Jump to content

తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2020)

వికీపీడియా నుండి
కీర్తి పురస్కారాలు (2020)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ రంగాలు
వ్యవస్థాపిత 1986
మొదటి బహూకరణ 1986
క్రితం బహూకరణ 2019
మొత్తం బహూకరణలు 44
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 5,116
Award Rank
2019కీర్తి పురస్కారాలు (2020)2021

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు కీర్తి పురస్కారాలు అందజేస్తారు.[1]

1986 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 5,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించడం జరుగుతుంది.

పురస్కార గ్రహీతలు

[మార్చు]

2020 సంవత్సర కీర్తి పురస్కారానికి 44మంది ప్రముఖులు జాబితా 2023 మార్చి 23న ప్రకటించబడింది.[2] కీర్తి పురస్కారానికి ఎంపికైన వారికి 2023 మార్చి 28న ఎన్‌టీఆర్‌ కళామందిరంలో నిర్వహించిన కార్యక్రకమంలో పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య డి.రవీందర్‌, తెలుగు విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ తంగెడ కిషన్‌రావు, రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్, విస్తరణ సేవా విభాగం ఇన్‌చార్జి రింగు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.[3][4]

క్రమ

సంఖ్య

పురస్కార గ్రహీత పేరు ప్రక్రియ స్మారకం దాత
1 డా.వి.వి.రామారావు సృజనాత్మక సాహిత్యం బెజవాడ పట్టాభిరామిరెడ్డి డా. బెజవాడ గోపాలరెడ్డి
2 ఎస్.వి. రామారావు పరిశోధన తిక్కవరపు రామిరెడ్డి డా. బెజవాడ గోపాలరెడ్డి
3 ఆర్.సి. కృష్ణస్వామి రాజు హాస్యరచన బులుసు బుచ్చి సర్వారాయడు ఎస్.బి.బి. పట్టాభిరామారావు
4 జి. భగీరథ జీవిత చరిత్ర ఇల్లిందల సీతారామారావు - సరస్వతిదేవి ఇల్లిందల సరస్వతిదేవి కుటుంబ సభ్యులు
5 డా. పొనుగోటి సరస్వతి ఉత్తమ రచయిత్రి నాళం కృష్ణారావు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ
5 నాగమణి ఉత్తమ నటి పైడి లక్ష్మయ్య డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్)
7 మాలెల అంజిలయ్య ఉత్తమ నటుడు పైడి లక్ష్మయ్య డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్)
8 చిలువేరు రఘరాం ఉత్తమ నాటక రచయిత పైడి లక్ష్మయ్య డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్)
9 పేరలింగం హేతువాదం త్రిపురనేని రామస్వామి కోటపాటి మురహరిరావు
10 శైలజా మిత్ర ఉత్తమ రచయిత్రి వాసిరెడ్డి రంగనాయకమ్మ వాసిరెడ్డి సీతాదేవి
11 డా. ఎవి. వీరభద్రాచారి వచన కవిత ఎ. లక్ష్మీరమణ అమిలినేని లక్ష్మీరమణ
12 తాళ్ళపల్లి మురళీధర్ గౌడ్ వివిధ ప్రక్రియలు ఏటుకూరి వెంకట నర్సయ్య డా. యస్.యస్. కృష్ణమూర్తి
13 అన్నవరపు బ్రహ్మయ్య పత్రికారచన తాపీ ధర్మారావు కోటపాటి మురహరిరావు
14 కాటేపల్లి లక్ష్మీనరసింహమూర్తి అవధానం కార్యమపూడి రాజమన్నారు కార్యంపూడి రామకృష్ణారావు, వింజయమూరి భాస్కరరావు
15 బండారు విజయ మహిళాభ్యుధయం మల్లాది సుబ్బమ్మ మల్లాది సుబ్బమ్మ
16 ప్రొ. గజ్జెల రామేశ్వరం గ్రంథాలయ కర్త అయ్యంకి వెంకటరమణయ్య డా. వెలగా వెంకటప్పయ్య
17 డా. ముదిగంటి సుధాకర్ రెడ్డి గ్రంథాలయ సమాచార విజ్ఞానం పర్వతనేని గంగాధరరావు డా. వెలగా వెంకటప్పయ్య
