పెంటేల హరికృష్ణ
పెంటేల హరికృష్ణ (జ. మే 10, 1986) ఆంధ్రప్రదేశ్కు చెందిన చదరంగం క్రీడాకారుడు. 2016 నవంబరులో తన కెరీర్లో అత్యధికంగా పదవ ర్యాంకు సాధించాడు. 2016 డిసెంబరు నాటికి అత్యధిక యెలో రేటింగ్ 2770 పొందాడు. 17 ఆగస్టు, 2001లో దేశంలోనే అతిపిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ అయిన రికార్డు స్థాపించాడు. ఈ రికార్డును తర్వాత కోనేరు హంపి, పరిమార్జన్ నేగి, రమేశ్‌బాబు ప్రజ్ఞానంద, దొమ్మరాజు గుకేష్ అధిగమించారు. హరికృష్ణ 2004, నవంబర్లో ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ సాధించాడు.
జీవిత చరిత్ర
[మార్చు]పెంటేల హరికృష్ణ మే 10, 1986లో గుంటూరులో జన్మించాడు.[1] నాలుగు సంవత్సరాల వయసులో తాత రంగారావు దగ్గర చదరంగంలో ఓనమాలు నేర్చుకున్నాడు.[2]
జూనియర్ ఆటగాడిగా హరికృష్ణ అనేక విజయాలు సాధించాడు. 1993 లో అండర్ - 8, 1995 లో అండర్ - 10, 1998 లో అండర్ - 15, అండర్ - 18, 1999 లో అండర్ - 14 పోటీలలో విజేతగా నిలిచాడు. 2000 సంవత్సరంలో 14 సంవత్సరాల 5 నెలల వయసులో భారతదేశం తరఫున చెస్ ఒలంపియాడ్ లో పాల్గొన్నాడు. ఇందులో 11 రౌండ్లలో 6.5 పాయింట్లు సాధించి గ్రాండ్ మాస్టర్ కి కావలసిన మొదటి షరతును పూర్తి చేశాడు.
సాధించిన విజయాలు
[మార్చు]- 1996 : ప్రపంచ అండర్-10 చాంపియన్
- 1996 : ప్రపంచ అండర్-12 రాపిడ్ చాంపియన్
- 1998 : చిల్డ్రెన్స్ ఒలింపియాడ్ విజయం
- 2000 : కామన్వెల్త్ చాంపియన్‌షిప్
- 2000 : భారత్ తరపున అతిపిన్న వయస్సులో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా
- 2000 : ప్రపంచ అండర్-14 చాంపియన్‌షిప్
- 2000 : జాతీయ ఏ చాంపియన్‌షిప్
- 2000: ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్
- 2000 : చెస్ ఒలింపియాడ్
- 2001 : కోరస్ టోర్నమెంట్
- 2001 : ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్
- 2001 : భారత్ తరపున పిన్న వయస్సులో గ్రాండ్‌మాస్టర్ అయిన హోదా
- 2001 : కామన్వెల్త్ చాంపియన్‌షిప్
- 2004 : ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్
- 2005: బెర్ముడా ఇన్విటేషనల్ టోర్నమెంట్
- 2006 : రిక్జావిక్ ఓపెన్ టోర్నమెంట్
మూలాలు
[మార్చు]- ↑ Friedel, Frederic (2008-02-14). "People and personalities – photo retrospect (part two)". ChessBase. Retrieved 2020-07-17.
- ↑ "From Pratipadu to Belgrade: The journey of Harikrishna Pentala". ChessBase India. 30 October 2017.