జోరు (2014 సినిమా)
స్వరూపం
జోరు | |
---|---|
దర్శకత్వం | కుమార్ నాగేంద్ర |
రచన | కుమార్ నాగేంద్ర |
నిర్మాత | అశోక్, నాగార్జున్ |
తారాగణం | సందీప్ కిషన్, రాశీ ఖన్నా, ప్రియా బెనర్జీ, సుష్మా రాజ్ |
ఛాయాగ్రహణం | ఎం.ఆర్. పలని కుమార్ |
కూర్పు | ఎస్.ఆర్. శేఖర్ |
సంగీతం | భీమస్ సెసిరోలె |
నిర్మాణ సంస్థ | శ్రీ కీర్తి ఫిల్మ్మ్ |
విడుదల తేదీ | నవంబరు 7, 2014 |
సినిమా నిడివి | 140 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జోరు 2014, నవంబరు 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో సందీప్ కిషన్, రాశీ ఖన్నా, ప్రియా బెనర్జీ, సుష్మా రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి భీమస్ సెసిరోలె సంగీతం అందించాడు.[1]
కథ
[మార్చు]విశాఖపట్నం ఎమ్మెల్యే సదాశివం (సాయాజీ షిండే). అతని కుమార్తె (రాశీ ఖన్నా) అమెరికా నుంచి వస్తుంది. ఆమె కిడ్నాప్‌కు గురయ్యే టైంలో సందీప్ (సందీప్ కిషన్) రక్షిస్తాడు. తన వెంట తీసుకువెళతాడు. ఆ క్రమంలో ఆమె తండ్రి గురించి ఒక నిజం తెలుస్తుంది. అప్పుడు హీరోయిన్ స్థానంలో మరొకర్ని ప్రవేశపెట్టి, హీరో ఆడిన నాటకమేంటి? అదెలా ముగిసిందన్నది సినిమా.[2]
నటవర్గం
[మార్చు]- సందీప్ కిషన్ (సందీప్)
- రాశీ ఖన్నా (అన్నపూర్ణ "అను")
- ప్రియా బెనర్జీ (పూర్ణ)
- సుష్మా రాజ్ (శృతి)
- బ్రహ్మానందం (పెళ్ళికొడుకు "పికె")
- షాయాజీ షిండే (ఎమ్మెల్మే సదాశివన్/ను తండ్రి (ద్విపాత్రాభినయం)
- సప్తగిరి (నామాలు)
- అజయ్ (భవాని)
- అన్నపూర్ణ (అను నానమ్మ)
- పృథ్వీరాజ్ (సందీప్ తండ్రి)
- హేమ (శృతి తల్లి)
- కాశీ విశ్వనాథ్ (శృతి తండ్రి)
- సత్యం రాజేష్ (సిద్ధార్థ రాజు)
- ఫిష్ వెంకట్ (పికె అసిస్టెంట్)
సాంకేతికవర్గం
[మార్చు]- రచన, దర్శకత్వం: కుమార్ నాగేంద్ర
- నిర్మాత: అశోక్, నాగార్జున్
- సంగీతం: భీమస్ సెసిరోలె
- ఛాయాగ్రహణం: ఎం.ఆర్. పలని కుమార్
- కూర్పు: ఎస్.ఆర్. శేఖర్
- నిర్మాణ సంస్థ: శ్రీ కీర్తి ఫిల్మ్మ్
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి, వనమాలి, భీమ్స్ సిసిరోలియో రాయగా, భీమస్ సెసిరోలె సంగీతం అందించాడు. 2014, అక్టోబరు 6న హైదరాబాదులో పాటలు విడుదల అయ్యాయి.[3][4]
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "మనసా" | సునీల్ కశ్యప్ | 3:53 | ||||||
2. | "పువ్వులకు రంగెయ్యాల" | శ్రేయ ఘోషాల్ | 4:26 | ||||||
3. | "హవ్వాయి తవ్వాయి" | హేమచంద్ర | 4:10 | ||||||
4. | "కోడంటే కోడి" | భీమస్ సెసిరోలె,భార్గవి పిళ్ళై | 3:45 | ||||||
5. | "జోరు" | రాశీ ఖన్నా | 2:48 | ||||||
19:02 |
మూలాలు
[మార్చు]- ↑ The Hindu, Reviews (7 November 2014). "Joru: Slapstick merry go round". Sangeetha Devi Dundoo. Archived from the original on 9 July 2018. Retrieved 20 June 2019.
- ↑ సాక్షి, సినిమా (8 November 2014). "సినిమా రివ్యూ: జోరు". రెంటాల జయదేవ. Archived from the original on 17 March 2015. Retrieved 20 June 2019.
- ↑ "Joru Movie Audio Launch Full Programme". Youtube. 3 January 2017.
- ↑ "Gulte". 3 January 2017.[permanent dead link]