బరేలీ జిల్లా
బరేలీ జిల్లా | |||||||
---|---|---|---|---|---|---|---|
బరేలీ జిల్లా
बरेली जिला بریلی ضلع | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | బరేలీ |
ముఖ్య పట్టణం | బరేలీ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Bareilly, Aonla (partly) |
విస్తీర్ణం | |
• మొత్తం | 4,120 కి.మీ2 (1,590 చ. మై) |
జనాభా (2001) | |
• మొత్తం | 35,98,701 |
• జనసాంద్రత | 870/కి.మీ2 (2,300/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 60.52% |
Website | అధికారిక జాలస్థలి |
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో బరేలీ జిల్లా (హిందీ:बरेली) (ఉర్దూ: بریلی) ఒకటి. బరేలీ పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. బరేలీ జిల్లా బరేలీ డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 4120 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 36,18,589.
విభాగాలు
[మార్చు]జిల్లాలో 6 తాలూకాలు ఉన్నాయి:- అంకోలా, అవోన్లా, బరేలీ, బరేలీ నగరం, ఫరీద్పూర్, మీర్గంజ్, నవాబ్‌గంజ్.
పౌరాణిక నేపథ్యం
[మార్చు]బరేలీ ప్రాంతం మహాభారతంలోని పాంచాలదేశమని, ఇది ద్రౌపది (పాంచాలి, కృష్ణ, యాజ్ఞసేని) జన్మస్థానమని భావిస్తున్నారు. పాంచాలి అంటే పాంచాల రాజకుమార్తె అని అర్ధం. కృష్ణ అంటే నల్లని వర్ణం కలిగినది అని అర్ధం. యాజ్ఞసేని అంటే యజ్ఞం నుండి జనించింది అని అర్ధం. యుదిష్ఠిరుడు హస్తినాపురానికి రాజైన తరువాత ద్రౌపది హస్తినాపుర రాణి అయింది.
రాజ వంశాలు
[మార్చు]12వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పలు క్షత్రియ వంశాలు పాలించాయి. ఇస్లాముల దండయాత్ర తరువాత మొగల్ సామ్రాజ్య స్థాపనకు ముందు ఈ ప్రాంతం ఢిల్లీ సుల్తానేటులో భాగం అయింది. ఆధునిక బరేలీ నగరాన్ని 1657లో మకరంద్ రాయ్ స్థాపించాడు. తరువాత ఈ ప్రాంతం అవధ్ నవాబు వజీర్‌కు స్వాధీనం కాక ముందు రోహిల్‌ఖండ్ ప్రాంతానికి రాజధానిగా మారింది. తరువాత ఈ ప్రాంతం ఈస్టిండియా కంపెనీ అధీనంలోకి వెళ్ళింది.
చరిత్ర
[మార్చు]పురాతన చరిత్ర
[మార్చు]పౌరాణికంగా బరేలీ ప్రాంతం పాంచాల రాజ్యానికి రాజధానిగా ఉండేది. కురు సామ్రాజ్యానికి తూర్పు సరిహద్దున ఉన్న ప్రాంతాన్ని పాంచాల పాలకులు ఆక్రమించుకున్నారు. హిమాలయాల ఎగువ ప్రాంతం, గంగాతీరం మద్య ఉన్న భూభాగం పాంచాల పాలకుల వశమయింది. పాంచాలదేశం ఉత్తర పాంచాలం, దక్షిణ పాంచాలంగా విభజించబడింది. ఉత్తర పాంచాలదేశానికి అహిచ్ఛత్రం రాజధానిగా ఉండేది. అహిచ్ఛత్రను అధిచ్ఛత్ర, ఛత్రావతి అను కూడా పిలిచేవారు. అహిచ్ఛత్రం ప్రస్తుత బరేలీ జిల్లాలోని అవ్‌నోలా తాలూకా సమీపంలో ఉంది. దక్షిణ పాంచాల దేశానికి కాంపిల్య / కంపిల్ రాజధానిగా ఉండేది. కంపిల్ ఫరూఖాబాద్ జిల్లాలో ఉంది. పెద్ద నగరమైన కన్నౌజ్ లేక కన్యాకుబ్జం కూడా పాంచాల సామ్రాజ్యంలో ఉండేది.
