బహరాంపూర్ పురపాలకం, బెల్దంగా పురపాలకం, 5 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు: బెర్హంపూర్, బెల్దంగా -1, బెల్దంగా -2, హరిహర్పరా, నవోడా.
- దొంకొల్ ఉపవిభాగం :- 4 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు: దొంకొల్, రాణినగర్ -1, రాణినగర్ -2, జలంగి.
- లాల్బాగ్ ఉపవిభాగం :- ముర్షిదాబాద్ పురపాలకం, జైగంజ్, అజిగంజ్ పురపాలకం, 5 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు: ముర్షిదాబాద్ –జైగంజ్, భగవంగొల-1, –భగవంగొల-2, లాల్గొల, నబగ్రాం.
- కండి ఉపవిభాగం :- కండి పురపాలకం, 5 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు: కండి, ఖర్గ్రాం, బుర్వాన్, భరత్పూర్-1, భరత్పూర్-2.
- జంగిపూర్ ఉపవిభాగం:- జంగిపూర్ పురపాలకం, ధుకియన్ పురపాలకం, 7 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు: రఘునాథ్గంజ్ -1, రఘునాథ్గంజ్ -2, సుతి-1, సుతి-2, సంసెర్గంజ్, సాగర్దిగి, ఫరక్క.[12] జిల్లాలో 26 పోలీస్ స్టేషన్లు,[13] 26 డెవెలెప్మెంటు బ్లాకులు, 7 పూరపాలకాలు, 254 గ్రామ పంచాయితీలు, 1937 గ్రామాలు ఉన్నాయి.[12][14]
అసెంబ్లీ నియోజకవర్గాలు
[మార్చు]పశిమబెంగాల్ డిలిమినేషన్ ఆఫ్ కంసిస్టెన్సీస్ సిఫారుసుతో డిలిమినేషన్ కమిషన్ " ఆదేశానుసారం ముర్షిదాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల పునర్విభజన తరువాత జిల్లా 22 శాసనసభ నియోజకవర్గాలుగా విభజించబడింది:[15]
- ఫరక్కా (విధాన సభ నియోజకవర్గం) # 55),
- సంసెర్గంజ్ (విధాన సభ నియోజకవర్గం) ( అ.ని # 56),
- సుతి (విధాన సభ నియోజకవర్గం) ( అ.ని # 57),
- జంగిపూర్ (విధాన సభ నియోజకవర్గం) ( అ.ని # 58),
- రఘునాథ్‌గంజ్ (విధాన సభ నియోజకవర్గం) ( అ.ని # 59),
- సాగర్‌డిఘి (విధాన సభ నియోజకవర్గం) ( అ.ని # 60),
- లాల్గొల (విధాన సభ నియోజకవర్గం) ( అ.ని # 61),
- భగబంగొల (విధాన సభ నియోజకవర్గం) ( అ.ని # 62),
- రాణీగర్ (విధాన సభ నియోజకవర్గం) ( అ.ని # 63),
- ముర్షిదాబాద్ (విధాన సభ నియోజకవర్గం) ( అ.ని # 64),
- నబగ్రాం (విధాన సభ నియోజకవర్గం) ( అ.ని # 65),
- ఖర్గ్రాం (విధాన సభ నియోజకవర్గం) ( అ.ని # 66),
- బర్వాన్ (విధాన సభ నియోజకవర్గం) ( అ.ని # 67),
- కంది (విధాన సభ నియోజకవర్గం) ( అ.ని # 68),
- ఉదయ్ (విధాన సభ నియోజకవర్గం) ( అ.ని # 69),
- రెజినగర్ (విధాన సభ నియోజకవర్గం) ( అ.ని # 70),
- బెల్దంగ (విధాన సభ నియోజకవర్గం) ( అ.ని # 71),
- బహరాంపూర్ (విధాన సభ నియోజకవర్గం) ( అ.ని # 72),
- హరిహరపరా (విధాన సభ నియోజకవర్గం) ( అ.ని # 73),
- నఓడా (విధాన సభ నియోజకవర్గం) ( అ.ని # 74),
- దొంకల్ (విధాన సభ నియోజకవర్గం) ( అ.ని # 75)
షెడ్యూల్డ్ జాతి , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు
[మార్చు]- షెడ్యూల్డ్ జాతి, షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు:- జలంగి (విధాన సభ నియోజకవర్గం) ( అ.ని # 76). నబగ్రాం, ఖర్గ్రాం, బుర్వాన్ నియోజకవర్గాలు షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) అభ్యర్థులకు ప్రత్యేకించబడి ఉంది.[15]
- మల్దహ దక్షిణ్ పార్లమెంటరీ నియోజకవర్గం:- ఫరక్కా, సంసెర్గజ్.శాసనసభ నియోజక వర్గాలు.
- జంగిపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం:- సుతి, జంగిపూర్, రఘునాథ్గంజ్, సాగర్దిగి, లాల్గొల, నబగ్రాం, ఖర్గ్రాం. శాసనసభ నియోజక వర్గాలు.[15]
- బహరాంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం:- బుర్వాన్, కండి, భరత్పూర్, రెజినగర్, బెల్దంగా, బహరాంపూర్, నయోడా శాసనసభ నియోజక వర్గాలు.
- ముర్షిదాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం:- భగబంగొల, రాణినగర్, ముర్షిదాబాద్, హరిహరపరా, దొంకల్, జలనగి. శాసనసభ నియోజక వర్గాలు., నాడియా జిల్లా నుండి కరీంపూర్ శాసనసభ నియోజక వర్గం.[15]
- 2008 ఫిబ్రవరి 16 పునర్విభజన జరిగిన తరువాత బెంగాల్ ఎన్నికలు సమర్ధవంతంగా నిర్వహించబడుతున్నాయి.[16]
పునర్విభజనకు ముందు అసెంబ్లీనియోజకవర్గాలు
[మార్చు]ముర్షిదాబాద్ జిల్లా 19 శాసనసభనియోజకవర్గాలుగా విభజించబడింది:[17]
- ఫరక్కా (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 50),
- ఔరంగాబాద్ (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 51),
- సుతి (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 52),
- సాగర్దిగి (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 53),
- జంగిపూర్ (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 54),
- లాల్గొల (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 55),
- భగబంగొల (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 56),
- నబగ్రాం (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 57),
- ముర్షిదాబాద్ (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 58),
- జలంగి (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 59),
- దొంకల్ (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 60),
- నవోడా (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 61),
- హరిహరోర (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 62),
- బహరాంపూర్ (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 63),
- బెల్దంగ (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 64),
- కంది (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 65),
- ఖర్గ్రాం (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 66),
- బుర్వాన్ (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 67),
షెడ్యూల్డ్ జాతి , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు
[మార్చు]- (ఎస్సీ) షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభ్యర్థుల కొరకు సాగర్దిగి, ఖర్గ్రాం నియోజకవర్గాల ప్రత్యేకించబడ్డాయి.ఉదయ్ (విధాన సభ నియోజకవర్గం) (అ.ని # 68).[17]
- జంగీపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం:- ఫరక్కా, ఔరంగాబాద్, సుతి, సాగర్ధిహి, సంగిపూర్, నబగ్రాం, ఖర్గ్రాం. శాసనసభ నియోజక వర్గాలు.[17]
- ముర్షిదాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం:- లాల్గొల, భగబంగొల, ముర్షిదాబాద్, జలంగి, హరిహరపరా, మయూరేశ్వర్., నాడియా జిల్లా నుండి కరీంపూర్ శాసనసభ నియోజకవర్గంతో చేర్చి.శాసనసభ నియోజకవర్గాలు.[17]
- పార్లమెంటరీ నియోజకవర్గం:- నయోడా, బెర్హంపోర్, కండి, బర్వాన్, భరత్పూర్, బర్ధామన్ జిల్లా నుండి కేతుగ్రాం శాసనసభ నియోజకవర్గంతో చేర్చి. శాసనసభ నియోజక వర్గాలు.[17]
ఉపవిభాగం
[మార్చు]- బెర్హంపూర్
- లాక్బాఘ్
- కండి
- జంగిపూర్
- దొంకల్
- ముర్షిదబాద్
- సాగర్దిగి.
