Jump to content

తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2012)

వికీపీడియా నుండి
కీర్తి పురస్కారాలు (2012)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ రంగాలు
వ్యవస్థాపిత 1986
మొదటి బహూకరణ 1986
క్రితం బహూకరణ 2012
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 5,116
Award Rank
2011కీర్తి పురస్కారాలు (2012)2013

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భారతదేశంలోని భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు కీర్తి పురస్కారాలు అందజేస్తారు.

1986 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 5,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించడం జరుగుతుంది.[1]

పురస్కార గ్రహీతలు

[మార్చు]

2012 సంవత్సర కీర్తి పురస్కారానికి 32 మంది ఎంపికయ్యారు. వీరికి 2013, నవంబరు 28న పురస్కారం అందజేయబడింది.[2]

క్రమసంఖ్య పురస్కార గ్రహీత పేరు ప్రక్రియ స్మారకం దాత
1 ఆచార్య మన్నవ భాస్కరనాయుడు సృజనాత్మక సాహిత్యం బెజవాడ పట్టాభిరామిరెడ్డి డా. బెజవాడ గోపాలరెడ్డి
2 హరి శివకుమార్ పరిశోధన తిక్కవరపు రామిరెడ్డి డా. బెజవాడ గోపాలరెడ్డి
3 టి.రాంరెడ్డి (రుక్మిణి) హాస్యరచన బులుసు బుచ్చి సర్వారాయడు ఎస్.బి.బి. పట్టాభిరామారావు
4 డా. మంగళగిరి ప్రమీలాదేవి జీవిత చరిత్ర ఇల్లిందల సీతారామారావు - సరస్వతిదేవి ఇల్లిందల సరస్వతిదేవి కుటుంబ సభ్యులు
5 డా. ఎం.కె.దేవకి ఉత్తమ రచయిత్రి నాళం కృష్ణారావు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ
5 జ్యోతిరాణి సాలూరి ఉత్తమ నటి పైడి లక్ష్మయ్య డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్)
7 ఎం. జానకీనాథ్ ఉత్తమ నటుడు పైడి లక్ష్మయ్య డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్)
8 గోపి సత్యప్రకాష్ (స్నిగ్ధ) ఉత్తమ నాటక రచయిత పైడి లక్ష్మయ్య డా. పి.ఎల్. సంజీవరెడ్డి (ఐ.ఎ.ఎస్)
9 మేడూరి సత్యనారాయణ హేతువాదం త్రిపురనేని రామస్వామి కోటపాటి మురహరిరావు
10 స్వాతి శ్రీపాద ఉత్తమ రచయిత్రి వాసిరెడ్డి రంగనాయకమ్మ వాసిరెడ్డి సీతాదేవి
11 చిన్ని నారాయణ రావు కవిత్వం ఎ. లక్ష్మీరమణ అమిలినేని లక్ష్మీరమణ
12 ఎ.వి. జనార్థనరావు వివిధ ప్రక్రియలు ఏటుకూరి వెంకట నర్సయ్య డా. యస్.యస్. కృష్ణమూర్తి
13 ఎం. సదాశివశర్మ పత్రికారచన తాపీ ధర్మారావు కోటపాటి మురహరిరావు
14 ఆముదాల మురళి అవధానం కార్యమపూడి రాజమన్నారు కార్యంపూడి రామకృష్ణారావు, వింజయమూరి భాస్కరరావు
15 పరుచూరు జమున మహిళాభ్యుధయం మల్లాది సుబ్బమ్మ మల్లాది సుబ్బమ్మ
16 కె.పి.అశోక్ కుమార్ గ్రంథాలయ కర్త అయ్యంకి వెంకటరమణయ్య డా. వెలగా వెంకటప్పయ్య
17 టి. అశోక్‌బాబు గ్రంథాలయ సమాచార విజ్ఞానం పర్వతనేని గంగాధరరావు డా. వెలగా వెంకటప్పయ్య
18 కె.వి. నరేందర్ కథ బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం బుర్రా అలిమేలు
19 వనం లక్ష్మీకాంతారావు నాటకం బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం బుర్రా అలిమేలు
20 అమృతలత సంఘసేవ గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, బి.వి. దాశరథి బి.వి. దాశరథి సన్మాన సారథ్య సంఘం
21 పేట జయలక్ష్మీ ఆంధ్రనాట్యం డా. నటరాజ రామకృష్ణ డా. నటరాజ రామకృష్ణ
22 నాయుని కృష్ణమూర్తి నవల బి. అరుణ కుమారి ఆచార్య వి. రామకృష్ణారావు
23 ఎ. ఉషాదేవి భాషాచ్చంద సాహిత్య విమర్శ అబ్బూరి రామకృష్ణారావు, అబ్బూరి వరదరాజేశ్వరరావు అబ్బూరి ట్రస్ట్
24 కచ్చు కొమురయ్య జానపద కళలు, చెక్కబొమ్మలు సీతారత్నం - డా. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
25 మసన చెన్నప్ప ఆధ్యాత్మిక సాహిత్యం బాదం సరోజదేవి బాదం రామస్వామి
26 డా. దార్ల వేంకటేశ్వరరావు సాహిత్య విమర్శ పిల్లలమర్రి వేదవతి - జగన్నాథం ఆచార్య పి.లీల
27 మల్లవరపు వెంకటరావు పద్యం నండూరి రామకృష్ణమాచార్య నండూరి రామకృష్ణమాచార్య సాహిత్యపీఠం
28 వంశీరామరాజు సాంస్కృతిక సంస్థ నిర్వహణ వంగా లక్ష్మణరెడ్డి వి.వి. రాఘవరెడ్డి
29 సి.వి.సర్వేశ్వరశర్మ జనరంజక విజ్ఞానం నాగసూరి సంజీవయ్య నాగసూరి వేణుగోపాల్
30 అరుణా సుబ్బారావు జానపద గాయకుడు బుర్రా రాజసోమిదేవి పి. రాజ్యలక్ష్మీ
31 టి. వేదాంత సూరి బాల సాహిత్యం అంగలకుదిటి సుదంరాచార్య కందేపి రాణిప్రసాద్
32 చొక్కాపు వెంకటరమణ ఇంద్రజాలం డా. బి.వి.పట్టాభిరామ్ బి.వి.పట్టాభిరామ్

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి (30 April 2016). "కీర్తి పురస్కారాలను ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం". Archived from the original on 23 July 2018. Retrieved 27 May 2019.
  2. సాక్షి, ఆంధ్రప్రదేశ్ (21 November 2013). "32 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". Archived from the original on 27 May 2019. Retrieved 27 May 2019.

ఇతర లంకెలు

[మార్చు]
  1. కీర్తి పురస్కార గ్రహీతల జాబితా