సోమక , శృంజయులు
[మార్చు]పాంచాల రాజవంశాలకు చెందిన సోమక, శృంజయుల ప్రస్తావన మహాభారతంలో, పురాణాల్లో ఉంది. పాంచాల రాజు ద్రుపదుని కూమార్తె ద్రౌపది సోమక వంశానికి చెందిన పాండవులను వివాహం చేసుకుంది.[1] అయితే మహాభారతం, పురాణాల ప్రకారం ఉత్తర పాంచాలాన్ని మహారాజ భరతుని వంశజులైన దివోదాస, సుదాస, శృంజయ, సోమక, ద్రుపదుడు మొదలైనవారు పాలించారు.[2]
పాంచాల నాణ్యాలు
[మార్చు]బరేలీ సమీప ప్రాంతాలలో వద్ద క్రీ.పూ 176-166 చెందిన పాంచాల నాణ్యాలు త్రవ్వకాలలో లభించాయి. కుషాన, గుప్త రాజులు కూడా ఇక్కడ నాణ్యాలను తయారు చేయించారు. సామాన్య శకం ఆరంభం వరకు ఈ నగరం నాణేల తయారీకి కేంద్రంగా ఉండేది. స్వాతంత్ర్యసమర కాలంలో నాణేల తయారీకి ఆటంకం కలిగింది. గంగాఘాట్ వద్ద ప్రతిహార రాజులకు చెందిన ఆది విగ్రహ, విగ్రహ రాజ్యాలకు చెందిన సా.శ. 4-5 శతాబ్ధాలకు చెందిన నాణేలు విస్తారంగా లభించాయి. ఇక్కడ అదే కాలానికి చెందిన వెండి నాణేలు కూడా లభించాయి.[3]
మద్యయుగం
[మార్చు]పాంచాల రాజ్య పతనం తరువాత ఈ ప్రాంతం ప్రాతీయ పాలకుల ఆధీనంలోకి మారింది. 12వ శతాబ్దంలో ఈ ప్రాంతం వివిధ రాజవంశాలకు (కతేహరియా లేక క్షత్రియ) చెందిన పాలకుల పాలనలో ఉంది. .[4]
ఢిల్లీ సుల్తానులు
[మార్చు]13 వ శతాబ్దం ఆరంభంలో ఢిల్లీ సుల్తానేటు బలంగా స్థిరపడింది. కతేహర్ సంభాల్, బుదౌన్ భూభాగాలుగా విభజించబడింది. దట్టమైన అరణ్యాలు క్రూరజంతువులకు ఆవాసం అయినందున తిరుగుబాటుదారులకు ఆశ్రయం కలగడానికి అవకాశం కలిగింది. కతేహర్ ప్రాంతం నిరంతరంగా రాజుల తిరుగుబాటుదారులకు కేంద్రంగా మారింది. (1266-1287) సుల్తాన్ బాల్బన్ దట్టమైన అరణ్య భూభాగాన్ని ఖాళీ చేయమని ఆజ్ఞాపించాడు. అరణ్యాలను ధ్వంసం చేసాక ఇక అక్కడ తిరుగుబాటుదారులకు రక్షణ లభించలేదు.
ఆఫ్ఘన్ వలసలు
[మార్చు]మొగల్ సామ్రాజ్య కేంద్రం కొంత బలహీనపడగానే ప్రాంతీయ కతేహరియా ప్రభువులు రాజధిక్కారం చేయడం ఆరంభం అయినందున మొగల్ పాలకులు ఆఫ్ఘన్ ప్రజలు స్థిరపడడానికి భూములను కేటాయించసాగారు.[5] ఔరంగజేబు (1658-1707) ప్రోత్సాహంతో వలసలు మరింతగా కొనసాగాయి. ఔరంగజేబు మరణం తరువాత కూడా ఆఫ్ఘన్ వలసలు ఈ ప్రాంతంలో కొనసాగాయి. వీరిని రోహిల్లా ఆఫ్ఘన్లు అనే వారు. అందువలన ఈ ప్రాంతం రోహిల్ఖండ్ అయింది.[6]
నగర స్థాపన
[మార్చు]1537లో కతేహరియా రాజపుత్ర వంశానికి చెందిన బాసుదేవ్ బరేలీ నగరాన్ని స్థాపించాడు. బుదాయిని కాలంలో ఈ నగరం మొదటిసారిగా చరిత్రలో ప్రస్తావించబడింది. బుదాయుని 1568లో బరేలి, సంభల్‌లకు హుస్సైన్ కులి ఖాన్ గవర్నరుగా నియమించబడ్డాడని సూచించాడు. విభాగాల విభజన, రెవెన్యూలను తొడరమల్లు నిర్ణయించే వాడు. 1596లో అబ్దుల్ ఫాజిల్ దీనిని నమోదు చేసాడు. 1658లో బుదాయున్ భూభాగానికి బరేలీ ప్రఫ్హానకార్యాలయం చేయబడింది. .[7] ఆధునిక నగరం బరేలీ 1657లో ముక్రంద్ రాయ్ చేత అభివృద్ధి చెందింది.
రోహిల్ ఖండ్
[మార్చు]రోహిల్‌ఖండ్ భూభాగం సుభాహ్‌గా రూపొందించక ముందు కతేహరా అని పిలువబడేది.[8] మొగల్ పాలన కేంద్రంలో బలంగా ఉన్నంతకాలం ఆఫ్ఘనులు స్థిరపడడం కొనసాగింది. ఔరంగజేబు మరణం తరువాత ఆఫ్హఘన్లు బలంపుంజుకుని సమీప ప్రాంతాలను ఆక్రమించుకుని ఈ ప్రాంతానికి పాలకులుగా మారారు.
