త్రిపుర జానపద నృత్యాలు
త్రిపుర రాష్ట్రం దాని సంస్కృతి, సంప్రదాయాలలో చాలా గొప్పది. త్రిపురలో అనేక గిరిజన సంఘాలు నివసిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రతి తెగకు దాని స్వంత సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. వారి స్వంత నృత్యం, సంగీతం ఉన్నాయి.త్రిపుర తెగల నృత్యం, సంగీతం ప్రధానంగా జానపద స్వభావం కలిగి ఉంటాయి.జానపద పాటలకు సరిందా, చోంగ్‌ప్రెంగ్, సుమై వంటి సంగీత వాయిద్యాలు ఉంటాయి.వివాహాలు, మతపరమైన సందర్భాలు, ఇతర పండుగలు వంటి సందర్భాలలో జానపద పాటలు, నృత్యాలు ప్రదర్శించబడతాయి. త్రిపుర రాష్ట్రంలోని అనేక జానపద నృత్యాలు, పాటలలో చాలా ముఖ్యమైనవాటిల్లో కొన్నింటిని ఈ వ్యాసంలో వివరీంచడం జరిగింది.[1]
బిజు నృత్యం
[మార్చు]త్రిపురలోని చక్మా కమ్యూనిటీ బిజు నృత్యాన్ని ప్రదర్శిస్తుంది.ఇది ఈ సంఘం యొక్క ముఖ్యమైన నృత్యం.బిజు బెంగాలీ క్యాలెండర్(పంచాంగం లేదాకాలసూచీ) ముగింపును సూచిస్తుంది.ధోల్, బాజీ, హెంగ్రాంగ్, ధులక్/డోలక్ వంటి జానపద వాయిద్యాల లయకు అనుగుణంగా బిజు నృత్యం పాటలకు అనుగుణంగా ప్రదర్శించబడుతుంది.[1]ఈ ప్రసిద్ధ నృత్య రూపం చక్మా సమాజం యొక్క లక్షణం. బిజ్జు అంటే 'చైత్ర-సంక్రాంతి'. ఈ కాలంలోనే చక్మాలు పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ముగియనున్న సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు .'ఖెంగ్-గరాంగ్', 'ధుకుక్', ఫ్లూట్(పిల్లనగ్రోవి/వేణువు) అని పిలవబడేవద్యంతో లయగా వాయించడంతో ఈ నృత్యం అందంగా రూపొందించబడింది.చక్మా మహిళలు జుట్టులోను , లోహ ఆభరణాలపై పువ్వులు ధరిస్తారు. [2]
లెబాంగ్ బూమని నృత్యం
[మార్చు]లెబాంగ్ నృత్యం అనేది త్రిపురలో ఒక రకమైన పంట పండుగ, దీనిని వర్షాకాలం ముందు జరుపుకుంటారు.ఈ పండుగలో నృత్యకారులు లెబాంగ్ అని పిలువబడే కొన్ని రంగురంగుల కీటకాలను పట్టుకుంటారు.నృత్యంలో పాల్గొనే మగవారు వెదురు చిప్(ముక్కలను)లను సంగీత వాయిద్యంగా ఉపయోగిస్తారు, ఆపై చప్పట్లు కొడతారు.మహిళలు కూడా వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, రంగురంగుల కండువాలు ఊపుతూ నృత్యంలో తోడుగా ఉంటారు.[1]గరియా ఉత్సవం ముగిసిన తర్వాత, త్రిపుర ప్రజలు వర్షాకాలం కోసం ఎదురుచూస్తూ విశ్రాంతి తీసుకుంటారు. ఈ కాలంలో, 'లెబాంగ్' అని పిలువబడే మనోహరమైన రంగురంగుల కీటకాలు విత్తనాలను వెతకడానికి కొండ వాలులను సందర్శిస్తాయి. కీటకాల వార్షిక సందర్శన గిరిజన యువకులను ఉల్లాసంగా చేసేలా చేస్తుంది. పురుషులు-జానపదులు తమ చేతిలోని రెండు వెదురు చిప్‌ల సహాయంతో విచిత్రమైన లయబద్ధమైన శబ్దాన్ని చేస్తుంటే, స్త్రీలు 'లెబాంగ్' అని పిలువబడే ఈ కీటకాలను పట్టుకోవడానికి కొండ వాలులలో పరుగెత్తారు.వెదురు చిప్స్ చేసే శబ్దం యొక్క లయ కీటకాలను వాటి దాక్కున్న ప్రదేశాల నుండి ఆకర్షిస్తుంది.మరియు సమూహాలలో ఉన్న మహిళలు వాటిని పట్టుకుంటారు.[2]