18 డా. పసునూరి రవీందర్ కథ బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం బుర్రా అలిమేలు
19 ప్రొ. భాస్కర్ శివాల్కర్ నాటకం బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం బుర్రా అలిమేలు
20 ఎజాజ్ అహ్మద్ ఉత్తమ ఉపాధ్యాయుడు బైరగోని మల్లయ్య గౌడ్
21 పేరిణి ప్రకాష్ పేరిణి డా. నటరాజ రామకృష్ణ డా. నటరాజ రామకృష్ణ
22 వేముల ప్రభాకర్ నవల బి. అరుణ కుమారి ఆచార్య వి. రామకృష్ణారావు
23 రాళ్ళపల్లి సుందర్ రావు భాష అబ్బూరి రామకృష్ణారావు, అబ్బూరి వరదరాజేశ్వరరావు అబ్బూరి ట్రస్ట్
24 యండి రజియా జానపద కళలు సీతారత్నం - డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
25 డా. సముద్రాల వెంకటరంగ రామానుజాచార్యులు ఆధ్యాత్మిక సాహిత్యం బాదం సరోజదేవి బాదం రామస్వామి
26 ఘట్టమరాజు ఆశ్వత్ధనారాయణ సాహిత్య విమర్శ పిల్లలమర్రి వేదవతి - జగన్నాథం ఆచార్య పి. లీల
27 డా. మాదిరాజు బ్రహ్మానందరావు పద్యం నండూరి రామకృష్ణమాచార్య నండూరి రామకృష్ణమాచార్య సాహిత్యపీఠం
28 ఆకృతి సుధాకర్ సాంస్కృతిక సంస్థ నిర్వహణ వంగా లక్ష్మణరెడ్డి వి.వి. రాఘవరెడ్డి
29 డా. వివి వెంకట రమణ జనరంజక విజ్ఞానం నాగసూరి సంజీవయ్య నాగసూరి వేణుగోపాల్
30 పస్తం కొమురమ్మ జానపద గాయకురాలు బుర్రా రాజసోమిదేవి పి. రాజ్యలక్ష్మీ
31 ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మీ బాల సాహిత్యం అంగలకుదిటి సుదంరాచార్య కందేపి రాణిప్రసాద్
32 శ్యామ్ ఇంద్రజాలం డా. బి.వి.పట్టాభిరామ్ బి.వి.పట్టాభిరామ్
33 జి.వి. కృష్ణమూర్తి పద్య రచన కె.వి. రమణాచారి డా. కె.వి. రమణాచారి
34 నారు కార్టూనిస్ట్ జి. అమృతలత జి. అమృతలత
35 పి.వి. సాయిబాబా లలిత సంగీతం జి. రాజారెడ్డి జి. రాజారెడ్డి
36 కొరుప్రోలు మాధవరావు తెలుగు గజల్
37 డా. కె. శేషులత శాస్త్రీయ సంగీతం డా. రావూరి భరద్వాజ కాంతమ్మ డా. రావూరి భరద్వాజ
38 డా. ఎ.ఎస్. ఫణీంద్ర జ్యోతిషం మాటేటి రామప్ప
39 టి.వి. ప్రసాద్ కాల్పనిక సాహిత్యం నాయని సుబ్బారావు
40 డా. గెల్లి నాగేశ్వరరావు సంఘపేవ గాడిచర్ల హరిసర్వోత్తమరావు-బి.వి. దాశరథి
41 డా. రుద్రవరం సుధాకర్ కూచిపూడి నృత్యం కర్కాల దేవకమల
42 పుత్తా మల్లారెడ్డి ప్రాచీన సాహిత్యం బండ్ల సుబ్రహ్మణ్యం
43 వారాల ఆనంద్ అనువాద సాహిత్యం నిడమర్తి అశ్వినీ కుమారదత్తు-ఉమారాజేశ్వరరావు
44 ప్రీతి సంయుక్త చిత్రలేఖనం పాములపర్తి సత్తెమ్మ నరసింహరావు

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. నవతెలంగాణ (30 April 2016). "కీర్తి పురస్కారాలు ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం". www.navatelangana.com. Retrieved 2022-09-07.
  2. "44 మందికి తెలుగు వర్సిటీ 'కీర్తి పురస్కారాలు'". EENADU. 2023-03-24. Archived from the original on 2023-03-24. Retrieved 2023-03-24.
  3. ABN (2023-03-29). "ఘనంగా తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాల ప్రదానోత్సవం". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-03-28. Retrieved 2023-03-29.
  4. telugu, NT News (2023-03-29). "22 మందికి కీర్తి పురస్కారాలు". www.ntnews.com. Archived from the original on 2023-03-29. Retrieved 2023-03-29.