ఆఫ్ఘన్ సోదరులు
[మార్చు]1623లో ఆఫ్ఘన్ బరేచ్ గిరిజనులకు చెందిన సోదరలు షాహ్ అలాం, హుస్సైన్ ఖాన్ ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. వారితో అనేకమంది పష్తన్ ప్రజలు కూడా ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు రొహిల్లా దావుద్ ఖాన్‌కు కతేహర్ ప్రాంతాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఔఅరంగజేబు ఆలంగీర్ (1658-1707) ఈ ప్రాంతమీద ఆధిపత్యం సాధించిన రాజపుత్రులను వంశాలను అణిచివేయసాగాడు. దాదాపు 20,000 మంది యూసఫ్‌జై పష్తన్ గిరిజన సైనికులలో ఘోరీలు, లోడిలు, ఘిజై, బరేచ్, మార్వాత్, దుర్రాని, తనోలి, తరీని, కాకర్, ఖతక్, అఫ్రిది, బక్వార్జైలు ఉన్నారు. ఔరంగజేబు అలంగీర్ నుండి అంగీకారంపొందిన వీరు మొగల్ సైన్యంలో విలీనం అయ్యారు. అదనంగా 25,000 మందికి మొగల్ సైన్యంలో గౌరవనీయ స్థానాలు లభించాయి. వీరిలో అత్యధికులు కతేహర్ భూభాగంలో స్థిరపడ్డారు. 1739లో నాదిర్ షాహ్ ఈ ప్రాంతం మీద దండెత్తిన సమయంలో ఈ ప్రాంతంలో జనసంఖ్య 1,00,000కు చేరుకుంది. రోహిల్లా పష్తన్ ప్రజలు అధికంగా స్థిపడిన కారణంగా కతేహర్ రోహిల్‌ఖండ్‌గా ప్రసిద్ధి చెందింది.
.
ముహమ్మద్ ఖాన్
[మార్చు]షాహ్ అలాం ఖాన్ అలి అహమ్మద్‌ఖాన్ (1737-1749) బరేలీ నగరాన్ని ఆక్రమించుకుని తరువాత దీనిని తన రాజధానిని చేసుకున్నాడు. అహమ్మద్‌ఖాన్ నగరాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత 1707 - -720 మద్య రోహిల్లాలను సమైక్యం చేసాడు. తరువాత క్రమంగా శక్తిని పుంజుకుని ఈ ప్రాంతం మీద ఆధిక్యత సాధించాడు. 1737లో చక్రవర్తి అహమ్మద్‌ఖాన్‌ను ఈ ప్రాంతానికి నవాబును చేసారు. 1740లో రోహిల్‌ఖండ్ గవర్నర్ అయ్యాడు. 1901 గణాంకాల ప్రకారం బరేలీలో మొత్తం పఠాన్ ప్రజల సంఖ్య 40,779 కి చేరింది. మొత్తం జనఖ్య 1,090,117.[9] వారిలో యూసఫ్‌జై, ఘోరీలు, లోడీ, ఘిల్‌జై, బరేచ్, మార్వత్, దుర్రాని, తనోలి, తరీన్, కాకర్, ఖతక్, అఫ్రిది, బక్వాజరి వంశస్థులు ప్రధానమైనవారు. జిల్లాలో రాంపూర్, షాజహాన్‌పూర్, బదౌన్, ఇతర నగరాలు ప్రధానమైనవి.[10]
హజఫిజ్ రహమత్ ఖాన్
[మార్చు]అలి ముహమ్మద్ మరణసమయంలో తన స్థానంలో తరువాత రాజ్యాధికారిగా హజఫిజ్ రహమత్ ఖాన్ బరేచ్ (1749-1774) నియమించాడు.[11] హఫీజ్ రహ్మత్ ఖాన్ బరేచ్ రోహిల్‌ఖండ్ శక్తిని ఉత్తరంలో అల్మోరా, వాయవ్యంలో ఎతవా వరకు విస్తరించాడు. హఫీజ్ రహ్మత్ ఖాన్ బరేచ్ పాలనలో రోహిల్లాస్ బలం అధికం అయింది. అయినప్పటికీ పొరుగు రాజప్రతినిధులతో ప్రత్యేకంగా అవధ్ నవాబ్ వజీరులు, .[12] బంగేష్ నవాబులు,[13], మరాఠీలు [14] నిరంతర కలహాలను ఎదుర్కొన్నారు
రొహిల్లా
[మార్చు]రోహిల్లా అనే పదం పష్తు భాషకు చెందిన "రోహ్" (అంటే "పర్వతం") నుంచి వచ్చింది. ఆ పదానికి "పర్వతపు గాలి" అని అసలు అర్థం. లోరాలై, ఝొబ్, వజీరిస్తాన్ ప్రాంతాలకు చెందిన తండాల ప్రజలను దెజరెట్ కు చెందిన బెలూచ్ ప్రజలు, జాట్లు ఆ పదంతో వ్యవహరించేవారు. రోహిల్లాలు జిల్లాకు చెందిన ఇతర స్థానికుల కన్నా పొడుగ్గా, తెల్లని శరీర రంగులో ఉండేవారు. ఈ ప్రాంతపు ముస్లిములు ప్రధానంగా పష్తూన్‌లకు చెందిన యూసఫ్ జాయ్ ఆఫ్ఘాన్ తెగకు చెందినవారు. మందన్హ్ కు చెందిన వీరిని రోహిలా పఠాన్స్ అని పిలుస్తూంటారు, వీరు 1720లనాడు దేశంలో భాగమయ్యారు.[15] దావూద్ ఖాన్, అలీ మొహమ్మద్ ఖాన్,, చారిత్రాత్మక వ్యక్తి హఫ్తీ రహమత్ ఖాన్ మొదలైన వారు ఆఫ్ఘాన్ తెగలలో పేరొందిన బరెచ్ కు చెంది, మౌలికంగా ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ ప్రాంతంలో మూలాలు కలిగినవారు. మౌలికంగా ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ ప్రాంతంలో మూలాలు కలిగినవారు. ఉత్తర ప్రదేశ్‌లో, రోహిల్లా అనే పదం రోహిల్లాఖండ్ ప్రాంతంలో స్థిరపడ్డ షియాలైన బంగష్లకు లేదా రోహిల్లా నేతల కింద సేవచేస్తున్నవారు కాకుండా ఇతర పఠాన్లందరినీ ఈ పదంతో వ్యవహరిస్తారు. రోహిల్లాలు వారి ప్రత్యేకమైన భాష, సంస్కృతులు కలిగి ఉన్నారు. వారిలో వారు పష్తూ భాషలోనే మాట్లాడుకునేవారు, కానీ కాలక్రమంలో వారి భాషను వారు కోల్పోయి, ప్రస్తుతానికి ఉర్దూలో వ్యవహరిస్తున్నారు.