2011 లో గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 7,102,430,[3] |
ఇది దాదాపు. | బల్గేరియా దేశ జనసంఖ్యకు సమానం.[18] |
అమెరికాలోని. | వాషింగ్టన్ నగర జనసంఖ్యకు సమం.[19] |
640 భారతదేశ జిల్లాలలో. | 9వ స్థానంలో ఉంది.[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1334 [3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 21.07%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 957:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 67.53%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. |
2001 లో గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 5,863,717 |
జిల్లా వైశాల్యం | 5324 |
ఇది దాదాపు. | దేశ జనసంఖ్యకు సమానం. |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | వ స్థానంలో ఉంది. |
1చ.కి.మీ జనసాంద్రత. | 1101 [20] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | |
స్త్రీ పురుష నిష్పత్తి. | 952 :1000.[20] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | |
జాతియ సరాసరి (72%) కంటే. |
జిల్లా వివరాలు
[మార్చు]గ్రామీణ/నరగప్రాంతం | ప్రాతం | ప్రజలు | పురుషులు | స్త్రీలు | జనసాంధ్రత | స్త్రీ:పురుషులు |
---|---|---|---|---|---|---|
మొత్తం | 5,324 కి.మీ2 (2,056 చ. మై.) | 3,015,422 | 1,546,633 | 1,468,789 | 1,101/చ.కి. (2,850/చ.మై.) | 952 |
Rural | 5,195.11 కి.మీ2 (2,005.84 చ. మై.) | 2,757,002 | 1,414,097 | 1,342,905 | 988/చ.కి. (2,560/చ.మై.) | 949 |
నగరప్రాంతం | 128.89 కి.మీ2 (49.76 చ. మై.) | 258,420 | 132,536 | 125,884 | 5,682 కి.మీ2 (2,194 చ. మై.) |
మతం
[మార్చు]ముర్షిదాబాద్ జిల్లాలో 64% ముస్లిములు ఉన్నారు,[21]
నియోజకవర్గం పేరు | మొత్తం జనసంఖ్య | ముస్లిం జనసంఖ్య | ముస్లిం శాతం |
---|---|---|---|
55.ఫరక్కా | 254829 | 166341 | 65.27% |
56.సంసెర్గంజ్ | 249914 | 198112 | 79.27% |
57.సుతి | 282783 | 186340 | 65.90% |
58.జంగిపూర్ | 268571 | 148773 | 55.39% |
59.రఘునాథ్గంజ్ | 254429 | 192367 | 75.61% |
60.సగర్దిఘి | 252293 | 156870 | 62.18% |
61. లాల్గొల | 249148 | 194978 | 78.26% |
62.భగబంగొల | 280096 | 238253 | 85.06% |
63.రాణినగర్ | 271993 | 220455 | 81.05% |
64.ముర్షిదాబాద్ | 284417 | 118469 | 41.65% |
65.నాబాగ్రాం (ఎస్.సి) | 273432 | 140623 | 51.43% |
66.ఖర్గ్రాం (ఎస్.సి ) | 257519 | 129698 | 50.36% |
67.బుర్వాన్ (ఎస్.సి) | 242660 | 103676 | 42.72% |
68.కండి | 265125 | 135194 | 50.99% |
69.భరత్పూర్ | 260027 | 143337 | 55.12% |
70.రెజినగర్ | 276017 | 173317 | 62.79% |
71.బెల్డంగ | 264351 | 165892 | 62.75% |
72.భరంపూర్ | 279583 | 76549 | 27.38% |
73.హరిహరపరా | 269300 | 201069 | 74.66% |
74.నయోడా | 264042 | 187778 | 71.12% |
75.డొంకల్ | 282925 | 250625 | 88.58% |
76.జలంగి | 283115 | 206665 | 73.00% |
మొత్తం | 5866569 | 3735380 | 63.67% |
భాషలు
[మార్చు]ముర్షిదాబాద్ జిల్లాలో బెంగాలీ ప్రధాన భాషగా ఉంది. దక్షిణ బెంగాల్ యాసకు స్వల్పమైన యాసతో ఈ భాషను మాట్లాడుతుంటారు. తరువాత స్థానంలో ఖొత్తా భాష ఉంది. ఇది హిందీతో బెంగలీ పదాలను మిశ్రితం చేసిన భాష. ఈ భాష మాల్దా, బిర్బం, ముర్షిదాబాద్ జిల్లాలో వాడుకలో ఉంది. ఈ భాష జిల్లాలోని ఉత్తర ప్రాంతంలో వాడుకలో ఉంది. ఖొత్తా మాట్లాడే ప్రజలు ప్రత్యేకంగా ఫరక్కా నుండి జంగిపూర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ముస్లిం సమాజానికి చెందిన వీరు మాట్లాడుతున్న భాష ఆధారంగా ఒ.బిసి కేటగిరి వారిగా పరిగణించబడుతున్నారు.
