Jump to content

మధిర పురపాలకసంఘం

వికీపీడియా నుండి
(మధిర నగర పంచాయతి నుండి దారిమార్పు చెందింది)

మధిర పురపాలక సంఘం, ఖమ్మం జిల్లా, మధిర పట్టణానికి చెందిన పాలక సంస్థ. మధిర నగర పంచాయతిగా 2013లో ఏర్పడింది.1956లోనే పురపాలక సంఘంగా ఉన్న మధిర పట్టణం 1964లో పంచాయతీగా మార్చబడి, మళ్ళీ 2013లో నగర పంచాయతీగా చేయబడింది.ఆ తరువాత తెలంగాణ పురపాలక సంఘాల కొత్త చట్టం ప్రకారం పురపాలక సంఘంగా మారింది.2014 మార్చిలో జరగనున్న ఎన్నికలకై చైర్మెన్ పదవిని ఎస్సీ (మహిళ) కు కేటాయించారు.

చరిత్ర

[మార్చు]

1956లో పురపాలక సంఘముగా అవతరించిన తర్వాత మధిర తొలి చైర్మెన్‌గా చెరుకుమల్లి హనుమయ్య ఎన్నికయ్యారు. కోనా విశ్వనాథం రెండో చైర్మెన్‌గా పనిచేశారు. 1964లో వచ్చిన నూతన పంచాయతి చట్టం ప్రకారం మధిరను గ్రామపంచాయతీగా మార్చారు. పంచాయతీగా మార్చిన పిదప కూడా కోనా విశ్వనాథం మధిర సర్పంచిగా పనిచేశాడు. లక్ష్మీప్రియ 2006 నుంచి 2011 వరకు సర్పంచిగా పనిచేయగా 2013లో మధిర పాలక సంస్థ హోదా పెంచబడి నగర పంచాయతీగా చేశారు. 2014 మార్చి 30న ఎన్నికలు జరగనున్నాయి. చైర్-పర్సన్ స్థానాన్ని ఎస్సీ (మహిళ) కు కేటాయించారు. మొండితోక నాగరాణి ఎన్నికైంది.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]