బిషప్ హెబర్
[మార్చు]బిషప్ హెబర్ వర్ణనలో " దేశానికి సోమరి, దుష్ప్రవర్తన కలిగిన, తమకు తాము సవార్లు (రాజవిశ్వాసులు) అని చెప్పుకునే అదనపు భారం చేరింది. వారిలో అధికులకు స్వయంగా సంపాదించిన ధనం లేకపోయినా అమర్యాదకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారికి వారు తాము పఠానులమని చెప్పుకుంటారు. వ్యాపారులు, వ్యవసాయుల నుండి దౌర్జన్యంగా ధనం తీసుకుంటూ ఉంటారు. సంపన్నులు, పురప్రముఖలను ఆశ్రయించి జీవిస్తుంటారు. వీరికి కనిపించే ఆదాయం కాని కంపించే నివాసాలు లేనప్పటికీ వీరు కత్తులు, షీల్డులతో పురాతన హైలాండర్ల మాదిరిగా తిరుగుతుంటారు.[15]
పానిపట్ యుద్ధం
[మార్చు]హఫిజ్ రహ్మత్ ఖాన్ బారెచ్ రోహిల్‌ఖండ్ ఆధీనంలో ఉన్న మూడవ పానిపట్టు యుద్ధంలో (1761) లో పాల్గొని మరాఠీల మీద విజయం సాధించింది. అంతటితో ఉత్తరభారతదేశంలో మరాఠీ పాలన ముగింపుకు వచ్చింది. 1772లో మరాఠీలు రోహిల్‌ఖండ్ మీద దండయాత్ర సాగించారు. అవధ్ నవాబులు రోహిల్లాలకు బాసటగా నిలిచారు. యుద్ధం తరువాత నవాబు షుజ- ఉద్- దుల్లా వారి సహాయానికి ప్రతిఫలం ఇమ్మని నిర్భంధించాడు. నవాబు కోర్కెను రొహిల్లాలు తిరస్కరించిన కారణంగా అవధ్ నవాబు వారెన్ హేస్టింగ్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బ్రిటిష్ ప్రభుత్వంతో చేతులు కలిపాడు. తరువాత బ్రిటిష్ సైనికాధికారి అలెగ్జాండర్ చాంపియన్ సాయంతో రోహిల్‌ఖండ్ మీద దండయాత్ర కొనసాగించాడు.అవధ్ నవాబు షుజా- ఉద్- దులా, బ్రిటిష్ సైన్యాల చేతిలో హఫిజ్ రహమత్‌ఖాన్ బరేచ్ 1774లో ఓటమి పొంది మరణించాడు. ఆయన మరణం రోహొల్లా పాలనకు ముగింపు పలికింది.
అవధ్ నవాబు
[మార్చు]నవాబ్‌వజీర్ రోహిల్‌ఖండ్‌ను అవధ్ నవాబు స్వాధీనం చేసాడు. 1774 - 1880 వరకు ఈ ప్రాంతం అవధ్ నవాబు ఆధీనంలో ఉంది. 1801 పలు ఒప్పందాల అనంతరం లభించిన రాయితీలు ఈ ప్రాంతంలో నిష్ఫలం అయ్యాయి. రుణం చెల్లించడంలో భాగంగా నవాబు సాదత్ అలి ఖాన్ రోహిల్‌ఖండును 1801 నవంబరు 10 ఒప్పందం తరువాత ఈస్టిండియా కంపెనీకి స్వాధీనం చేసాడు.[16] ఈ సమయంలో కూడా బరేలీ నగరంలో నాణ్యాలు ముద్రించబడ్డాయి. అక్బర్ చక్రవర్తి, ఆయన వంశీయులు ఇక్కడ బంగారు, వెండి నాణ్యాలను ముద్రించారు. ఆఫ్ఘన్ వీరుడు అహమ్మద్ షా దురాని కూడా ఇక్కడ ఇక్కడ బంగారు, వెండి నాణ్యాలను ముద్రించాడు.