సంస్కృతి
[మార్చు]పర్యాటకం
[మార్చు]బెంగాల్ చరిత్రలో ముర్షిదాబాద్ పట్టణం ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ ప్రాంతం ప్రతిసంవత్సరం అనేకమంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.
ది హజార్ దుయరి ప్యాలెస్
[మార్చు]ది హజార్దురై ప్యాలెస్ లేక ప్యాలెస్ విత్ ఎ తౌజండ్ డోర్స్ (వెయ్యిద్వారాల రాజభవనం) పర్యాటక ఆకర్షణగా ఉంది. ఈ మూడంతస్థుల భవనం 1887లో మిర్ జాఫర్ వంశానికి చెందిన నవాబ్ నాజిం హుమాయూన్ జాహ్ కొరకు డంకన్ మెక్లియోడ్ చేత నిర్మించబడింది. ఈ భవంలో 1000 ద్వారాలు ( 100 ద్వారాలు మాత్రమే అసలైనవి ), 114 గదులు, 8 గ్యాలరీలతో యురఇయన్ శైలితో నిర్మించబడింది. హజార్దురై మొత్తం వైశాల్యం 41 చ.హె. ప్రస్తుతం ఇది మ్యూజియంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆయుధాలు, అద్భుతమైన చిత్రాలు, సజీవమైన నవాబుల చిత్రపటాలు, చైనా ఐరోపాకు చెందిన దంతపు కళాఖండాలు, ఇతర విలువైన వస్తువులు బధ్రపరచబడి ఉన్నాయి. 2,700 ఆయుధాలు సేకరించబడి ఉండగా వాటిలో కొన్ని మాత్రమే ప్రదర్శించబడుతున్నాయి. సూరజ్-ఉద్-దౌలా, ఆయన తాతగారు నవాబు అలివర్ధీ ఖాన్ ఉపయోగించిన ఖడ్గాలు ఇక్కడ బధ్రపరచబడి ఉన్నాయి. ఇతర ఆకర్షణలుగా నవాబులు వారి కుటుంబాలు ఉపయోగించిన వింటేజ్, ఫిట్టన్ కార్లు ఉన్నాయి..
మదినా
[మార్చు]రాజభవనం, ఇమాంబారా మద్య ఒక చిన్న మసీదు మదీనా ఉంది. ఇందులో వర్ణరంజితమైన టైల్స్‌తో అలకరించబడిన వరండాలు ఉన్నాయి. ఈ మసీదులో మదీనాలో ఉన్న హజారత్ ముహమ్మద్ సమాధికి లాంటి అలకృతమైన నమూనా సమాధి ఉంది.
వాసెఫ్ మంజిల్ , ఇతర భవనాలు , ప్రాంతాలు
[మార్చు]గంగాతీరంలో నిర్మించబడిన వాసెఫ్ మంజిల్ (కొత్త రాజభవనం), త్రిపోలియా గేట్, దక్షిణ దర్వాజా, చాక్ దర్వాజా, ఇమాంబారా, ఘరిఘర్ (గడియారపు గోపురం) బచ్చావాలి టోప్, మదీనా (సూరజ్-ఉద్- దౌలా నిర్మించిన భవనాలలో సజీవంగా ఉన్నది) ఉన్నాయి. బచ్చావాలి టోప్ 12వ శతాబ్దం, 14వ శతాబ్దంలో చేయబడింది. దీనిని తయారు చేయడానికి గౌర్ ముస్లిం పాలకులు 18 కిలోల తుపాకి పౌడర్ వాడారని భావిస్తున్నారు.