కాలం మారుతున్న కొద్దీ కొండ చరియలలో పోడుసాగు చేయడం క్రమంగా తగ్గుతోంది. కానీ పోడు సాగుతో వారి జీవితాలు చుట్టూ కేంద్రీకృతమై, అభివృద్ధి చెందిన సాంస్కృతిక జీవితం సమాజంలోకి లోతుగా ప్రవేశించింది.రెండు నృత్యాలలో త్రిపుర జనపదులు వెదురుతో చేసిన ఖంబ్, వేణువు, సరిండా, వెదురు, వెదురు తాళంతో చేసిన లెబాంగ్ వంటి సంగీత వాయిద్యాలను ఉపయోగిస్తారు. త్రిపురి మహిళలు సాధారణంగా నాణెంతో వెండితో చేసిన గొలుసు, వెండితో చేసిన కంకణం, కంచుతో చేసిన చెవి, ముక్కు ఉంగరాలు వంటి స్వదేశీ ఆభరణాలను ధరిస్తారు. వారు పూలను ఆభరణంగా ఇష్టపడతారు. [2]
గరియా డాన్స్
[మార్చు]గరియా మంచి పంటకు దేవుడు. కాబట్టి గరియా నృత్యం పంటకోత పండుగకు సంబంధించినది అని సూచిస్తుంది.విత్తనాలు నాటిన తర్వాత గరియా పూజ జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రజలు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ మంచి పంటలకై పంట దేవుడిని పూజిస్తారు. [1]త్రిపుర జన జీవితం, సంస్కృతి ఝుమ్ (పోడు వ్యవసాయం ) సాగు చుట్టూ తిరుగుతుంది. ఝుమ్/పోడు కోసం ఎంచుకున్న భూమిలో వున్న వున్న వాటిని కోసి తగల బెట్టిన తరువాత విత్తనాలు విత్తడం ఏప్రిల్ మధ్య నాటికి ముగిసినప్పుడు, వారు సంతృప్తికరమైన,సమృద్ది పంట కోసం 'గారియా' దేవుడిని ప్రార్థిస్తారు.గరియా పూజకు సంబంధించిన వేడుకలు వారం రోజులు జరుగును. ఈ ఏడు రోజుల పాటు పాటలు, నృత్యాలతో తమ ప్రియమైన దేవతను అలరించడానికి ప్రయత్నిస్తారు. [2]
హై హక్ డాన్స్
[మార్చు]త్రిపురలోని హలం తెగ వారు హై హక్ నృత్యం చేస్తారు.ఇది రాష్ట్రంలోని మరొక ఝుమ్/పోడు సాగు రంగానికి సంబంధించిన నృత్యం.ఈ వేడుకను సీజన్/ఋతువు చివరిలో ఆచరిస్తారు.లక్ష్మీ దేవతల దీవెనలు పొందేందుకు గిరిజనులు హై హక్ పండుగను నిర్వహిస్తారు, పాటలకు అనుగుణంగా హై హక్ నృత్యం చేస్తారు.[1]ఈ రాష్ట్రంలోని ఇతర గిరిజన సమాజాల మాదిరిగానే హలం సమాజం యొక్క సామాజిక, ఆర్థిక జీవితం కూడాపోడు(జుమ్)సాగు చుట్టూ తిరుగుతుంది.వారి ప్రసిద్ధ హై-హక్ నృత్యం కోసం వారు ఈ పండుగను సంతోషంగా చేసుకుంటారు . ఇది అద్భుతమైన అందంతో కూడిన సామాజిక నృత్యం కూడా. నృత్యం యొక్క లయలు సుదూర గతం నుండి వారసత్వంగా వచ్చిన సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి.[2]
ఝుమ్ నృత్యం
[మార్చు]శ్రమను క్షణంపాటు మరచిపోయేలా పనిచేసే ప్రదేశంలో ఝుమ్ నృత్యం చేస్తారు. ఝుమ్ నృత్యం ప్రజల జీవన శైలి, సాగు విధానం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శిస్తుంది.కష్టపడి పనిచేయడానికి ప్రజలను ప్రేరేపించడానికి ఇది నిర్వహిస్తారు.నృత్య సమయంలో జానపద పాటలుపాడతారు.[1]ఝుమ్‌లో విపరీతమైన శారీరక శ్రమ ఉంటుంది కాబట్టి, సాగుదారులు తమ మనసును మళ్లించే ప్రయత్నంలో పాడటం, నృత్యం చేయడంలో మునిగిపోతారు. నృత్యం వారి జీవన విధానం, సాగు విధానం, సంస్కృతి, సంప్రదాయాలను వర్ణిస్తుంది. కష్టపడి పనిచేయడానికి ఈ 'పని పాట' స్ఫూర్తిగా నిలుస్తుంది.
