Jump to content

పరిమళపు అర

వికీపీడియా నుండి


తిరుమలలో ఆనంద నిలయ విమానానికి ఈశాన్యం దిశలో వున్న యోగ నరసింహ స్వామి గుడికి దక్షిణం వైపు వున్న గోడకు ఆనుకొని వున్న రాతి సాన నే "పరిమళపు అర" అంటారు[1]. ప్రతీ శుక్రవారం వేంకటేశ్వర స్వామికి పేట్టే నామానికి కావలసిన పచ్చకర్పూరాన్ని ఇక్కడే అరగదీస్తారు.

పచ్చకర్పూరం కణికలను మెత్తగా పొడిగా చేయడానికి పరిమళపు అర లేదా పరిమళ రాయిని ప్రధానంగా ఉపయోగిస్తారు. ఈ పొడి పచ్చ కర్పూరం నామం గీయడానికి, గడ్డం బొట్టు అంటించడానికి ఉపయోగిస్తారు. ప్రతి గురువారం సాయంత్రం పరిచారకులు ఈ పని చేస్తారు.[2]

చాలామంది భక్తులు సువాసన కొరకు ఆ రాయిపైన చేతులు రాసి తమ ఒంటికి రాసుకుంటుంటారు. మరికొంత మంది తమ కష్టాలను ఆ రాతిపై రాసుకుంటుంటారు.

మూలాలు

[మార్చు]
  1. News, T. T. D. "TIRUMALA SHIRNE SHINES IN KARTHIKA PARVA DEEPOTSAVAM – TTD News" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-06-17. {{cite web}}: |last= has generic name (help)
  2. "Ravindra Iyengar Adiyen Sri Ramanuja Dasan". ravsri.freehostia.com. Retrieved 2024-06-17.

బాహ్య లంకెలు

[మార్చు]