తిమింగలము
తిమింగలాలు Temporal range: Early Eocene - Recent
| |
---|---|
Humpback Whale breaching | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Infraclass: | |
Superorder: | |
Order: | సిటేసియా Brisson, 1762
|
Suborders | |
Mysticeti | |
Diversity | |
[[List of cetaceans|Around 88 species; see list of cetaceans or below.]] |
తిమింగలము (ఆంగ్లం Whale) వెచ్చటి రక్తాన్ని కలిగిన నీటిలో నివసించే ఒక పెద్ద క్షీరదము. చాలాకాలం పూర్వమే సముద్ర ప్రయాణం చేస్తున్న నావికులు భారీ శరీరం, బలమైన తోక కలిగిన ఈ సముద్ర జీవిని గుర్తించడం జరిగింది. వీటిని అమెరికా అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఒకటిగా చేర్చింది. 19, 20 వ శతాబ్దాల్లో తిమింగల వేటగాళ్ళు విపరీతంగా వీటిని వేటాడటంతో ఈ పరిస్థితి నెలకొన్నది..[1] మానవుల్లాగే ఇవి కూడా క్షీరదాలు కావడంతో శ్వాసించడానికి కావల్సిన ఆక్సిజన్ కోసం నీటి ఉపరితలంపైకి వస్తాయి.
పరిణామం, వర్గీకరణ
[మార్చు]సిటేసియా (Cetacea) జీవులు అన్నీ భూమి మీద నివసించే క్షీరదాలైన ఆర్టియోడాక్టిలా క్రమానికి చెందిన జీవుల నుండి పరిణామం చెందాయి. ప్రస్తుతం తిమింగలాలు, హిప్పోపొటమస్ ఈ రెండింటినీ సిటార్టియోడాక్టిలా (Cetartiodactyla) అధిక్రమంలో వర్గీకరించారు. నిజానికి హిప్పోలకు అతి దగ్గరి బంధువులు తిమింగలాలు. ఇవి రెండూ సుమారు 54 మిలియన్ సంవత్సరాల క్రితం ఒకే జంతువు నుండి పరిణామం చెందాయని శాస్త్రజ్ఞుల భావన.[2][3] తిమింగలాలు సుమారు 50 మిలియన్ సంవత్సరాల క్రితం నీటిలో ప్రవేశించాయి.[4]
సిటేసియా జీవుల్ని రెండు ఉపక్రమాలుగా విభజించారు:
- బెలీన్ తిమింగలాలు (Baleen whales): వీటికి బెలీన్ అనే కెరటిన్ తో చేయబడిన జల్లెడ వంటి నిర్మాణము పైదవడకు అమరివుంటుంది. దీని సహాయంతో ప్లాంక్టన్లను నీటి నుండి వడపోస్తుంది.
- దంతపు తిమింగలాలు (Toothed whales): వీటికి దంతాలు ఉంటాయి. వీని సహాయంతో చేపలు, స్క్విడ్లు మొదలైన పెద్ద చేపల్ని ఆహారంగా తీసుకుంటుంది. పరిసరాల్ని శబ్ద తరంగాల ద్వారా స్కానింగ్ చేయడం వీని లక్షణం.
తిమింగలాల వేట
[మార్చు]తిమింగిలాల వేటను వేలింగ్ (Whaling) అంటారు. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు, వివిధ ప్రభుత్వాలు తిమింగలాలు అంతరించిపోతున్న విషయాన్ని గుర్తించాయి. 16వ శతాబ్దం నుండి 20వ శతాబ్దపు మధ్యకాలం వరకు జరిపిన ఈ వేలింగ్ కు ప్రధానమైన కారణం వీటినుండి లభించే నూనె, మాంసం, కొన్ని సుగంధద్రవ్యాలు తయారీ కోసం చంపుతారు.[5]
అంతర్జాతీయ వేలింగ్ కమిషన్ (International Whaling Commission) 1986 సంవత్సరంలో వేలింగ్ పై ఆరు సంవత్సరాల నిషేధాన్ని విధించింది; ఇది ఈ నాటికీ కొనసాగుతుంది.
కొన్ని జాతుల చిన్న తిమింగలాలు ఇతర చేపల వలల్లో చిక్కుకొంటాయి. ముఖ్యంగా టూనా చేపల కోసం వేటాడే వారికి ఇవి లభిస్తాయి. కొన్ని దేశాలలో ఇప్పటికీ తిమింగలాల వేట కొనసాగుతునే ఉన్నది.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-02-14. Retrieved 2009-02-17.
- ↑ Northeastern Ohio Universities Colleges of Medicine and Pharmacy (2007, December 21). "Whales Descended From Tiny Deer-like Ancestors". ScienceDaily. Retrieved 2007-12-21.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Dawkins, Richard (2004). The Ancestor's Tale, A Pilgrimage to the Dawn of Life. Boston: Houghton Mifflin Company. ISBN 0-618-00583-8.
- ↑ "How whales learned to swim". BBC News. 2002-05-08. Retrieved 2006-08-20.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-02-13. Retrieved 2009-02-17.
బయటి లింకులు
[మార్చు]- WikiAnswers: questions and answers about whales
- Whale Evolution
- Greenpeace work defending whales
- Save the Whales, founded in 1977
- AquaNetwork Marine Mammal Project
- Oldest whale fossil confirms amphibious origins
- Research on dolphins and whales from Science Daily
- Whale and Dolphin Conservation Society - latest news and information on whales and dolphins
- The Oceania Project - Caring for whales and dolphins
- Whales Tohorā Exhibition Minisite from the Museum of New Zealand Te Papa Tongarewa
- Whales in Te Ara the Encyclopedia of New Zealand
- Orca and other whales video at Squid Force