మల్లికార్జున రాయలు
విజయ నగర రాజులు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
మల్లికార్జున రాయలు తన తండ్రి రెండవ దేవ రాయలు తరువాత అధికారములోనికి వచ్చాడు, ఇతడు అంత సమర్థుడుగా పేరుగాంచలేదు, తాత తండ్రుల రాజ సంపదను కొంత బహుమనీ సుల్తానులకు, మరికొంత గజపతులకు సమర్పించాడు.
కపిలేశ్వర గజపతి పద్మనాయకుల సహాయముతో 1448న తీరాంధ్రపైకి దండెత్తివచ్చి రాజమహేంద్రవరమును ఆక్రమించాడు. తరువాత ఇంకా ముందుకు సాగి 1450లో కొండవీడును జయించాడు. అద్దంకి, శ్రీశైలము, వెలుగోడు, బెల్లంకొండలను జయించి, తరువాత విజయనగరంను ముట్టడించాడు, రాయలు సంధి చేసుకోని అపరాధరుసుము చెల్లించాడు.
గజపతుల రెండవ దడయాత్ర
[మార్చు]1464 వ సంవత్సరమున, గజపతులు కపిలేశ్వర గజపతి, గొప్ప సైన్యాన్ని ఇచ్చి హంవీర గజపతి సైన్యాధిపతిగా విజయనగరంపైకి దండయాత్రకు వచ్చి కాంచీ నగరం వరకు ఆక్రమించెను, ఇతను చంద్రగిరి, ఉదయగిరి, కొండపల్లి, వినుకొండ, అద్దంకి, తిరుచానూరు, తిరుచనాపల్లి మొదలగు ప్రాంతములను గజపతుల ఆధీనములోనికి తెచ్చాడు.
మొత్తానికి ఈ రాజు చాలా అసమర్థుడైనాడు.
మూలాలు
[మార్చు]- Dr. Suryanath U. Kamat, Concise history of Karnataka, MCC, Bangalore, 2001 (Reprinted 2002)
ఇంతకు ముందు ఉన్నవారు: రెండవ దేవ రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1446 — 1465 |
తరువాత వచ్చినవారు: రెండవ విరూపాక్ష రాయలు |