Jump to content

భాస్కర్ శివాల్కర్

వికీపీడియా నుండి
భాస్కర్‌ దత్తాత్రేయ్‌ శివాల్కర్‌
తెలంగాణ యువ నాటకోత్సవంలో 2018 మే 25న సత్కారం స్వీకరిస్తున్న భాస్కర్ శివాల్కర్
జననంభాస్కర్‌ దత్తాత్రేయ్‌ శివాల్కర్‌
(1940-05-11) 1940 మే 11 (వయసు 84)
షా ఆలీ బండ, హైదరాబాద్
మరణం2023 సెప్టెంబరు 5(2023-09-05) (వయసు 83)
హైదరాబాద్
వృత్తిఉపన్యాసకుడు
ప్రసిద్ధినాటక రచయిత, దర్శకుడు, నటుడు

భాస్కర్‌ శివాల్కర్‌ హైదరాబాదుకు చెందిన నాటకరంగ ప్రముఖుడు. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా, అధ్యాపకుడిగా గత యాభై ఏండ్లలో నాటకరంగంలో అనేక ప్రయోగాలు చేశాడు. ‘రంగధార’ నాటక సంస్థతో తెలుగు, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్‌ నాటకాలను తన దర్శకత్వంలో ప్రేక్షకులకు అందించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు 1940, మే 11వ తేదీన హైదరాబాద్‌ పాతబస్తీలోని శాలిబండలో జన్మించాడు. ఇతని పూర్తిపేరు భాస్కర్‌ దత్తాత్రేయ్‌ శివాల్కర్‌. ఐదవ ఏటనే తండ్రి మరణించడంతో బాల్యం నుంచే అనేక కష్టాలకోర్చి చదువుకున్నాడు.[1]

చిన్నప్పటి నుంచే నాటకాల పట్ల మక్కువ కలిగిన భాస్కర్‌ శివాల్కర్‌ స్కూల్లో, కాలేజీల్లో అనేక నాటక ప్రదర్శనల్లో పాల్గొంటూ గాత్రం, చిత్రలేఖనంలో డిప్లొమా పూర్తిచేశాడు. కొంతకాలం మహారాష్ట్రలో పనిచేసిన శివాల్కర్ మరాఠీలో కూడా నాటకాలు వ్రాశాడు. మిత్రులతో కలిసి 1971లో "రంగధార" అనే నాటక సంస్థను నెలకొల్పాడు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్‌, మరాఠీ భాషల్లో 120కి పైగా నాటకాలకు దర్శకత్వం వహించాడు. ఇతడు రూపొందించిన పలు నాటకాలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. లండన్‌ థియేటర్‌ ఫెస్టివల్‌తో పాటు మహారాష్ట్ర, బెంగళూరు, కేరళ నాటకోత్సవాల్లోనూ శివాల్కర్‌ నాటకాలను ప్రదర్శించాడు.

1983-85 మధ్య ఓయూలో పీజీ డిప్లొమా ఇన్‌ థియేటర్‌ ఆర్ట్స్‌ పూర్తిచేసి అక్కడే పార్ట్‌టైం లెక్చరర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో లెక్చరర్‌గా చేరి ప్రొఫెసర్‌ హోదాలో 2002లో పదవీ విరమణ చేశాడు. సినీనటులు రాళ్లపల్లి, తెలంగాణ శకుంతల, తనికెళ్ల భరణి, శంకర్ మెల్కోటే మొదలైనవారు ఇతడి దర్శకత్వంలో రంగస్థలంపై నటించారు.

పురస్కారాలు, సన్మానాలు

[మార్చు]

మరణం

[మార్చు]

హైదరాబాద్‌ కేంద్రంగా నాటకరంగానికి ఎనలేని సేవ చేసిన భాస్కర్‌ శివాల్కర్‌ తమ 83 ఏండ్ల వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2023, సెప్టెంబర్ 5న ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. కోట్ల హనుమంతరావు (6 September 2023). "నాటక 'రంగధార' శివాల్కర్‌". నమస్తే తెలంగాణ. Retrieved 30 October 2024.
  2. న్యూస్ టుడే (24 March 2023). "44 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". ఈనాడు దినపత్రిక. Retrieved 30 October 2024.
  3. విలేకరి (6 September 2023). "ఆచార్య భాస్కర్‌ శివాల్కర్‌ ఇక లేరు". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Retrieved 30 October 2024.