ప్రియా బెనర్జీ
స్వరూపం
ప్రియా బెనర్జీ | |
---|---|
జననం | ప్రియా బెనర్జీ ఏప్రిల్ 16, 1990 |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2013–ప్రస్తుతం |
ప్రియా బెనర్జీ భారతీయ సినిమా నటి, మోడల్.[1][2][3] 2013లో తెలుగులో వచ్చిన కిస్ సినిమాలో తొలిసారిగా నటించిన ప్రియా బెనర్జీ హిందీ, తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.
జననం - విద్యాభ్యాసం
[మార్చు]ప్రియా బెనర్జీ తండ్రి చాలా సంవత్సరాల క్రితం కలకత్తా నుండి వెళ్ళి కెనడాలో ఇంజనీరుగా స్థిరపడ్డాడు. 1990, ఏప్రిల్ 16న కెనడాలో జన్మించిన ప్రియా బెనర్జీ, 2012లో అంతర్జాతీయ మార్కెటింగ్ విభాగంలో డిగ్రీతో పాటు, కంప్యూటర్ సైన్స్ కూడా చేసింది.
సినీరంగం
[మార్చు]చిన్నతనం నుండి నటనపై ఆసక్తి పెంచుకున్న ప్రియా, నటిగానే స్థిరపడాలనుకుంది. 2011లో మిస్ వరల్డ్ కెనడాగా ఎంపికైంది. డిగ్రీ పూర్తైన తరువాత ముంబాయికి వచ్చి మూడు నెలలపాటు నటనలో శిక్షణ తీసుకుంది. అటుతరువాత కొన్నిరోజులు ప్రచారచిత్రాలు (యాడ్స్) లో నటించింది. ప్రచారచిత్రాల్లో ప్రియాను చూసిన అడవి శేషు కిస్ సినిమాకు తీసుకున్నాడు.[4][5]
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్రపేరు | భాష |
---|---|---|---|
2013 | కిస్ | ప్రియ | తెలుగు |
2014 | జోరు[6] | పూర్ణ | |
అసుర | హారిక | ||
2015 | జబ్బా | అనయ | హిందీ |
2016 ది ఎండ్ | శీతల్ | ||
2017 | దిల్ నా కె సకా | సియా | |
2017 | సోషల్ | మైరా | హిందీ |
2018 | రెయిన్ | బర్ఖా | |
2019 | చిత్రం పెసుతది 2 | నందిత | తమిళం |
బెకాబు (వెబ్ సిరీస్) | కస్తి | హిందీ | |
3 దేవ్ | వాణి | ||
హమే తుమ్సే ప్యార్ కిత్నా[7] † |
మూలాలు
[మార్చు]- ↑ "Priya Banerjee: I am nervous about KISS". Rediff.
- ↑ "From Canada to Tollywood: Priya Banerjee - Times of India". The Times of India.
- ↑ "Tollywood actresses go international - Times of India". The Times of India.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-06-23. Retrieved 2019-06-11.
- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (23 June 2015). "నా కల నిజమాయెగా... సినీనటి ప్రియా బెనర్జీ". Retrieved 11 June 2019.[permanent dead link]
- ↑ The Hindu, Reviews (7 November 2014). "Joru: Slapstick merry go round". Sangeetha Devi Dundoo. Archived from the original on 9 July 2018. Retrieved 20 June 2019.
- ↑ "Priya Banerjee and Karanvir Bohra in 'Humein Tumse Pyar Kitna'". The Times of India. 18 May 2016. Retrieved 10 June 2019.