షాం అలీం
[మార్చు]రెండవ షాహ్ ఆలం బరేలీ కాలంలో రోహిల్‌ఖండ్ హఫిజ్ రెహ్మత్ ఖాన్, ఇతర నాణ్యాలు వినియోగించబడ్డాయి. తరువాత ఈ నగరం అవధ్ నవాబు అవధ్ నవాబు ఆధీనంలోకి మారింది. అవధ్ నవాబు ముద్రించిన నాణ్యాలు బారెయిలి, బారెయిలీ అస్ఫా ద్, బరేలీ జంఢా, చేప గుర్తులతో ముద్రించబడ్డాయి. తరువాత ఇక్కడ ఈస్టిండియా నాణ్యాలు ముద్రించబడ్డాయి. [17]
రొహిల్లాస్
[మార్చు]రోహిల్లాలు 50 సంవత్సరాల స్వంతంత్ర జీవితం తరువాత నవాబ్ కుదీ సైన్యంతో చేరి బ్రిటిష్ సైన్యంలో పనిచేసారు. అదే సంవత్సరం ఈ ప్రాంతం ఓధ్ సైన్యంతో విలీనం చేయబడింది. 1801 ఓధ్ నవాబు ఈ ప్రాంతాన్ని కంపెనీకి స్వాధీనం చేసాడు.[15]
ఆధునిక కాలం
[మార్చు]రొహిల్లాల తరువాత ఈ ప్రాంతంలో కొంత ప్రశాతత చోటుచేసుకుంది. ప్రజలలో నెకొన్న అభద్రతాభావం కారణంగా జిల్లా అంతటా ప్రజలలో క్రమంగా అసమ్మతి నెలకొన్నది. 1812లో ప్రభుత్వానికి అదనపు ఆదాయం కలుగజేయడానికి [18]1814లో సరికొత్త నివాసగృహ పన్ను విధించబడింది. మెజిస్ట్రేట్, డెంబ్లెటన్ మీద ప్రజలలో అయిష్టత అధికం అయింది. తరువాత ప్రజలకు, సిపాయీలకు మద్య కలహం చోటుచేసుకుంది. ఇందులో 300-4000 మంది ప్రాణాలను కోల్పోయారు. 1818లో ఏక్టింగ్ జడ్జిగా, మెజిస్ట్రేట్‌గా గ్లిన్ నియమించబడ్డాడు. గ్లిన్ బరేలీ, బులంద్‌షహర్ జాయింటు మెజిస్ట్రేటుగా నియమించబడ్డాడు.
పరిశోధన
[మార్చు]గ్లిన్ ఆదేశం మీద ఘులాం యాహ్యా నిర్వహించిన హస్థకళాకారుల గురించిన పరిశోధనలో జిల్లా ప్రాంతంలో 11 మంది వ్యాపారులు వివరాలు వెలుగులోకి వచ్చాయి. 1820లో గ్లాస్ తయారీ, గ్లాసుగాజుల తయారీ, లక్క గాజుల తయారీ, వైరు అల్లకం, చార్పాయ్, నేత, బంగారు, వెండి జరీ తయారీ, పచారీ దుకాణం నిర్వహణ, ఆభరణాల తయారీ మొదలైన వృత్తులను ప్రజలు జీవనోపాధిగా ఎంచుకున్నారని తెలిసింది.[7]
1857 తిరుగుబాటులో బరేలీ ప్రాంతం ప్రాధాన్యత వహించింది. ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయులు సాగించిన ప్రథమ పోరాటంగా గుర్తించబడింది.
సిపాయీల తిరుగుబాటు
[మార్చు]ఇది ముందుగా బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన ప్రాంతీయ సైనికుల తిరుగుబాటుగా మొదలైంది. సిపాయీల కలహం జాతిబేధాలు చూపారన్న కారణం పక్షపాత బుద్ధితో వ్యవహరించారన్న కారణంతో 1857 మే 10 న మీరుట్ నగరంలో మొదలైంది. తరువాత ఇతర తిరుగుబాట్లు, ప్రజాఉద్యమాలు మొదలయ్యాయి. ప్రధానంగా హిమాలయాలకు దక్షిణంగా ఉత్తర మద్య భారతంలో ప్రవహిస్తున్న నదీమైదాన ప్రాంతాలలో ఈ ఉద్యమాలు అధికం అయ్యాయి. తరువాత దేశం అంతటా వ్యాపించాయి.
తిరుగుబాటు
[మార్చు]అవధ్, బుండేల్‌ఖండ్ మరొయు రోహిల్‌ఖండ్ ప్రాంతాలలో తొరుగుబాటు అధికంగా వ్యాపించించింది. ఇది సిపాయీల తిరుగుబాటే కాక ఒక ప్రాంతీయ తిరుగుబాటుగా గుర్తించబడింది. ఇది తరువాత మతకలహంగా మారింది. బరేలీ, బిజ్నోర్, మొరాదాబాద్, ఇతర ప్రాంతీయ ముస్లిములు ప్రత్యేక ముస్లిం రాజ్యం కోరుతూ ఆకుపచ్చ జండాను ఆవిష్కరించారు. .[19]
ప్రధాన కలహం
[మార్చు]ప్రధాన కలహం గంగానది ఏగువ మైదానాలు,, మద్యభారతం అధికమైన కలహాలు చెలరేగాయి. ప్రస్తుత ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తర మద్యప్రదేశ్ మరితు ఢిక్లీ ప్రాంతాలు కలహం చేలరేగిన ప్రాంతాలుగా గుర్తిస్తున్నారు.[20] ఈ తిరుగుబాటు ఈస్టిండియా ప్రభుత్వంలో కలవరం కలిగించింది. ఈ ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వ అఫ్హికారానికి ఇది ఒక హెచ్చరిక అయింది.[21] ఇది 1858 జూన్ 20 నాటికి గ్వాలియర్ పతనానికి దారితీసింది. [20] దాదాపు 40 సంవత్సరాల కాలం సాగిన భారతీయ స్వాతంత్ర్యపోరాటానికి ఇది ఆరభం అని కొంతమంది భావిస్తున్నారు.
