మానిని
Jump to navigation
Jump to search
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
మానిని
[మార్చు]క్రొన్నెల పువ్వును గోఱల పాఁగయుఁ గూర్చిన కెంజడకొప్పునకున్
వన్నె యొనర్చిన వాహిని యీతని వామపదంబున వ్రాలె ననన్
జెన్నుగ నద్రిభసేవ్యగురు న్విలసిల్లు రసత్రయ చిత్ర యతుల్
పన్నుగ నొందఁ బ్రభాసుర విశ్రమ భంగిగ మానిని భవ్యమగున్.
గణ విభజన
[మార్చు]UII | UII | UII | UII | UII | UII | UII | U |
భ | భ | భ | భ | భ | భ | భ | గ |
క్రొన్నెల | పువ్వును | గోఱల | పాఁగయుఁ | గూర్చిన | కెంజడ | కొప్పున | కున్ |
7 భగణములు, 1 గురువు
లక్షణములు
[మార్చు]• | పాదాలు: | నాలుగు – కాని పఠన, లేఖన సౌకర్యార్థం పాదమును 2గా విభజించ వచ్చు. |
• | 22 | |
• | ప్రతిపాదంలోని గణాలు: | భ, భ, భ, భ, భ, భ, భ, గా (7 భగణములు, 1 గురువు) |
• | యతి : | ప్రతిపాదంలోనూ 7వ, 13వ, 19వ అక్షరములు |
• | ప్రాస: | పాటించవలెను |
• | ప్రాస: యతి | చెల్లదు |
ఉదాహరణ 1:
[మార్చు]పోతన తెలుగు భాగవతంలో వాడిన మానిని వృత్త పద్యాల సంఖ్య: 1
పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమ)/పూతన వ్రేపల్లెకొచ్చుట|(భా-10.1-214-మాని.) ||
కాంచనకుండల కాంతులు గండ యుగంబునఁ గ్రేళ్ళుఱుక న్జడపై
మించిన మల్లెల మేలిమి తావులు మెచ్చి మదాళులు మింటను రా
నంచిత కంకణ హార రుచు ల్చెలువారఁగఁ బైవలువంచల నిం
చించుక జారఁగ నిందునిభా`నన యేగెఁ గుమారుని యింటికి నై.