Jump to content

తెలంగాణ రాజ్‌భవన్ (హైదరాబాదు)

వికీపీడియా నుండి
రాజ్‌భవన్
సాధారణ సమాచారం
పూర్తి చేయబడినది1936
యజమానితెలంగాణ ప్రభుత్వం
సాంకేతిక విషయములు
పరిమాణం21.5 ఎకరాలు (8.7 హె.)
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిఎరిక్ మర్రెట్, జైన్ యార్ జంగ్
మూలాలు
రాజ్‌భవన్ చరిత్ర (గవర్నర్ అధికారిక జాలగూడు)

రాజ్‌భవన్ హైదరాబాదు లోని సోమాజీగూడ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భవనం. ఇది రాష్ట్ర గవర్నరు అధికారిక నివాసం.[1]

చరిత్ర

[మార్చు]

సోమాజీగూడాకు చెందిన నవాబ్ షారోజ్ జంగ్, సయ్యద్ అఖిల్ బిల్‌గ్రామీ నివాస స్థలాన్ని 1930లో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కొనుగోలు చేసి తమ ఆస్థానంలో పనిచేసే ప్రధానమంత్రికి గృహాలకోసం నిర్మించాడు. సర్ అక్బర్ హైద్రీ (1936-41), నవాబ్ చత్తారీ (1941-46), మీర్జా ఇస్మాయిల్ (1946-47), మెహిదీ యార్ జంగ్ (నవంబరు-డిసెంబరు 1947), మీర్​ లాయక్​ అలీ (1947-48) మొదలైన వారు ఈ భవనంలో నివసించారు.

నిర్మాణం

[మార్చు]
2019 బతుకమ్మ వేడుకల సందర్భంగా అలంకరించబడిన రాజ్‌భవన్

ఎరిక్ మర్రెట్, జైన్ యార్ జంగ్ ఆధ్వర్యంలో 1930నాటి అంతర్జాతీయ స్థాయి డిజైన్లతో ఓడ ఆకారంలో 21.5 ఎకరాల్లో ఈ భవనం నిర్మించబడింది. ఇందులోని దర్బార్ హాలును 1936లో నిర్మించారు. ఇస్లామిక్ ఆర్చ్ సిమెంట్ జాలీలుతో ఉన్న ఈ భవనం నిజాం రాజులు నిర్మించిన అందమైన భవనాల్లో ఒకటిగా నిలుస్తుంది.

కార్యక్రమాలు

[మార్చు]
  1. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకారాలు[2]
  2. ఉగాది వేడుకలు[3]
  3. ఇఫ్తార్‌ విందు[4]
  4. బతుకమ్మ సంబరాలు

మూలాలు

[మార్చు]
  1. రాజ్‌భవన్,ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 128
  2. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (14 December 2018). "కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనే నేను..అంతఃకరణ శుద్ధితో." Archived from the original on 3 June 2019. Retrieved 3 June 2019.
  3. The Hans India, Telangana (5 April 2019). "Hyderabad: Pre-Ugadi celebrations at Raj Bhavan today". Roja Mayabrahma. Archived from the original on 3 June 2019. Retrieved 3 June 2019.
  4. ఈనాడు, హైదరాబాదు (2 June 2019). "గవర్నర్‌ ఇఫ్తార్‌ విందు.. సందడిగా రాజ్‌భవన్‌!". Archived from the original on 3 June 2019. Retrieved 3 June 2019.

ఇతర లంకెలు

[మార్చు]