రాయల్ గ్రంథాలయం
[మార్చు]రాయల్ గ్రంథాలయంలో ప్రత్యేక అనుమతి లేకుండా ఎవరూ ప్రవేశించడానికి వీలుపడదు. ఈ భవనం 424 అడులుల పొడవు 200 అడుగుల వెడల్పు, 80 అడుగుల ఎత్తులో దీర్ఘచతురస్రాకారంలో ఉంది. ఈ ప్రదేశాన్ని నవాబులు దర్బారుగా, ఇతర అధికారిక కార్యకలాపాలకు అలాగే బ్రిటిష్ అధికారుల నివాసంగా ఉపయోగించేవారు.
ఉత్సవాలు
[మార్చు]ఈడ్-ఉల్-ఫిత్ర్, ఈద్-ఉల్-అధా (బక్రి-ఈద్ (ప్రాంతీయం) మొదలైనవి జిల్లాలో ప్రధానంగా నిర్వహించబడుతున్నాయి. ముస్లిముకు ఉపవాసం ఉండే రంజాన్ మాసంలో బస్ స్టాండ్, ఆహారశాలలు నిర్జనంగా కనిపిస్తుంటాయి. ముషరం సందర్భంలో అసుర ఉత్సవం ముహమ్మద్ మనుమలైన హాసన్, ఇమాంహుస్సేన్ మరణాలను గుర్తుకు తీసుకువస్తుంది.
- 5 రోజుల పాటు నిర్వహించవడే దుర్గా పూజ హిదువుల ఉత్సవాలలో చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది.
ప్రముఖులు , సాహిత్యం
[మార్చు]- నిరుపమ దేవి
- మొనిరుద్దీన్ ఖాన్
- మహాశ్వేతా దేవి
- సయ్యద్ ముస్తఫా సిరాజ్
- మనీష్ ఘటక్
- నబరున్ భట్టాచార్య
- రామేంద్ర సుందర్ త్రిబేడి
- పవన్ దాస్ బౌల్
చరిత్ర, సైన్స్ అండ్ కల్చర్
[మార్చు]- డాక్టర్ నజ్రుల్ ఇస్లాం మతం
- రఖల్దాస్ బందోపాధ్యాయ
- రాధాకమల్ ముఖర్జీ
- రాధా కుముద్ ముఖర్జీ
- రామ్ బ్రహ్మ సన్యాల్
- సయ్యద్ ముస్తఫా సిరాజ్
- శ్రెయా ఘోషాల్
- అరిజిత్ సింగ్
విద్యా సంస్థలు
[మార్చు]ముర్షిదాబాద్ లో విద్యా సంస్థ్సలు, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి: స్కూల్స్ '
- ఢిల్లీ పబ్లిక్ స్కూల్, -ఫరక్కా
- -ఫరక్కా బారేజ్ ప్రాజెక్ట్ హై స్కూల్, -ఫరక్కా
- జే ఎన్ అకాడమీ ( బెర్హంపోర్ )
- మహారాణి కషీశ్వరి గర్ల్స్ 'హైస్కూల్ ( బెర్హంపోర్ )
- గోరాబజార్ ఈశ్వరచంద్ర ఇన్స్టిట్యూషన్ ( బెర్హంపోర్ )
- మహాకాళి పాఠశాల (బాలికల) ( బెర్హంపోర్ )
- గురుదాస్ తారాసుందరి ఇన్స్టిట్యూషన్,ఖగ్ర ( బెర్హంపోర్ )
- క్రిష్నాథ్ కాలేజ్ స్కూల్ ( బెర్హంపోర్ )
- లిపిక మెమోరియల్ బాలికల ఉన్నత పాఠశాల, ఇంద్రప్రస్థ ( బెర్హంపోర్ )
- మహీంద్ర చంద్ర విద్యాపీట్ ( బెర్హంపోర్ )
- సేవా మిలాని గర్ల్స్ 'హై స్కూల్ ( బెర్హంపోర్ )
- శ్రిష్ చంద్ర గర్ల్స్ 'హై స్కూల్, గోరాబజార్ ( బెర్హంపోర్ )
- నానబ్ బహదూర్ ఇన్స్టిట్యూషన్, లాల్బాగ్, ముర్షిదాబాద్
- లాల్బాగ్ ఎం.ఎం.సి గర్ల్స్ 'హై స్కూల్, లాల్బాగ్, ముర్షిదాబాద్
- సిన్ఘి హై స్కూల్, లాల్బాగ్, ముర్షిదాబాద్
- రాజా బిజయ్ సింగ్ హై స్కూల్, జైగంజ్, ముర్షిదాబాద్
- సరగచి రామకృష్ణ మిషన్ హై స్కూల్ (సరగచి)
- భబ్తవ్ అజిజియా హై మదరసా
'కళాశాలలు'