రోహిల్లాల పాత్ర
[మార్చు]1857 తిరుగుబాటు తరువాత రోహిల్లా స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర వహించింది. తరువాత ఈ ప్రాంతం నుండి సైన్యం వైదొలగింది.[15] 1857 మొదటి యుద్ధం సమయంలో ఖాన్ భదూర్ ఖాన్ స్వతంత్ర పాలకుడిగా బరేలీలో వెండి నాణ్యాలను తయారు చేయించాడు. ఇవి సరికొత్త రూపంతో వెలువడ్డాయని పరిశోధకులు భావిస్తున్నారు.[22] బరేలీ నగర 1901 జనసంఖ్య 1,090,117. బ్రిగేడ్ 7వ డివిజన్ ఆఫ్ ది ఈస్టర్న్ ఆర్మీ ప్రధాన కార్యాలయం బరేలీలో ఉంది.[15]
ప్రజలు
[మార్చు]స్వాతంత్ర్యానికి ముందు బరేలీ ప్రాంతంలో సగం మంది ముస్లిం ప్రజలు ఉన్నారు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత బరేలీ నగర ముస్లిం ప్రజలలో సగం మంది పాకిస్థాన్‌కు వెళ్ళి స్థిరపడ్డారు. వీరు అధికంగా కరాచీ నగరంలో స్థిరపడ్డారు. అలాగే పాకిస్థాన్ నుండి వచ్చిన హిందువులు బరేలీ నగరంలో స్థిరపడ్డారు. మూకుమ్మడి మానవ వలసలకు బరేలీ ప్రాంతం సాక్ష్యంగా నిలిచింది.
భౌగోళికం
[మార్చు]బరేలీ 28°10′ఉత్తర అక్షాంశం, 78°23′ తూర్పు రేఖాంశంలో ఉంది.
సరిహద్దులు
[మార్చు]సరిహద్దు వివరణ | జిల్లా |
---|---|
తూర్పు సరిహద్దు | పిలిభిత్, షాజహాన్‌పూర్ జిల్లాలు |
పశ్చిమ సరిహద్దు | రాంపూర్ జిల్లా |
ఉత్తర సరిహద్దు | ఉద్దంసింగ్ నగర్ జిల్లా జార్ఖండ్ |
దక్షిణ సరిహద్దు | బదాయూన్ జిల్లా |
నైసర్గికం
[మార్చు]జిల్లా భూభాగం చదరంగా ఉంటుంది. జిల్లాలో పలు జలప్రవాహాలు దక్షిణంగా ఉన్న దిగువభూములవైపు ప్రవహిస్తున్నాయి. జిల్లా భూభాగం పుష్కలంగా పంటను అందిస్తున్న వ్యవసాయభూములు ఉన్నాయి. జిల్లా అంతటా గ్రామ ప్రాంతాలలో వృక్షాలు అధికంగా ఉన్నాయి. గ్రామాలు సంపన్నవంతంగా కనిపిస్తున్నాయి. జిల్లాకు ఉత్తరంలో ఉన్న తారై అరణ్యభూభాగంలో పులులు,ఎలుగుబంట్లు, జింకలు, అడవి పందులు ఉన్నాయి.
నదులు
[మార్చు]సర్దా నది లేక గోగ్రా నది జిల్లా ఉత్తర సరిహద్దును ఏర్పరచింది. తరువాత జిల్లాలో రామగంగా మది ప్రాధాన్యత వహిస్తుంది. రామగంగా నదిలో కుమాన్ పర్వతాలలో జన్మించిన నదులు సంగమిస్తున్నాయి. తరువాత స్థానంలో ఉన్న దియోహా నదికి పలు ఉపనదులు ఉన్నాయి. జిల్లాగుండా గోమతీ నది (గుంతీ నది) కూడా ప్రవహిస్తుంది. [15]
వాతావరణం
[మార్చు]విషయ వివరణ | వాతావరణ వివరణ |
---|---|
వేసవి | ఏప్రిల్ - అక్టోబరు |
శీతాకాలం | నవంబరు - మార్చి |
హిమపాతం | జనవరి |
వర్షాకాలం | జూలై- ఆగస్టు |
వాతావరణ విధానం | ఉపౌష్ణ మండల ఉష్ణోగ్రత |
గరిష్ఠ ఉష్ణోగ్రత | 44 ° సెల్షియస్ |
కనిష్ఠ ఉష్ణోగ్రత | 4 ° సెల్షియస్ |
సరాసరి ఉష్ణోగ్రత | 25 ° సెల్షియస్ |
వర్షపాతం | 1714 మి.మీ |
.
