అక్షాంశ రేఖాంశాలు: 16°1′51.6000″N 80°13′51.6000″E / 16.031000000°N 80.231000000°E / 16.031000000; 80.231000000

అన్నంభొట్లవారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అన్నంభొట్లవారిపాలెం
గ్రామం
పటం
అన్నంభొట్లవారిపాలెం is located in Andhra Pradesh
అన్నంభొట్లవారిపాలెం
అన్నంభొట్లవారిపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 16°1′51.6000″N 80°13′51.6000″E / 16.031000000°N 80.231000000°E / 16.031000000; 80.231000000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంపర్చూరు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )


అన్నంభొట్లవారి పాలెం, బాపట్ల జిల్లా, పర్చూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామం పర్చూరు మండలం లోని పెద్ద గ్రామాలలో ఒకటి. ఈ గ్రామ జనాభా ఇంచుమించుగా 3000 వరకు ఉంటుంది. ఈ గ్రామం అన్నిరకలుగా బాగా అభివ్రుద్ది చెందినది. పిన్ కోడ్: 523 171.

పాఠశాల

పటం

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఈ గ్రామం చిలకలూరిపేట-చీరాల రోడ్ మార్గములో ఉంది. ప్రతి 15 నిమిషములకు చిలకలూరిపేట, చీరాల, నరసరావుపేట నుంచి ఆ.ప్ర.రా.రో.ర.స బస్ లు ఉన్నాయి. పర్చూరు, చిలకలూరిపేట నుంచి ఆటో సౌకర్యం ఉంది. దగ్గరలో వున్న రైలు స్టేషనులు చీరాల (25 కి.మీ) నరసరావుపేట (25 కి.మీ).

మౌలిక వసతులు

[మార్చు]

రక్షిత మంచినీటి సదుపాయం

[మార్చు]

స్వర్గీయ నందమూరి రామరావు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో నెదర్లాండు వారి ఆర్థిక సహాయంతో ఈ గ్రామంలో రక్షిత మంచినీటి సదుపాయం ఏర్పాటు చేసారు. దీనివలన చుట్టూపక్కల 20 గ్రామాలవరకు తాగునీటి సదుపాయం ఏర్పడింది.

గ్రామంలో సాగు/త్రాగునీటి వసతి సౌకర్యాలు

[మార్చు]
  1. మంచినీటి చెరువు:- గ్రామంలోని ఈ చెరువు నుండి చుట్టుప్రక్కలగల 14 గ్రామాలకు త్రాగునీరు లభిస్తుంది.
  2. గ్రామ సమీపంలోని పాటికుంట చెరువు.

గ్రామ విశేషాలు

[మార్చు]
  1. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగనాడు రాష్రస్థాయి బండలాగుడు ఎడ్ల పందెములు జరుపబడును. ఈ పోటీలకు రాష్రం నలుమూలలనుండి వచ్చి రైతులు తమ ఎడ్లయొక్క ప్రథిభ పాటవాలను ప్రదర్సించెదరు. ఈ పోటీలలో మనం స్వచమైన ఒంగోలు జాతి ఎడ్లను చూడవచ్చు.
  2. ఈ గ్రామానికి చెందిన బి.బ్రహ్మయ్య మరియూ కె.పాపారావు,10వ తరగతి వరకు గ్రామంలోనే చదివినారు. ప్రస్తుతం చిలకలూరిపేటలో ఇంటరు చదువుచున్న వీరిద్దరూ, జాతీయస్థాయి సర్కిల్ కబడ్డీ పోటీలకు ఎంపికైనారు. వీరు 2015, ఫిబ్రవరి-27వ తేదీ నండి మార్-1వ తేదీ వరకు, పంజాబులోని చండీఘర్ లో నిర్వహించు జాతీయ పోటీలలో రాష్ట్ర జట్టు తరపున ఆడనున్నారు.

సమీప గ్రామాలు

[మార్చు]

ఇనగల్లు 12 కి.మీ, అడుసుమల్లి 14 కి.మీ, ఎడుబాడు 15 కి.మీ, న్నీరువారిపాలెం 15 కి.మీ, గొల్లపూడి 15 కి.మీ.

గ్రామానికి చెందిన వ్యక్తులు

[మార్చు]
  • టి.రజనీ - ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]