ఛాయాదేవి (బెంగాలీ నటి)
స్వరూపం
ఛాయా దేవి | |
---|---|
జననం | కనకలతా గంగూలీ 1914 |
మరణం | ఏప్రిల్ 27, 2001 |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1930లు - 1980లు |
ఛాయా దేవి (1914 - ఏప్రిల్ 26, 2001) గా సినిమా తెరపై పరిచయమైన కనకలతా గంగూలీ అలనాటి బెంగాళీ చలనచిత్ర నటి. ఈమె 15 యేళ్ల ప్రాయములో జ్యోతిష్ బంధోపాధ్యాయ దర్శకత్వము వహించిన పథేర్ శేషే చిత్రముతో సినీరంగ ప్రవేశము చేసింది.[1] ఈమె బెంగాళీ, హిందీ, తమిళ్ , తెలుగు భాషలలో 150 పైగా చిత్రాలలో నటించింది. 1936లో విడుదలైన దేబకీ బోస్ చిత్రం సోనేర్ సంసార్ కథానాయకిగా ఈమె తొలిచిత్రం.[2] ఈమె నటే కాక మంచి నర్తకి, గాయని కూడా. 1930వ దశకములో తను నటించిన చాలా సినిమాలలో తనే పాటలు పాడినది. తపన్ సిన్హా చిత్రము, అఫోన్ జాన్ చిత్రములో ఛాయా దేవి పాత్రకు రాష్ట్రపతి పురస్కారము లభించింది. ఈమె హిందీ చలనచిత్ర నటుడు అశోక్ కుమార్ యొక్క పినతండ్రి కూతురు. ఛాయా దేవి, 2001 ఏప్రిల్ 26న మెదడు వాపు, న్యుమోనియాతో కలకత్తాలో మరణించింది.
సినిమాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ రిడిఫ్ లో మరణవార్త
- ↑ "అప్పర్‌స్టాల్.కాం లో ఛాయాదేవిపై వ్యాసము". Archived from the original on 2014-04-05. Retrieved 2020-01-07.