సంగ్రాయ్ (మోగ్) నృత్యం
[మార్చు]సాంగ్రాయ్ నృత్య వేడుక త్రిపురలో ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగ సందర్భంగా మోగ్ తెగకు చెందిన యువకులు ప్రతి ఇంటి నుండి కదిలి, కోరికలను తీర్చే పవిత్రమైన చెట్టును(కల్పతరువు )తలపై మోస్తారు.ఈ పండుగ సందర్భంగా నృత్యాలు, పాటలు ప్రదర్శించబడతాయి.[1]బెంగాలీ క్యాలెండర్ సంవత్సరంలో చైత్రమాసంలో వచ్చే సంగ్రాయ్ పండుగ సందర్భంగా మోగ్ కమ్యూనిటీ ప్రజలు సంగ్రాయ్ నృత్యం చేస్తారు.. ముఖ్యంగా యువకులు, బాలికలు, నూతన సంవత్సరాన్ని ఆహ్వానించడానికి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పండుగ రోజును జరుపుకుంటారు.[2]. ఈ వేడుకలో పాటలతో పాటు నృత్యం కూడా ఉంటుంది. పవిత్రమైన కడవ/కుండ లో నీటిని తీసుకువెళతారు. సమాజంలోని పెద్దలు ఈ నీటితో స్నానం చేస్తారు.. గ్రామంలోని ఇళ్ల ద్వారాలకు సుగంధ పరిమళం వెదజల్లిన చందనం పూసి పచ్చి కొబ్బరినీళ్లను ప్రతి ఇంటిపై చల్లుతారు. ఈ గొప్ప వేడుకలో 'బోధి వృక్షం' మూలాలపై సువాసనగల నీటిని పోస్తారు. సాంప్రదాయ ఖౌయాంగ్ తోడుగా ఈ నృత్యం చేస్తారు.[3]
హోజాగిరి నృత్యం
[మార్చు]రియాంగ్ కమ్యూనిటీకి చెందిన మహిళలు హోజాగిరి నృత్యం చేస్తారు. ఇది సాధారణంగా కొత్త పంట సమయంలో నిర్వహిస్తారు, ప్రజలు లక్ష్మీ దేవతలను పూజిస్తారు.హోజాగిరి అనేది సమతుల్యత, అంకితభావం, సూక్ష్మ నైపుణ్యం కలిగిన నృత్యం. నృత్యంలోనర్తకి తలపై సీసాతో మట్టి కుండ మీద నిలబడి ఉంటుంది. వెలుగుతున్న దీపం సీసాపై సమతుల్యం చేయబడివుండును.నర్తకులు బాటిల్, దీపానికి భంగం కలిగించకుండా, వారి శరీరాల క్రింది భాగాలను లయబద్ధంగా వంగి కదుపుతారు.[1]నృత్యం యొక్క ఇతివృత్తం దాదాపు ఇతర తెగల మాదిరిగానే ఉన్నప్పటికీ, రియాంగ్ కమ్యూనిటీ యొక్క నృత్య రూపం ఇతరులకు భిన్నంగా ఉంటుంది. చేతుల కదలిక లేదా శరీరం యొక్క పై భాగం కూడా కొంతవరకు పరిమితం చేయబడింది, అయితే వారి నడుము నుండి వారి పాదాల వరకు కదలిక అద్భుతమైన అలలను సృష్టిస్తుంది.తలపై సీసాతో , దానిపై వెలిగించిన దీపంతో మట్టి కుండపై నిలబడి, రియాంగ్ బెల్లె, శరీరం యొక్క దిగువ భాగాన్ని లయబద్ధంగా మెలితిప్పినట్లు నృత్యం చేసినప్పుడు, ఆ నృత్యం చూపరులను భ్రమింపజేస్తుంది.రియాంగ్‌లు ఖంబ్, వెదురుతో చేసిన ఫ్లూట్/వేణువు , వెదురు తాళం వంటి సంగీత వాయిద్యాలను కూడా ఉపయోగిస్తారు.రియాంగ్ మహిళలు నలుపు రంగు పచ్రా, రియా ధరించడానికి ఇష్టపడతారు. రియాంగ్ మహిళలు నాణేలతో ఉంగరాన్ని ధరిస్తారు, ఇది సాధారణంగా వారి దేహ ఎగువ ప్రాంతాన్ని మొత్తం కప్పివుంచుతుంది.చెవుల్లో నాణెంతో చేసిన ఉంగరాలవంటి రింగులను కూడా పెట్టుకుంటారు.వారు లోహ వస్తువులను ఆభరణాలుగా ధరించటానికి , సువాసనగల పువ్వులను తలలో ధరించటానికి ఇష్టపడతారు. [2]
