చౌదరి తేజేశ్వరరావు
కామ్రేడ్ చౌదరి తేజేశ్వరరావు | |
---|---|
జననం | 1933 (age 91–92) ఎస్.ఎమ్.పురం, శ్రీకాకుళం జిల్లా |
జాతీయత | భారతీయులు |
ఇతర పేర్లు | సి.టి.ఆర్. |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | గిరిజన సాయుధ పోరాటం, నక్సల్బరీ ఉద్యమం |
రాజకీయ పార్టీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా - మార్క్సిస్ట్ (CPM) |
ఉద్యమం | శ్రీకాకుళం సాయుధ పోరాటం, నక్సల్బరీ ఉద్యమం |
జీవిత భాగస్వామి | సంపూర్ణమ్మ |
పిల్లలు | 2 |
తల్లిదండ్రులు |
|
చౌదరి తేజేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉద్యమ పోరాట యోధులు. పార్వతీపురం కుట్ర కేసులో మొదటి ముద్దాయి.
జీవిత విశేషాలు
[మార్చు]చౌదరి తేజేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభ్యులు, స్వాతంత్ర్య సమరయోధులు చౌదరి సత్యనారాయణ, సరస్వతమ్మ దంపతులకు ద్వితీయ సంతానంగా జన్మించారు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సి.పి.ఐ. (ఎమ్.ఎల్.) మొట్టమొదటి కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంలో నక్సలైట్ ఉద్యమానికి ఆధ్యులు. 14 సంవత్సరాలు జీవిత ఖైదు శిక్ష అనుభవించారు. జైలు జీవితం అనంతరం సి.పి.ఎమ్ లో కొనసాగుతున్నారు.
శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాట ఉద్యమంలో వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, నాగభూషణ పట్నాయక్, తామాడ గణపతి, సుబ్బారావు పాణిగ్రాహి, మామిడి అప్పలసూరి వంటి కమ్యూనిస్టు నాయకులతో పాటు నాయకత్వం వహించారు. ఈ క్రమంలో 1967 అక్టోబరు 31వ తేదీన ప్రస్తుత కురుపాం మండలం మొండెంఖల్ గ్రామంలో భూస్వాములకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ సభను ఏర్పాటు చేసింది.[1]
బెంగాల్ లోని నక్సల్బరీ నాయకుడైన చారు మజుందార్తో పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వరరావు లాంటివారు ప్రత్యక్ష సంబంధాలను ఏర్పరచుకున్నారు. కొంతమంది నాయకులు దీనిని వ్యతిరేకించినా శ్రీకాకుళం ఉద్యమ నాయకులు దీనికి మొగ్గు చూపారు.[2]
గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పల్లె రాములు, వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం లతో పాటు పోరాటాలు నడిపారు. మొదట వెట్టికి వ్యతిరేకంగా, కూలి కోసం గిరిజన సంఘం పెట్టి పోరాటాలు చేశారు. ఈ పోరాటంలో 385 మంది ప్రభుత్వ తుపాకీ కాల్పుల్లో మరణించారు. వందలాది పోరాట యోధులు జైలుపాలయ్యారు. చౌదరి తేజేశ్వరరావు ఈ క్రమంలో 14 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించారు. ఆయన జీవిత సహచరి చౌదరి సంపూర్ణమ్మ కూడా ఉద్యమంలో పాల్గొని భర్తతో పాటు 6 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవిచారు. ఆ పోరాటానికి జడిసి ప్రభుత్వం 1/70 చట్టం చేసింది. ఏజెన్సీ ప్రాంతంలో భూస్వాములు కాజేసిన భూమిని కొన్ని గ్రామాల్లో గిరిజనులకు స్వాధీనం చేసింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". m.andhrajyothy.com. Archived from the original on 2021-04-18. Retrieved 2021-04-18.
- ↑ "1956 - 2014 మధ్య ముఖ్య సంఘటనలు". www.eenadupratibha.net. Archived from the original on 2021-04-18. Retrieved 2021-04-18.
- ↑ "మంత్రి గారు మాట మరిచారా ! | Prajasakti". www.prajasakti.com. Retrieved 2021-04-18.