పర్యావరణం
[మార్చు]బరేలీలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. జిల్లా పూర్తిగా గంగా మైదానంలో ఉంది. గంగానది దిగువభూములకు తీసుకువచ్చే సారవంతమైన మట్టి జిల్లా వ్యవసాయ భూములను సశ్యశ్యామలం చేస్తుంది. ఇది నిరంతర వరదలకు గురౌతూ ఉంది. బరేలీ జీల్లాలో రామగంగా నది ఇంకా 7 ఇఅత్ర నదులు ప్రవహిస్తున్నాయి. జిల్లాకు 40కి.మీ దూరంలో దిగువ హిమాలయ పర్వతశ్రేణి ఉంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 4,465,344,[23] |
ఇది దాదాపు. | క్రోషియా దేశ జనసంఖ్యకు సమానం.[24] |
అమెరికాలోని. | లూసియానా నగర జనసంఖ్యకు సమం.[25] |
640 భారతదేశ జిల్లాలలో. | 39 వ స్థానంలో ఉంది..[23] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1084:1000 .[23] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 23.4%.[23] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 883:1000 [23] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 60.52%.[23] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
ప్రత్యేక గణాంకాలు
[మార్చు]విషయాలు | వివరణలు |
---|---|
బరేలీ పురపాలకం - కంటోన్మెంట్ జనసంఖ్య | 8,75,165 |
పురుషుల అక్షరాస్యత | 53% |
స్త్రీల అక్షరాస్యత | 47% |
జిల్లా వైశాల్యం | 123.46 చ.కి,మీ |
5000 |
మతం
[మార్చు]జిల్లాలో హిందువులు 62% ఉన్నారు. వీరిలో కుర్మీలు (జాదుయాన్లు, గంగ్వార్లు, పఠేల్ ప్రజలు), మౌర్యన్లు, ఇతర బనియాలు, జత్వాలు, బాల్మికీలి (వాల్మికీలు), రాజపుత్రులు, కాయస్థులు, పంజాబీల మొదలైన ఇతర కులాలకు చెందున ప్రజలు ఉన్నారు. అల్పసంఖ్యాకులు 35% ఉన్నారు. మౌలిక సదుపాయాల కొరత, సాంఘిక స్థితిగతుల కొరత కారణంగా జిల్లాను ఎ తరగతిగా వర్గీకరించారు.[27] జిల్లాలో ముస్లిములు 26% ఉన్నారు. మోమిన్ అంసారి, బెహ్నా, రోహిలియా, రేయాన్, రంఘర్, షేఖ్ మొదలైన జాతులకు చెందిన ప్రజలు ఉన్నారు. జిల్లాలో సిక్కులు 10% ఉన్నారు. మిగిలిన వారిలో జైనులు, బౌద్ధులు, క్రైస్తవులు ఉన్నారు. బరేలీ జిల్లా అక్షరాస్యత 81%. వీరిలో పురుషుల అక్షరాస్యత 88%, స్త్రీల అక్షరాస్యత 65% ఉంది. జిల్లాలో హిందీ, ఇంగ్లీష్, ఉర్దు, పంజాబీ, కుమౌని భాషలు వాడుకలో ఉన్నాయి.
పరిపాలనా విభాగాలు
[మార్చు]బరేలీ జిల్లాలో ఆరు తాలూకాలు ఉన్నాయి:
- బరేలీ (ప్రధాన)
- అవిన్ల (ఉత్తర ప్రదేశ్)
- ఫరీద్పూర్ (ఉత్తర ప్రదేశ్)
- మిర్గంజి ( ఉత్తర ప్రదేశ్)
- నవాబ్‌గంజ్ (బరేలీ)
- బహేరి
ఈ తాలుకాలను బ్లాకులుగా విభజించారు
రాజకీయాలు
[మార్చు]ఎన్నికల విజయం ఇయర్ (లు) | పార్లమెంట్ సభ్యుడు | రాజకీయ పార్టీ |
---|---|---|
1957 1952 | సతీష్ చంద్ర | భారత జాతీయ కాంగ్రెస్ |
1962 | బ్రిజ్ రాజ్ సింగ్ | జన్ సంఘ్ |
1967 | బ్రిజ్ భూషణ్ లాల్ | జన్ సంఘ్ |
1971 | సతీష్ చంద్ర | భారత జాతీయ కాంగ్రెస్ |
1977 | రామ్ మూర్తి | జనతా పార్టీ |
1984 1980 | బేగం అబీదా అహ్మద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1989, 1991, 1996, 1998, 1999, 2004 | సంతోష్ గంగ్వార్ | భారతీయ జనతా పార్టీ |
2009 | ప్రవీణ్ సింగ్ అయిరన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
సంతోష్ కుమార్ గంగ్వార్ | భారతీయ జనతా పార్టీ |
పరిశ్రమలు
[మార్చు]బరేలీ నగరం జిల్లాలో పారిశ్రామిక కేంద్రంగా ఉంది. జిల్లాలో పలు పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో ఆహార సంబంధ, చక్కెర మిల్లులు అధికంగా ఉన్నాయి.
విద్యా సౌకర్యాలు
[మార్చు]బరేలీ జిల్లాలో 1975లో ఎం.జె.పి రోహిల్‌ఖండ్ యూనివర్శిటీని స్థాపించారు. 1997 ఆగస్టులో దీనిపేరు మహాత్మా జ్యోతిబా ఫులే రోహిల్‌ఖండ్ యూనివర్శిటీ అని మార్చారు. ప్రస్తుతం యూనివర్శిటీ ఆధ్వర్యంలో 80 కాలేజీలు ఉన్నాయి.[28]
జిల్లా లోని పట్టణాలు
[మార్చు]- అవోన్లా
- బహేరీ
- భద్పురా
- బిషారత్‌గంజ్
- దెఒరనీన్
- ధౌర అడోవాల్
- ఫరీద్పూర్
- ఫతేగంజ్ పశ్చిమీ
- గైనీ
- గిర్ధర్పూర్
- కక్గైనా
- మీర్గంజ్
- ముందీ జాగీర్
- నవాబ్గంజ్
- పిపల్సన చౌదరి
- రాంనగర్
- రిచ్హా
- రిథోరా
- షాహీ
- షేర్గర్
- షిష్గర్హ్
- సిరౌలి
- థిరియ నిజామత్ ఖాన్
- రామలీలా
- మొరాదాబాద్
బయటి లింకులు
[మార్చు]ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Pargiter, F.E. (1972). Ancient Indian Historical Tradition, Delhi: Motilal Banarsidass, p.117
- ↑ Raychaudhuri, H.C. (1972) Political History of Ancient India, Calcutta: University of Calcutta, pp.65–8.
