Jump to content

వల

వికీపీడియా నుండి
కొచ్చిన్ లోని చైనా వలలు

వల లేదా జాలము (ఆంగ్లం Net) అనగా దారముతో అల్లిన జాలి. వీటిని జల్లెడ మాదిరిగా ఉపయోగిస్తారు.

  • జాలరి వారు చేపలు పట్టడానికి వలల్ని ఉపయోగిస్తారు. వీటిన్ చేపల వల అంటారు.
  • కొన్ని ఆరుబయట ఆడే హాకీ, క్రికెట్ మొదలైన ఆటలలో గోల్ పోస్ట్ లో పెద్ద పెద్ద వలల్ని ఉపయోగించి బంతిని ఆపుతారు.

భాషా విశేషాలు

[మార్చు]

తెలుగు భాషలో వల పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] వల నామవాచకంగా A net. జాలము అని అర్ధం. ఉదా: "వల యెత్తి నీటిలో నేయంగ." నీ వలను జిక్కి నిన్నే తలంచు." ఇది కాక వలపు, Love, కామము అని కూడా అర్ధమున్నవి. వలకాక n. Amorous desire, మన్మధతాపము. (క్షేత్రయ.) వలకాడు n. A lover. కాముకుడు. వలకారి n. One who causes another to fall in love. వలపించువాడు, లేక వలపించునది. వలకారితనము n. అనగా Prettiness, gracefulness. శృంగారభావము. ఉదా: "అలవోకగా వచ్చి యప్పటప్పటికి సమేలంపు మాటల మేలమాడు, పలుమారు తన మ్రోలకలికి సేతల తోడి వలకారితనమున వన్నె బెట్టు, అన్యాపదేశంబు లాడి నెచ్చెలుచే బ్రియమారనేమేని బెట్టిపంపు." వలకారివగలు n. Airs, graces, pretty ways or gestures. వన్నెలాడి టక్కులు. వలదొర, వలరాజు, వలరాయడు or వలరేడు n. అనగా A name of Manmatha, the Hindu Cupid. మన్మథుడు. వలవంత or వల్వంత n. Amorous desire, మన్మథ వ్యధ. Emotion, passion, grief, affliction, misery, మనోవ్యధ, దుఃఖము, పరితాపము. ఉదా: "ఆత్మవత్సర్వభూతాని యనుట బొంకె, ముద్దియలకైన వలవంత ముచ్చటలను, నాటపాటల గతుల గొంతడచుగాని, నోరులేని జంతువులకె నొప్పి ఘనము", "శోకవిషణ్న మానసాంభోరుహలై పథంబు గొని పోయెదరివ్వలవంత మీకునే కారణ జాతమయ్యె."

వల (వలను) adj. విశేషణంగా Right, కుడి అని కూడా అర్ధమున్నది. ఉదా: వలచేయి or వలకేలు the right hand. "అరుదుగా వలచేతన క్షమాలికయు.", "వలకేల్దల క్రింద జేర్చుకొని." వలకట్టు (వలను+కట్టు.). a. అనగా To make a thing convenient, అనుకూల పరుచు. వలకడ (వలను+కడ.) n. The South side. దిక్షిణపు దిక్కు. వలగొను (వలను+కొను), వలచుట్టు (వలను+చుట్టు) or వలదిరుగు v. n. To walk round, circumambulate, The act of walking round anything. ప్రదక్షిణము చేయు, చుట్టుకొను. ఉదా: "వదాన్య మహీరుహ సార్వభౌమునిన్ వలగొని మ్రొక్కి."

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వల&oldid=2951606" నుండి వెలికితీశారు