- కృష్ణనాథ్ కాలేజ్, బెర్హంపోర్
- బెర్హంపోర్ గర్ల్స్ కాలేజ్,
- శ్రీపత్ సింగ్ కాలేజ్, జైగంజ్
- బెర్హంపోర్ కాలేజ్ ( బెర్హంపోర్ )
- రాణి ధన్యకుమారి కాలేజ్, జైగంజ్
- సుభాష్ చంద్ర బోస్ సెంటినరీ కాలేజ్, లాల్బాగ్
- ధకులాల్ నిబరన్ చంద్ర కాలేజ్, ఔరంగాబాద్, ముర్షిదాబాద్
- కంది రాజ్ కాలేజ్, కంది, ముర్షిదాబాద్
- రాజా బీరేంద్ర చంద్ర కాలేజ్, కంది, ముర్షిదాబాద్
- సేవానారాయణన్ రామేశ్వరం ఫతెపురా కాలేజ్, బెల్దంగ
- సాగర్డిగి మహావిద్యాలయ ( సాగర్డిగి)
- ప్రొఫెసర్ సయ్యద్ నురుల్ హసన్ కాలేజ్, -ఫరక్కా
- పంచుతుపి హరిపద గౌరిబాలా కాలేజ్, పంచుతపి, ముర్షిదాబాద్
- నూర్ మొహమ్మద్ స్మృతి మహావిద్యాలయ, ధులియన్
- నగర్ కాలేజ్, నగర్, ముర్షిదాబాద్
- నబగ్రం అమర్ చంద్ కుండు కాలేజ్, నబగ్రం, ముర్షిదాబాద్
- ముర్షిదాబాద్ ఆదర్శ మహావిద్యాలయ, చాక్ ఇస్లాంపూర్, ముర్షిదాబాద్
- ముజాఫర్ అహ్మద్ మహావిద్యాలయ, సాలార్, ముర్షిదాబాద్
- లగోలా కాలేజ్, లగోలా
- జతింద్ర రాజేంద్ర మహావిద్యాలయ,అంతల, ముర్షిదాబాద్
- జంగిపూర్ కాలేజ్, జంగిపూర్
- జలంగి మహావిద్యాలయ, జలంగి
- హాజి ఎ.కె ఖాన్ కాలేజ్, హరిహరపురా, ముర్షిదాబాద్
- డుంకల్ కాలేజ్, డుంకల్
- డుంకల్ గర్ల్స్ కాలేజ్, డుంకల్
- యూనియన్ క్రిస్టియన్ శిక్షణ కళాశాల (బి ఎడ్.), ( బెర్హంపోర్ ) 'ఇంజనీరింగ్ కళాశాలలు'
- ఇంజనీరింగ్ & టెక్స్టైల్ టెక్నాలజీ గవర్నమెంట్ కాలేజ్, ( బెర్హంపోర్ )
- టెక్నాలజీ, బెర్హంపోర్ యొక్క ముర్షిదాబాద్ ఇన్స్టిట్యూట్, బెర్హంపోర్
- ఇంజనీరింగ్ & టెక్నాలజీ యొక్క ముర్షిదాబాద్ కాలేజ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, Jiaganj యొక్క
- జైగంజ్ కాలేజ్
- టెక్నాలజీ డుంకల్ ఇన్స్టిట్యూట్,డుంకల్
- మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ బికేర్ ఇన్స్టిట్యూట్
'వైద్య కళాశాల'
- ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్
'ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్' ముర్షిదాబాద్ లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి:
- చంద్ర కమర్షియల్స్ & ఆర్ట్ ఇన్స్టిట్యూట్ గోరాబజార్, ( బెర్హంపోర్ )
- చంద్ర కమర్షియల్స్ & ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఇద్రపురి, ( బెర్హంపోర్ )
- చంద్ర కమర్షియల్స్ & ఆర్ట్ ఇన్స్టిట్యూట్, కంది, ముర్షిదాబాద్
మూలాలు
[మార్చు]- ↑ "Murshidabad District : Census 2011 data". Census Organization of India. 2011. Archived from the original on 2014-01-01. Retrieved December 31, 2013.
