అక్షాంశ రేఖాంశాలు: 24°19′41″N 93°59′10″E / 24.328°N 93.986°E / 24.328; 93.986

తెంగ్‌నౌపల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెంగ్‌నౌపల్
తెంగ్‌నౌపల్ is located in Manipur
తెంగ్‌నౌపల్
తెంగ్‌నౌపల్
భారతదేశంలోని మణిపూర్ లో ప్రాంతం ఉనికి
తెంగ్‌నౌపల్ is located in India
తెంగ్‌నౌపల్
తెంగ్‌నౌపల్
తెంగ్‌నౌపల్ (India)
Coordinates: 24°19′41″N 93°59′10″E / 24.328°N 93.986°E / 24.328; 93.986
రాష్ట్రంమణిపూర్
జిల్లాతెంగ్‌నౌపల్
Elevation
1,450 మీ (4,760 అ.)
జనాభా
 (2011)
 • Total2,158
భాషలు
 • అధికారికకుకి
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
795131
Vehicle registrationఎంఎన్

తెంగ్‌నౌపల్, మణిపూర్ రాష్ట్ర తెంగ్‌నౌపల్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.[1] ఇంఫాల్, వాయువ్య మయన్మార్ (బర్మా) మధ్య రహదారి ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఒక కొండ పట్టణం ఇది. ఈ పట్టణం మీదుగా ఏసియాన్ హైవే వెళుతుంది. ఏడాది పొడవునా ఇక్కడ వాతావరణం చల్లగా, వర్షాకాలంలో పొగమంచుగా ఉంటుంది.

చరిత్ర

[మార్చు]

1942లో రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఈ పట్టణంపై బాంబు దాడి చేసింది. ఇది సైనిక ప్రధాన కేంద్రంగా మిగిలిపోయింది. 1960, 1970లలో జిల్లా ప్రధాన కార్యాలయంగా ఉండేది. 1974లో చందేల్‌ పట్టణానికి మార్చారు.

రాజకీయ/పరిపాలన

[మార్చు]

ఈ పట్టణంలో కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు:

  1. డిప్యూటీ కమిషనర్/జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం
  2. పోలీసు కార్యాలయ సూపరింటెండెంట్
  3. జిల్లా ఆసుపత్రి
  4. అటవీ శాఖ కార్యాలయం
  5. 1994 నుండి అస్సాం రైఫిల్స్ బెటాలియన్ ప్రధాన కార్యాలయం
  6. తెంగ్‌నౌపల్ పోలీస్ స్టేషన్
  7. జోర్నల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్
  8. జిల్లా ప్రజా పనుల శాఖ
  9. చీఫ్ మెడికల్ ఆఫీస్

1973, మే 13 వరకు చందేల్ జిల్లాను గతంలో తెంగ్‌నౌపల్ జిల్లాగా పిలిచేవారు .

భౌగోళికం

[మార్చు]

తెంగ్‌నౌపల్ గూండా 2 జాతీయ రహదారి మార్గాలు, తూర్పు నుండి పడమర ఉన్నాయి. ఇది ఇంఫాల్ నగరానికి 69 కి.మీ.ల దూరంలో ఉంది. తులిహాల్ విమానాశ్రయం ఇక్కడికి సమీప విమానాశ్రయం. ఇది ఇంఫాల్-మోరే హైవేపై సముద్ర మట్టానికి ఎత్తైన ప్రదేశంలో ఉంది.

జనాభా

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో 300 గృహాలు ఉన్నాయి, 2,158 జనాభా ఉంది. ఇందులో 1,477 మంది పురుషులు కాగా, 681 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం జనాభాలో 140 (6.49%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. పట్టణ స్త్రీ పురుష నిష్పత్తి 461 కాగా, ఇది మణిపూర్ రాష్ట్ర సగటు 992 కన్నా తక్కువగా ఉంది. పట్టణ అక్షరాస్యత 76.02% కాగా, ఇది రాష్ట్ర సగటు 79.21% కంటే తక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 84.75% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 56.36% గా ఉంది.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Tengnoupal Village Population - Tengnoupal - Chandel, Manipur". www.census2011.co.in. Retrieved 2021-01-10.

ఇతర లంకెలు

[మార్చు]