నాగులపాలెం
Jump to navigation
Jump to search
నాగులపాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°57′17″N 80°16′41″E / 15.95472°N 80.27806°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | పర్చూరు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 523169 |
నాగులపాలెం, బాపట్ల జిల్లా, పర్చూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.,
గ్రామ భౌగోళికం
[మార్చు]సమీప గ్రామాలు
[మార్చు]పర్చూరు 4 కి.మీ, బోదవాడమండగుంట 5 కి.మీ, నూతలపాడు 5 కి.మీ, ఆదిపూడి 6 కి.మీ, జాగర్లమూడి 7 కి.మీ.
గ్రామములోని విద్యాసౌకర్యాలు
[మార్చు]ఏ.పి.బాలయోగి గురుకులం.
నాగుబడి చారిటబుల్ ట్రస్ట్
[మార్చు]ఈ గ్రామంలో శ్రీ నాగుబడి సుబ్బారావు 2003 లో "నాగుబడి చారిటబుల్ ట్రస్ట్" పేరుతో పాఠశాల స్థాపించారు. ఈ పాఠశాల ద్వారా బధిర బాలబాలికలకు ఉచిత విద్య, వసతి, భోజనం ఏర్పాటు చేసి వారికి నృత్యం, చిత్రలేఖనం, టైలరింగ్ మొదలగు పలు అంశాలలో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు పలు జాతీయ స్థాయి పోటీలలో పతకాలు సాధించారు.
గ్రామ ప్రముఖులు
[మార్చు]- కొల్లా రామయ్య - పర్చూరు శాసన సభ్యులు (1955 - 1962)
- కొల్లా సుబ్బారావు - హేతువాది , శుక్ర నీతి, హుమనిస్ట్ విద్యావిధానం రచయిత
- ఇనగంటి ఇమాం సాహెబ్ ప్రఖ్యాత క్లారినెట్ విద్వాంసులు. ఆకాశవాణి నిలయవిద్వాంసులు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో పలుచోట్ల ప్రదర్శనలు ఇచ్చి, శ్రోతల మనసులను రంజింపజేసినారు. రాగసుధారసం బిరుదాంకితులు.
- దావూద్ ఇనగంటి
- ఉప్పలపాటి ప్రియాంక; ఉప్పలపాటి జగదీష్, ఉమాలక్ష్మి దంపతుల కుమార్తె, 2015, తెలంగాణా రాష్ట్ర ఎంసెట్ పరీక్షలో, వైద్య విభాగంలో ఆ రాష్ట్రంలోనే ప్రథమురాలిగా ఉత్తీర్ణురాలైనది. ఈమె జాతీయస్థాయిలో నిర్వహించిన ఎయింస్ (All India Institute of Medical Scinces) ప్రవేశా పరీక్షలలో 41వ స్థానం సంపాదించింది.[1] [2]