బాబు మోహన్

వికీపీడియా నుండి
(బాబుమోహన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బాబు మోహన్
బాబు మోహన్

2022 లో బాబు మోహన్


కార్మిక శాఖామంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పదవీ కాలం
2002 – 2004

పదవీ కాలం
1998 – 2004
ముందు మల్యాల రాజయ్య
తరువాత దామోదర్ రాజ నర్సింహ
నియోజకవర్గం ఆందోల్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2014 – 2018
ముందు దామోదర రాజనర్సింహ
తరువాత చంటి క్రాంతి కిర‌ణ్
నియోజకవర్గం ఆందోల్

వ్యక్తిగత వివరాలు

జననం (1948-04-14)1948 ఏప్రిల్ 14
బీరోలు
రాజకీయ పార్టీ తెలుగు దేశం పార్టీ (1990's - 2014)
(2024 అక్టోబర్ 29 - ప్రస్తుతం )
ఇతర రాజకీయ పార్టీలు తెలంగాణా రాష్ట్ర సమితి
(2014 - 2018)
భారతీయ జనతా పార్టీ
(2018 - 2024)
ప్రజా శాంతి పార్టీ
(2024 మార్చి 04 - 2024 అక్టోబర్ 29))
తల్లిదండ్రులు పల్లి ఆనంద్ రావు & పేరమ్మ
జీవిత భాగస్వామి ఇందిర విజయలక్ష్మి
సంతానం పవన్ కుమార్,
ఉదయ్ కుమార్[1]
వృత్తి నటుడు, రాజకీయ నాయకుడు

బాబు మోహన్ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. ముందు తెలుగు దేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మంత్రిగా పని చేశాడు. 2014 నుంచి 2018 దాకా తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీలో ఉన్నాడు.

నేపధ్యము

[మార్చు]

ఆయన ఖమ్మం జిల్లాలోని బీరోలులో జన్మించాడు. తండ్రి ఉపాధ్యాయుడు. ప్రభుత్వ రెవెన్యూ విభాగంలో ఉద్యోగం చేస్తూ సినిమాల మీద ఆసక్తితో అందుకు రాజీనామా చేశాడు.[2] ఆయన నటించిన మొదటి సినిమా ఈ ప్రశ్నకు బదులేది. మామగారు సినిమాలో చేసిన యాచకుడి పాత్ర హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు, పెదరాయుడు, జంబలకిడి పంబ లాంటి సినిమాలలో మంచి హాస్య పాత్రలు ధరించాడు.

మాయలోడు, సినిమాతో స్టార్ కమెడియన్ అయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

బాబుమోహన్ చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ కు అభిమాని. అదే అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1999లో మెదక్ జిల్లా ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసన సభ్యులుగా ఎన్నికై సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశాడు. 2004, 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం పొందాడు.[3]

2018లో బీఆర్ఎస్ నుంటి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరాడు. బీజేపీ నుంచి పోటీ చేసి బీఆర్​ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిర‌ణ్ చేతిలో, 2023లో బీజేపీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహా చేతిలో ఓడిపోయాడు. ఆయన 2023 ఫిబ్రవరి 7న సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీకి రాజీనామా చేసి[4] అనంతరం మార్చి 04న ప్రజా శాంతి పార్టీలో చేరాడు.[5]

బాబు మోహన్ ఆందోల్ నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వం తీసుకొని 2024 అక్టోబర్ 29న టీడీపీలో చేరాడు.[6][7]

కుటుంబం

[మార్చు]

ఆయన పెద్ద కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబరు 13లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు.[8]

నటించిన చిత్రాల పాక్షిక జాబితా

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (26 October 2023). "టికెట్టు కోసం తండ్రీకొడుకులు పోటీ.. అందోలు బీజేపీ టికెట్‌పై ఉత్కంఠ!". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  2. "Comedian Babu Mohan ventures into OTT with Amazon prime series". The Statesman. 26 Sept 2023. Retrieved 26 Sept 2023. {{cite web}}: Check date values in: |access-date= and |date= (help)
  3. Eenadu (29 October 2023). "అంచెలంచెలుగా.. అత్యున్నతంగా." Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  4. NT News (8 February 2024). "బీజేపీకి బాబుమోహన్‌ గుడ్‌బై". Archived from the original on 4 March 2024. Retrieved 4 March 2024.
  5. Andhrajyothy (4 March 2024). "ప్రజాశాంతి పార్టీ తీర్థం పుచ్చుకున్న బాబుమోహన్". Archived from the original on 4 March 2024. Retrieved 4 March 2024.
  6. "టీడీపీలోకి బాబుమోహన్‌!". 29 October 2024. Retrieved 29 October 2024.
  7. Eenadu (29 October 2024). "తెదేపా సభ్యత్వం తీసుకున్న బాబుమోహన్‌". Retrieved 29 October 2024.
  8. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-11-13. Retrieved 2013-11-17.
  9. ఐడ్రీమ్ పోస్ట్, సినిమాలు (7 April 2020). "గురి తప్పిన 'సాహస వీరుడు'". www.idreampost.com (in ఇంగ్లీష్). Retrieved 22 June 2020.[permanent dead link]

బయటి లంకెలు

[మార్చు]