Jump to content

మామగారు (1991 సినిమా)

వికీపీడియా నుండి

మామగారు పేరున మరిన్ని వ్యాసములు ఉన్నాయి. మామగారు పేరున బంధు సూచక వ్యాసము కొరకు చూడండి. మామగారు

మామగారు
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం ముత్యాల సుబ్బయ్య
తారాగణం వినోద్, ఐశ్వర్య, దాసరి నారాయణరావు
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ ఎం.ఎం. మూవీస్
భాష తెలుగు

మామగారు 1991 లో ఎడిటర్ మోహన్ నిర్మాతగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం. ఇందులో దాసరి నారాయణరావు, వినోద్ కుమార్, యమున ప్రధాన పాత్రల్లో నటించారు.[1][2][3] ఈ చిత్రం నాన్ పుడిచా మాపిళ్ళై అనే తమిళ చిత్రానికి రీమేక్.

విజయ్ ( వినోద్ కుమార్ ) ఒక గ్రామానికి ప్రెసిడెంటు. అతను సత్తెయ్య ( దాసరి నారాయణరావు ) ను దొంగల దాడి నుండి రక్షించాడు. విజయ్ తన మేనకోడలు రాణి ( ఐశ్వర్య ) ను వివాహం చేసుకోవాలని అతడి తల్లి కాంతమ్మ ( నిర్మలమ్మ ) కోరుకుంటుంది. కానీ తల్లిదండ్రుల కోరికలకు వ్యతిరేకంగా అతడు సత్తెయ్య కుమార్తె లక్ష్మి (యమునా) ని పెళ్ళి చేసుకుంటాడు. తనతో కలిసి జీవించడానికి విజయ్ తన మామను కూడా ఇంటికి తీసుకువస్తాడు. ఈ నిర్ణయాలు విజయ్ కుటుంబాన్ని కించపరచడానికి కుట్ర పన్నిన అతని బావ పోతురాజు (కోట శ్రీనివాసరావు ) కు కోపం కలిగించాయి. ఒక గుంట తవ్వడానికి నాటిన బాంబు పేలుడులో లక్ష్మి అనుకోకుండా మరణిస్తుంది. తన అల్లుడు తన కుమార్తెను మరచిపోలేకపోతున్నాడని సత్తెయ్య బాధపడతాడు. రాణిని వివాహం చేసుకోమని ఒప్పించాడు. రాణి కూడా అతని సరళత, ప్రేమ కారణంగా అతన్ని ఇష్టపడుతుంది. కానీ పోతురాజు ఆ ఇంట్లో తనకు లభిస్తున్న మర్యాద పట్ల సంతోషంగా లేడు. పోతురాజు సత్తెయ్యను స్త్రీలోలుడిగా ఆరోపించడంతో సత్తెయ్యను ఇంటి నుంచి తరిమికొడతారు. విజయ్ చివరకు పోతురాజు యొక్క దుర్మార్గాన్ని తెలుసుకుంటాడు. అయితే సత్తెయ్య అప్పటికే ఆత్మహత్య చేసుకుంటాడు.

నటీనటులు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • దండాలు పెట్టేము దుర్గమ్మ , సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • ఈ రాతిరి , రచన: సి నారాయణ రెడ్డి, గానం.మంజుల
  • ఇయ్యాలే అచ్చమైన దీపావళీ , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత
  • కొట్టారా గట్టిగా , రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ , గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, మంజుల
  • శ్రీరాముడల్లే , రచన: వేదవ్యాస్ , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర.

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Mamagaru". indiancine.ma. Archived from the original on 3 జూన్ 2016. Retrieved 8 July 2016.
  2. "Mamagaru (1991)". moviefone. Retrieved 8 July 2016.
  3. "Mamagaru". Filmibeat. Archived from the original on 11 ఆగస్టు 2016. Retrieved 8 July 2016.