ప్రేమతో రా
ప్రేమతో రా | |
---|---|
దర్శకత్వం | ఉదయశంకర్ |
రచన | పి. రాజేంద్రకుమార్ (సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | ఉదయశంకర్ |
కథ | భూపతిరాజా |
నిర్మాత | టి. త్రివిక్రమరావు |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఎస్. గోపాలరెడ్డి |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 9 మే 2001 |
సినిమా నిడివి | 154 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ప్రేమతో రా (English: Prematho Raa) విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై టి. త్రివిక్రమరావు నిర్మాణ సారథ్యంలో ఉదయశంకర్ దర్శకత్వంలో 2001, మే 1న విడుదలైన తెలుగు సినిమా. వెంకటేష్, సిమ్రాన్ హీరోహీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. ఉదయ్ శంకర్ దర్శకత్వంలో వెంకటేష్, సిమ్రాన్ హీరోహీరోయిన్స్ గా నటించిన కలిసుందాం రా సినిమా తరువాత వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది.[1][2][3][4]
కథ
[మార్చు]చందు (వెంకటేష్), విజయ్ (సురేష్) అన్నదమ్ములు. ధనవంతుల కుటుంబానికి చెందిన వీరిద్దరిలో పెద్దవాడైన విజయ్ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటుంటాడు. చిన్నవాడైన చందు జులాయిగా తిరుగుతుంటాడు.
విజయ్ సంధ్య (ప్రేమ) అనే అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. ఊటికి వెళ్లిన చందు గీత (సిమ్రాన్) ను చూసి మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలనుకుంటాడు. కాని అదంత ఈజీ కాదని తెలుసుకున్న చందు, గీతను అకట్టుకోవడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటాడు. ఒకరోజు చందు తన ప్రేమను గీతకు చెప్తాడు. గీత అంగీకరిస్తుంది. ఆ సమయంలో ఇద్దరు దగ్గరవుతారు. మరుసటి రోజు గీతకు చెప్పకుండా తన అన్న పెళ్ళికోసం చందు హైదరాబాద్ కి వచ్చేస్తాడు. పెళ్ళి సమయంలో సంధ్య, గీతను తీసుకొచ్చి.. గీత తన చెల్లి అని, చందు మోసం చేశాడని చెపుతుంది. అంతేకాకుండా విజయ్ తో పెళ్ళిని తిరస్కరిస్తుంది.
చందు తన తప్పు తెలుసుకొని, తను చేసిన పనికి పశ్చాత్తాపడుతుంటాడు. సంధ్య దగ్గరికి వెళ్లి, తనను క్షమించమని అభ్యర్థిస్తాడు. దాంతో సంధ్య, చందుకి ఒక అవకాశం ఇస్తుంది. ఆరు నెలలకాలంలో చందు మారితే, చందు గీతల పెళ్ళి చేస్తానంటుంది. చందు మారి గీతను ఎలా ఒప్పించాడు అనేదే మిగిలిన సినిమా.
నటవర్గం
[మార్చు]- వెంకటేష్ - చందు
- సిమ్రాన్ - గీత
- సురేష్ - విజయ్
- ప్రేమ - సంధ్య
- మురళీ మోహన్ - చందు తండ్రి
- సుజాత - చందు నానమ్మ
- కోట శ్రీనివాసరావు - చందు తాతయ్య
- బ్రహ్మానందం - హోటల్ సర్వర్
- ఆలీ - చందు స్నేహితుడు
- ఎల్బీ శ్రీరాం
- ఏ.వి.ఎస్ జ్యోతిష్యుడు
- ప్రసాద్ బాబు
- సుబ్బరాయ శర్మ
- జూనియర్ రేలంగి
- గౌతంరాజు
- మిఠాయి చిట్టి
- గాదిరాజు సుబ్బారావు
- మహేష్ - జగన్
- నవీన్
- శ్రీహర్ష
- రిచా (అతిథి పాత్ర)
- ఆషా సైని - అనిత
- ఇషా కొప్పికర్ - శ్వేత
- మింక్ బ్రార్ - భారతి
- రమాప్రభ
- రాధ
- ఇందు ఆనంద్
- బండ జ్యోతి
- మధురీసేన్ - గీతా స్నేహితురాలు
- కల్పనా రాయ్
పాటలు
[మార్చు]Untitled | |
---|---|
సంగీతం మణిశర్మ. అన్ని హిట్ పాటలే. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.
సం. | పాట | పాట రచయిత | గానం | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "చందమామతో దోస్తి" | చంద్రబోస్ | కెకె | 5:05 |
2. | "హె దగ దగ" | జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు | ఎస్.పి. బాలు, స్వర్ణలత | 4:57 |
3. | "ఏమైందో ఏమో" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్.పి. బాలు | 5:16 |
4. | "పున్నమిలా" | చంద్రబోస్ | ఉదిత్ నారాయణ్, సుజాత | 4:36 |
5. | "బాబు బత్తాయి" | చంద్రబోస్ | ఎస్.పి. బాలు, కవితా సుబ్రహ్మణ్యం | 5:14 |
6. | "గోపాల" | వేటూరి సుందరరామ్మూర్తి | శంకర్ మహదేవన్, గోపికా పూర్ణిమా, ప్రసన్న, కల్పన | 4:21 |
7. | "ప్రేమించడమే" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | శ్రీనివాస్ | 2:09 |
మొత్తం నిడివి: | 31:57 |
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్, సినిమాలు. "ప్రేమతో రా". telugu.filmibeat.com. Retrieved 8 September 2016.
- ↑ "Success and centers list — Venkatesh". idlebrain.com. Retrieved 14 June 2020.
- ↑ Prematho Raa
- ↑ Prematho ra review
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox film with nonstandard dates
- Articles containing English-language text
- Articles using infobox templates with no data rows
- Album articles lacking alt text for covers
- Pages using infobox album with empty type parameter
- Pages using infobox album with unknown parameters
- 2001 తెలుగు సినిమాలు
- వెంకటేష్ నటించిన సినిమాలు
- సిమ్రాన్ నటించిన సినిమాలు
- కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- మణిశర్మ సంగీతం అందించిన సినిమాలు
- ఉదయ్ శంకర్ దర్శకత్వం వహించిన సినిమాలు
- టి. త్రివిక్రమరావు నిర్మించిన చిత్రాలు
- సురేష్ నటించిన సినిమాలు
- ప్రేమ (నటి) నటించిన సినిమాలు
- మురళీమోహన్ నటించిన సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- కల్పనా రాయ్ నటించిన సినిమాలు
- సుజాత నటించిన సినిమాలు
- రమాప్రభ నటించిన సినిమాలు