Jump to content

నల్లు ఇంద్రసేనారెడ్డి

వికీపీడియా నుండి
నల్లు ఇంద్రసేనారెడ్డి
నల్లు ఇంద్రసేనారెడ్డి

నల్లు ఇంద్రసేనారెడ్డి


త్రిపుర గవర్నర్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023 అక్టోబర్ 26
ముందు సత్యదేవ్ నారాయణ ఆర్య

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1983- 1989, 1999- 2004
ముందు పి. సుధీర్ కుమార్
తరువాత మల్‌రెడ్డి రంగారెడ్డి
నియోజకవర్గం మలక్‌పేట్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1960
గానుగబండ గ్రామం, గరిడేపల్లి మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (ఒకప్పుడు)- ప్రస్తుతం సోషల్ ఇంజనీర్
తల్లిదండ్రులు ఎన్ రాంరెడ్డి , హనుమాయమ్మ
జీవిత భాగస్వామి రేణుక నల్లు
సంతానం హర్షవర్ధన్ రెడ్డి , రాజేష్ రెడ్డి , సిద్ధార్థ రెడ్డి
నివాసం హైదరాబాద్
పూర్వ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ
మతం హిందూ

నల్లు ఇంద్రసేనారెడ్డి త్రిపుర రాష్ట్ర గవర్నర్.[1] తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. మాజీ ఎమ్మెల్యే.అతను మలక్‌పేట్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇంద్రసేనారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు.[2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

ఎన్‌.ఇంద్రసేనారెడ్డి తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, గరిడేపల్లి మండలం, గానుగబండ గ్రామంలో[3] నల్లు రాంరెడ్డి, హనుమాయమ్మ దంపతులకు జన్మించాడు.[4] ఉస్మానియా యూనివర్సిటీ నుండి 1972లో ఎం.ఎస్.సి పూర్తి చేసి, వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ నుండి 1975లో ఎం.ఫీల్ పూర్తి చేశాడు.[5]

రాజకీయ జీవితం

[మార్చు]

ఎన్‌.ఇంద్రసేనారెడ్డి విద్యార్థి దశ నుండి రాజకీయాల పట్ల ఆసక్తితో 1980లో భారతీయ జనతా పార్టీలో చేరాడు. అతను 1983, 1985, 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మలక్‌పేట్ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 1996, 2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి, 2009లో మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి 2014లో భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[6] బీజేపీలో జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశాడు. ఎన్‌. ఇంద్రసేనారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీలో చేరికలు, సమన్వయ కమిటీ చైర్మన్‌గా 2022 జనవరిలో నియమితుడయ్యాడు.[7][8]

నల్లు ఇంద్రసేనారెడ్డిని 2023 అక్టోబరు 18న త్రిపుర రాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసింది.[9][10] త్రిపుర గవర్నర్‌గా అక్టోబరు 26న బాధ్యతలు స్వీకరించాడు. ఆగర్తలాలో త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆపరేశ్‌ కుమార్‌ సింగ్‌ నల్లు ఇంద్రసేనారెడ్డిచేత ప్రమాణం స్వీకారం చేయించాడు.[11]

సంవత్సరం గెలిచిన అభ్యర్థి పార్టీ పోలైన ఓట్లు ప్రత్యర్థి పార్టీ పోలైన ఓట్లు
1983 నల్లు ఇంద్రసేనారెడ్డి బీజేపీ 21937 కందాల ప్రభాకర రెడ్డి కాంగ్రెస్ పార్టీ 19340
1985 నల్లు ఇంద్రసేనారెడ్డి బీజేపీ 57581 నాదెండ్ల భాస్కరరావు స్వతంత్ర అభ్యర్థి 39790
1989 పి. సుధీర్ కుమార్ కాంగ్రెస్ 63221 నల్లు ఇంద్రసేనారెడ్డి బీజేపీ 52233
1994 మల్‌రెడ్డి రంగారెడ్డి టీడీపీ 54441 నల్లు ఇంద్రసేనారెడ్డి బీజేపీ 47857
1999 నల్లు ఇంద్రసేనారెడ్డి బీజేపీ 118937 పి. సుధీర్ కుమార్ కాంగ్రెస్ 69617

మూలాలు

[మార్చు]
  1. "Governor Profile | Rajbhavan". rajbhavan.tripura.gov.in. Retrieved 2024-04-27.
  2. Chilukuri (28 November 2019). "కమలం అధిష్టానం". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
  3. Eenadu (25 November 2023). "నల్గొండ నుంచి వచ్చారు... నగరంలో గెలిచారు". Archived from the original on 25 November 2023. Retrieved 25 November 2023.
  4. Sakshi (24 May 2015). "నల్లు ఇంద్రసేనారెడ్డికి మాతృవియోగం". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
  5. Osmania (17 December 2021). "ALUMNI ASSOCIATION OF OSMANIA UNIVERSITY". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
  6. Sakshi (25 April 2014). "నల్లగొండపై... నజర్". Archived from the original on 17 December 2021. Retrieved 17 December 2021.
  7. Andhrajyothy (17 January 2022). "చేరికల కమిటీ చైర్మన్‌గా ఇంద్రసేనారెడ్డి". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
  8. Sakshi (17 January 2022). "తెలంగాణలో కమలం... కమిటీలు". Archived from the original on 18 January 2022. Retrieved 18 January 2022.
  9. A. B. P. Desam (18 October 2023). "త్రిపుర గవర్నర్‌గా బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి, రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ". Archived from the original on 18 October 2023. Retrieved 18 October 2023.
  10. Eenadu (18 October 2023). "త్రిపుర గవర్నర్‌గా భాజపా సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి". Archived from the original on 18 October 2023. Retrieved 18 October 2023.
  11. Mana Telangana (26 October 2023). "త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనా రెడ్డి బాధ్యతలు స్వీకరణ". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.