- ↑ "Murshidabad Govt statistics page". Archived from the original on 2014-06-05. Retrieved 2014-07-20.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ "The story of Murshidabad". Archived from the original on 2014-02-28. Retrieved 2014-07-20.
- ↑ 5.0 5.1 5.2 "Murshidabad Govt Website". Archived from the original on 2014-07-16. Retrieved 2014-07-20.
- ↑ "West Bengal Govt website on Murshidabad district". Archived from the original on 2010-06-13. Retrieved 2014-07-20.
- ↑ Murshidabad EB1911.
- ↑ "Glossary of Meteorology, American Meteorological Society, Retrieved on 2006-09-05". Archived from the original on 2006-08-30. Retrieved 2014-07-20.
- ↑ 9.0 9.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ "Supreme Court Cracks Down on Overloading of Trucks". Archived from the original on 2012-07-01. Retrieved 2014-07-20.
- ↑ "Population, Decadal Growth Rate, Density and General Sex Ratio by Residence and Sex, West Bengal/ District/ Sub District, 1991 and 2001". West Bengal. Directorate of census operations. Retrieved 2008-11-12.
- ↑ 12.0 12.1 "Directory of District, Sub division, Panchayat Samiti/ Block and Gram Panchayats in West Bengal, March 2008". West Bengal. National Informatics Centre, India. 2008-03-19. Archived from the original on 2009-02-25. Retrieved 2008-11-12.
- ↑ "Census of India 2001, Final Population Totals, West Bengal, Rural Frame". West Bengal. Directorate of census operations. Retrieved 2008-11-12.
- ↑ "Statistical data". Official website of the Murshidabad district. Archived from the original on 2008-10-28. Retrieved 2008-11-12.
- ↑ 15.0 15.1 15.2 15.3 "Press Note, Delimitation Commission" (PDF). Assembly Constituencies in West Bengal. Delimitation Commission. Retrieved 2009-06-01.
- ↑ "Press Note — Schedule for General Elections, 2009". Press Information Burueau, Government of India. Retrieved 2009-06-01.
- ↑ 17.0 17.1 17.2 17.3 17.4 "General election to the Legislative Assembly, 2001 – List of Parliamentary and Assembly Constituencies" (PDF). West Bengal. Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 2009-06-01.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Bulgaria 7,093,635 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Washington 6,724,540
- ↑ 20.0 20.1 "Census of India 2001". Provisional population totals, West Bengal, Table 4. Census Commission of India. Retrieved 2009-05-21.
- ↑ The Indian Census of 2001
- ↑ [1]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-06-20. Retrieved 2014-07-20.
- ↑ [2]
Further reading
[మార్చు]- Lewis Sydney Steward O'Malley (1914). Murshidabad. Bengal secretariat book Department.
- John Henry Tull Walsh (1902). A History of Murshidabad District, Bengal. With Biographies of Some of Its Noted Families. With Map and Numerous Illustrations. London.
బయటి లింకులు
[మార్చు]Find more about ముర్షిదాబాద్ జిల్లా at Wikipedia's sister projects | |
Media from Commons | |
Database entry Q1546240 on Wikidata |
24°08′N 88°16′E / 24.14°N 88.26°E
వెలుపలి లింకులు
[మార్చు]
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with unknown parameters
- Pages using infobox settlement with no coordinates
- Pages using bar box without float left or float right
- Commons category link from Wikidata
- పశ్చిమ బెంగాల్ జిల్లాలు
- ముర్షిదాబాద్ జిల్లా
- వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు పొందుతున్న జిల్లాలు