గాయం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గాయం
గాయం సినిమా డివిడి కవర్
దర్శకత్వంరామ్ గోపాల్ వర్మ
రచనపోసాని కృష్ణమురళి (మాటలు)
స్క్రీన్ ప్లేరామ్ గోపాల్ వర్మ
కథరామ్ గోపాల్ వర్మ
మణిరత్నం
నిర్మాతయార్లగడ్డ సురేంద్ర
తారాగణంజగపతి బాబు
ఊర్మిళా మండోద్కర్
రేవతి
ఛాయాగ్రహణంరసూల్ ఎల్లోర్
కూర్పుశంకర్
సంగీతంశ్రీ
నిర్మాణ
సంస్థ
ఎస్.ఎస్. క్రియేషన్స్
విడుదల తేదీ
22 ఏప్రిల్ 1993 (1993-04-22)
సినిమా నిడివి
136 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

గాయం 1993, ఏప్రిల్ 22న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్.ఎస్. క్రియేషన్స్ పతాకంపై యార్లగడ్డ సురేంద్ర నిర్మాణ సారథ్యంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతి బాబు, ఊర్మిళా మండోద్కర్, రేవతి నటించగా శ్రీ సంగీతం అందించాడు.[1] 1980లలో విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్ఫేర్ ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రానికి మణిరత్నం రచన సహకారం అందించాడు. విడుదలైన తరువాత ఈ చిత్రం, మంచి స్పందనతోపాటు ఆరు నంది అవార్డులు అందుకుంది, బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.[2]

కథా నేపథ్యం

[మార్చు]

దుర్గా (జగపతి బాబు) అనిత (రేవతి) తో ప్రేమించుకుంటారు. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుని జీవితంలో స్థిరపడాలనుకుంటారు. కాని దుర్గా అన్న మోహన కృష్ణ (చరణ్ రాజ్) మాఫియా గొడవల్లో స్థానిక ఎమ్మెల్యే గురు నారాయణ్ (కోట శ్రీనివాస రావు) చేత చంపబడుతాడు. దాంతో దుర్గా జీవితం మారిపొతుంది. అతని మార్గాన్ని అంగీకరించని అనిత ఒక పోలీసును వివాహం చేసుకుంటుంది. దుర్గా, పోలీసు ఇద్దరూ గురు నారాయణ్‌కు శత్రువులు అవుతారు. దుర్గా, సర్కార్, ఇన్స్పెక్టర్ల మధ్య గొడవలు వచ్చి చివరకు గురు నారాయణ్ చంపబడుతాడు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
గాయం
పాటలు by
శ్రీ
Released1993
Recorded1993
Genreపాటలు
Length25:45
Labelసూర్య ఆడియో
Producerశ్రీ

ఈ చిత్రానికి శ్రీ (సంగీత దర్శకులు) సంగీతం అందించగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశాడు. అన్ని పాటలు విజయవంతమయ్యాయి. సూర్య ఆడియో కంపెనీ పాటలను విడుదల చేసింది.

సం.పాటగాయకులుపాట నిడివి
1."నైజాం పోరి"మనో, కె. ఎస్. చిత్ర, ఈశ్వర్5:20
2."నిగ్గదీసి అడుగు"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం2:06
3."అలుపన్నది ఉందా"చిత్ర5:41
4."సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ"ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం4:56
5."చెలిమీద చిటికెడు"మనో చిత్ర6:59
మొత్తం నిడివి:25:45

అవార్డులు

[మార్చు]
నంది అవార్డులు

ఇతర వివరాలు

[మార్చు]

ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించిన తరువాత రామ్ గోపాల్ వర్మ,జగపతిబాబు కాంబినేషన్‌లో గాయం-2 పేరుతో సీక్వెల్ విడుదల చేయాలని ప్లాన్ చేశారు. రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా, ప్రవీణ్ శ్రీ దర్శకుడిగా, విమలా రామన్ హీరోయిన్‌గా కోట శ్రీనివాస రావు విలన్‌గా సినిమా తీశారు.

మూలాలు

[మార్చు]
  1. "Jagapathi to do 'Gaayam-2'". IndiaGlitz. 28 November 2009. Retrieved 4 August 2020.
  2. "Retrospect: Gaayam (1993)". Telugu Cinema. Archived from the original on 3 అక్టోబరు 2011. Retrieved 4 ఆగస్టు 2020.

ఇతర లంకెలు

[మార్చు]