గళముచమో నృత్యం
[మార్చు]ఇది పంట కాలం చివరిలో జరుపుకుంటారు. మంచి పంట కోసం దేవతలకు కృతజ్ఞతలు తెలిపేందుకు గాలముచమో నృత్యం చేస్తారు.ఈ నృత్య సమయంలో నృత్యకారులు సంప్రదాయ దుస్తులు ధరించి వారి సంగీత వాయిద్యాలను వాయిస్తారు.[1] త్రిపుర జన సమాజంలో ఈ నృత్యం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. నృత్యం ద్వారా సంఘం మంచి పంట కోసం దేవతలకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది. గళముచమో నృత్యాన్ని సంప్రదాయ దుస్తులు ధరించిన నృత్యకారులు ప్రదర్శింస్తారు. నృత్య సమయంలో వాయించే సంగీత వాయిద్యాలు త్రిపురకు విలక్షణమైనవి.[3]
చెరవ్లాం నృత్యం
[మార్చు]లుషాయ్ కమ్యూనిటీకి చెందిన అమ్మాయిలు చెరావ్లం నృత్యం చేస్తారు.వారు అకాల మరణం పొందిన వ్యక్తి గౌరవార్థం ఈ నృత్యం చేస్తారు.[1]మనిషి మరణం తర్వాత స్వర్గానికి వెళ్తారని వారు నమ్ముతారు. యాదృచ్ఛికంగా, గర్భిణీ స్త్రీ మరణిస్తే, ఆమె తన శారీరక శ్రమలతో పాటు, స్వర్గానికి సుదీర్ఘ నడకప్రయాణాన్ని చేయడం చాలా కష్టమని వారు భావిస్తారు.అందుకే ఆమె గర్భం యొక్క చివరి దశలో - నిజానికి డెలివరీకి ముందు లేదా వెంటనే ఆమె బంధువులందరూ ఈ 'చెరా' నృత్యాన్ని పగలు, రాత్రి అంతా సమూహంగా చేస్తారు, తద్వారా ఆ మహిళ యొక్క మనస్సులో విశ్వాసం ఏర్పడుతుంది.ఆమె ఒకవేళ మరణిస్తే, చనిపోయే వరకు వెదురు శబ్దం ద్వారా పొందిన నృత్యం యొక్క లయ ద్వారా పొందిన ఆనందం, ధైర్యం, ఆత్మవిశ్వాసంతో స్వర్గానికి వెళ్లడం సాధ్యమవుతుందని నమ్ముతారు.[2]
గజన్ నృత్యం
[మార్చు]చైత్ర మాసం చివరి రోజున జరుపుకునే గజన్ నృత్యం త్రిపురలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందింది. ఈ నృత్యంలో ప్రజలు శివుడు, గౌరీ దేవతల వలె దుస్తులు ధరిస్తారు. నృత్యకారు లు ఇంటింటికి వెళ్ళి నృత్యం చేసి బియ్యం, డబ్బును సేకరిస్తారు. [1]త్రిపురలోని బెంగాలీ సమాజం గజన్ పండుగను జరుపుకుంటుంది. సంతోషకరమైన, సంపన్నమైన నూతన సంవత్సరం కొరకు శివునికి ప్రార్ధనలు సమర్పించబడతాయి. శివుడు, దుర్గామాత, కాళీ, నంది, భృంగి (శివుని సహచరులు) వంటి వేషధారణలతో ప్రదర్శకులు డప్పుల దరువులకు అనుగుణంగా నృత్యం చేస్తారు, శివుని స్తుతిస్తూ పాటలు పాడతారు. [3]
రవీంద్ర సంగీతం
[మార్చు]త్రిపురలోని బెంగాలీలు, గిరిజన వర్గాలలో రవీంద్ర సంగీతం, నృత్యం ప్రసిద్ధి చెందింది. గొప్ప కవి రవీంద్ర నాథ్ ఠాగూర్ జ్ఞాపకార్థం రవీంద్ర సంగీతం, నృత్యం ప్రదర్శించబడుతుంది. [1]
ఇవికూడా చదవండి
[మార్చు]- చత్తీస్‌గఢ్ జానపద నృత్యాలు
- కేరళ జానపద నృత్యాలు
- కాశ్మీర్ జానపద నృత్యాలు
- సిక్కిం జానపద నృత్యాలు
- మేఘాలయ జానపద నృత్యాలు