Jump to content

పామిటొలిక్ ఆమ్లం

వికీపీడియా నుండి
పామిటొలిక్ ఆమ్లం
పేర్లు
IUPAC నామము
hexadec-9-enoic acid
ఇతర పేర్లు
Palmitoleic acid
cis-Palmitoleic acid
9-cis-Hexadecenoic acid
C16:1 (Lipid numbers)
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [373-49-9]
పబ్ కెమ్ 445638
SMILES O=C(O)CCCCCCC\C=C/CCCCCC
  • InChI=1/C16H30O2/c1-2-3-4-5-6-7-8-9-10-11-12-13-14-15-16(17)18/h7-8H,2-6,9-15H2,1H3,(H,17,18)/b8-7-

ధర్మములు
C16H30O2
మోలార్ ద్రవ్యరాశి 254.408
సాంద్రత 0.894 g/cm³
ద్రవీభవన స్థానం -0.1 °C
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

పామిటొలిక్ ఆమ్లం (palmitoleic acid) ఒక అసంతృప్త కొవ్వు ఆమ్లం.ఈ ఆమ్లాన్నీ పామిటో లియిక్ ఆసిడ్, పామిటోలి ఈయిక్ ఆసిడ్ అనికూడా పలుకుతారు. ఇది ఎక్కువగా పామే కుటుంబానికి చెందిన చెట్ల గింజల, కాయల నూనెల్లో ట్రైగ్లిజరాయిడు రూపంలో లభిస్తుంది.గ్లిజరాయిడులు ఆనగా ఒక అణువు గ్లిజరాల్, మూడు అణువులు కొవ్వు ఆమ్లాలు సంయోగం చెందటం వలన ఏర్పడిన జిడ్డువంటి సమ్మేళన ద్రవపదార్థం. ఈ ట్రైగ్లిజరాయుడులనే నూనెలులేదాకొవ్వులు అంటారు.సాధారణ వాతావరణ ఉష్ణోగ్రతవద్ద ద్రవరూపంలో వుండు ట్రైగ్లిజరాయుడులను నూనెలు అనియు, ఘన లేదా అర్థఘన రూపంలో వుండు గ్లిజరాయిడులను కొవ్వులని అంటారు. కొవ్వులు ఎక్కువ శాతంలో సంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగివుండటం వలన, వాటి ద్రవీభవన ఉష్ణోగ్రత అసంతృప్త కొవ్వు ఆమ్లాలకన్న ఎక్కువకావటం వలన, ఇవి ఘన రూపంలో కన్పించును. కొవ్వు ఆమ్లాలన్నియు మోనో కార్బోక్సిలిక్ ఆమ్లాలు. కొవ్వు ఆమ్లం అధికభాగం హైడ్రోజన్, కార్బనుల అసుసంధానం వలన ఏర్పడిన ఒక సంకెలవంటి రూపంలో వుండును. ఈ సంకెలను హైడ్రోకార్బన్ శృంఖలం అంటారు.

ఆమ్ల రూపకత-లక్షణాలు

[మార్చు]

పామిటోలిక్ లేదా పామిటొ లియిక్ ఆమ్లం 16 కార్బనులనుకలిగి, ఒక ద్వింబంధాన్ని కలిగి, మొక్కల, జంతువు కొవ్వులలో లలో లభించు అసంతృప్త కొవ్వుఆమ్లం.[1] ఆమ్లంలో ద్విబంధం 9 వకార్బను (కార్బోక్సిల్ (COOH) వద్దనుంచి లెక్కించిన) వద్దఏర్పడివుండటం వలన, బంధం వద్ద సిస్ (cis) మెలికను కలిగివున్నందున ఈ ఆమ్లాన్ని సిస్,9-పామిటోలిక్ ఆమ్లం అంటారు.ఇది వాడుక పేరు. శాస్త్రీయ పేరు అయినచో 9, సిస్ -హెక్సాడెసెనోయిక్ ఆసిడ్ (9-cis-Hexadecenoic acid).క్లుప్తంగా C16:1n,9 అంటారు.అనగా ఆమ్లంలో 16 కార్బనులున్నవి, ఒకద్విబంధం ఉన్నది, అది 9 వకార్బనువద్ద ఉన్నదని అర్థం.ఆమ్లంలోని మిథైల్ (CH3) సమూహం నుంచి లెక్కించిన ద్విబంధం 7 వ కార్బనువద్ద ఉండుటచే దీనీ ఒమేగా (ω)7-అమ్లమనికూడా పిలుస్తారు

  • అణుసంకేత సూత్రం= C15H29COOH.
  • ద్విబంధ స్థానాన్ని చూపించు అణుసంకేత సూత్రం= CH3 (CH) 5HC=CH (CH2) 7COOH

ఆమ్లం యొక్క భౌతిక గుణాల పట్టిక [2]

గుణము విలువల మితి
భౌతిక స్థితి రంగులేని ద్రవం
అణుసంకేత సూత్రం C15H29COOH
అణుభారం 254.4
వక్రీభవన సూచికn20D 1.46 (lit.)
ద్రవీభవన ఉష్ణోగ్రత 0.5 °C
బాష్పీభవన ఉష్ణోగ్రత 162 °C (lit.), 0.6 mmHg వద్ద
సాంద్రత,20 °Cవద్ద 0.90 g/mL

లభ్యత :మొక్కల గింజలనూనెలలో, జంతుకొవ్వులలో కన్పిస్తుంది.మానవదేహ వ్యవస్థలో అడిపొస్ కణజాలం ( adipose tissue) నిర్మాణంలో, కాలేయంలో వున్నది[3] .

ఉపయోగాలు

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. "palmitoleic acid". dictionary.reference.com/. Retrieved 2013-12-01.
  2. "Palmitoleic Acid". scbt.com/. Archived from the original on 2016-03-04. Retrieved 2013-12-01.
  3. "PALMITOLEIC ACID". www.mpbio.com/. Retrieved 2013-12-01.[permanent dead link]