బాబూభాయ్ ఖిమాభాయ్ కటారా
బాబూభాయ్ ఖిమాభాయ్ కటారా | |||
పదవీ కాలం 1999 - 2009 | |||
ముందు | దామోర్ సోమ్జీభాయ్ పంజాభాయ్ | ||
---|---|---|---|
తరువాత | ప్రభా కిషోర్ తవియాడ్ | ||
నియోజకవర్గం | దాహొద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | చిత్రోడియా, ఝలోద్ , గుజరాత్ | 1961 జనవరి 1||
రాజకీయ పార్టీ | సస్పెండ్ చేశారు | ||
తల్లిదండ్రులు | ఖిమాభాయ్, సవ్రూపాబెన్ | ||
జీవిత భాగస్వామి | శారదాబెన్ బి. కటారా | ||
సంతానం | 2 కుమారులు, 1 కుమార్తె | ||
నివాసం | మందిర్ ఫాలియా, ఝలోద్, దాహోద్ జిల్లా, గుజరాత్ | ||
మూలం | [1] |
బాబూభాయ్ ఖిమాభాయ్ కటారా (జననం 1 జనవరి 1961) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పంచ్‌మహల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]బాబూభాయ్ ఖిమాభాయ్ కటారా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దాహొద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సోమ్జీభాయ్ దామోర్ పై 12,431 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 1999 నుండి 2000 వరకు పార్లమెంట్‌లో పట్టణ & గ్రామీణాభివృద్ధి కమిటీ సభ్యుడిగా పని చేశాడు.
బాబూభాయ్ ఖిమాభాయ్ కటారా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దాహొద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి డా. ప్రభాబాహెన్ కిషోర్‌సింహపై 361 స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 5 ఆగస్టు 2007 నుండి 2009 వరకు పార్లమెంట్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం మరియు అడవులపై కమిటీ సభ్యుడిగా పని చేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ Hindustan Times (16 April 2019). "Lok Sabha election 2019: Gujarat's Dahod seat is an old Congress bastion that BJP controls". Archived from the original on 19 July 2024. Retrieved 19 July 2024.