- ↑ "When Bareilly was in currency". The Times of India.
- ↑ When the Ain-i-Akbari was compiled (c 1595-6), Katiher was largely held by Rajputs of different clans such as Bachal, Gaur, Chauhan and Rathor. See Iqbal Husain, op. cit., p. 6.
- ↑ Iqbal Husain, op. cit., p. 97.
- ↑ Bahadur Khan Ruhela and Diler Khan Ruhela were important nobles at the court of the Mughal Emperor Shahjahan. As a reward for defeating the Katehriyas a perpetual grant of 14 villages was conferred upon Bahadur Khan who asked his brother Diler Khan to lay the foundations of a new city. Shahjahanpur was established in 1647. It became a strong Afghan township where 9,000 Afghans settled, migrating from Roh, the mountainous area south of Khaibar. The tract of land forming the subah or province of Rohilkhand was formerly called Katehr/Katiher. For more details, see Iqbal Husain, The Rise and Decline of the Ruhela Chieftaincies in 18th Century India, Delhi: Oxford University Press, 1994, chapter 1. "Katiher by and large consisted of the two sark¹rs Badaun and Sambhal. Najmul Ghani says that Katiher consisted of the modern districts of Bareilly, Muradabad and Badaun," p. 4, fn. 25.
- ↑ 7.0 7.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-06-08. Retrieved 2014-12-17.
- ↑ For more details, see Iqbal Husain, The Rise and Decline of the Ruhela Chieftaincies in 18th Century India, Delhi: Oxford University Press, 1994, chapter 1. "Katiher by and large consisted of the two sark¹rs Badaun and Sambhal. Najmul Ghani says that Katiher consisted of the modern districts of Bareilly, Muradabad and Badaun," p. 4, fn. 25.
- ↑ Imperial Gazetteer of India by W M Hunter
- ↑ An Eighteenth Century History of North India: An Account Of The Rise And Fall Of The Rohilla Chiefs In Janbhasha By Rustam Ali Bijnori by Iqtidar Husain Siddiqui Manohar Publications
- ↑ Genealogy of Rampur princely state, [1]
- ↑ The Nawab Vazirs of Awadh who clashed with the Rohillas were: Saadat Khan Burhan-ul Mulk (1720–39), Safdar Jung (1739–56), Shuja-ud Daulah (1756–75). The combined forces of Shuja-ud Daulah and the British defeated Hafiz Rahmat Khan in 1774.
- ↑ Farrukhabad was the seat of the Bangash Nawabs. Muhammad Khan Bangash was the founder of the settlement. The jagir was conferred upon him by Farrukhsiyar (1713–19)in 1713 as reward for services rendered by him in the war of succession.
- ↑ Nawab Safdar Jung of Awadh enlisted the help of the Marathas against the Bangash Nawabs. The Bangash Nawabs sought help from the Rohillasl. The latter were defeated in 1750. The Marathas again invaded Rohilla territory this time attacking Bijnor in 1759.
- ↑ 15.0 15.1 15.2 15.3 15.4 15.5 http://www.1911encyclopedia.org/Bareilly
- ↑ Hafiz British Library.
- ↑ "When Bareilly was in currency". The Times of India.
- ↑ See Conybeare, op. cit. p. 677.
- ↑ R.C. Majumdar: Sepoy Mutiny and Revolt of 1857 (page 2303-31)
- ↑ 20.0 20.1 Bandyopadhyay 2004, pp. 169–172 Bose & Jalal 2003, pp. 88–103 Quote: "The 1857 rebellion was by and large confined to northern Indian Gangetic Plain and central India.", Brown 1994, pp. 85–87 , and Metcalf & Metcalf 2006, pp. 100–106
- ↑ Bayly 1990, p. 170 Quote: "What distinguished the events of 1857 was their scale and the fact that for a short time they posed a military threat to British dominance in the Ganges Plain."
- ↑ "When Bareilly was in currency". The Times of India.
- ↑ 23.0 23.1 23.2 23.3 23.4 23.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011.
Croatia 4,483,804 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 September 2011.
Louisiana 4,533,372
- ↑ Indian Census
- ↑ MINUTES OF THE 34th MEETING OF EMPOWERED COMMITTEE TO CONSIDER AND APPROVE REVISED PLAN FOR BALANCE FUND FOR THE DISTRICTS OF GHAZIABAD, BAREILLY, BARABANKI, SIDDHARTH NAGAR, SHAHJANPUR, MORADABAD, MUZAFFAR NAGAR, BAHRAICH AND LUCKNOW (UTTAR PRADESH) UNDER MULTI-SECTORAL DEVELOPMENT PROGRAMME IN MINORITY CONCENTRATION DISTRICTS HELD ON 22nd JULY, 2010 AT 11.00 A.M. UNDER THE CHAIRMANSHIP OF SECRETARY, MINISTRY OF MINORITY AFFAIRS. Archived 2011-09-30 at the Wayback Machine F. No. 3/64/2010-PP-I, GOVERNMENT OF INDIA, MINISTRY OF MINORITY AFFAIRS
- ↑ "About the University". M.G.P. Rohilkhand University website. Archived from the original on 2009-04-30. Retrieved 2014-12-17.