Jump to content

ఖోరాన్

వికీపీడియా నుండి
(ఖురాన్‌ నుండి దారిమార్పు చెందింది)
వ్యాసముల క్రమము


ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు, చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర, ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి, సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం, ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం

ఒక పవిత్ర ఖుర్‌ఆన్ గ్రంథం ముఖచిత్రం 'అల్-ఖుర్‌అన్ అల్-కరీమ్'

ఖురాన్ : కురాన్, ఖొరాన్, ఖుర్‌ఆన్, ఖొర్ఆన్, కొరాన్ అనే పేర్లతో కూడా పిలుస్తారు.

  • కురాన్ అరబ్బీ భాషలో అల్లాహ్ (దేవుడు) ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం - ఆయనపై శాంతి సౌభాగ్యాలు వర్షించుగాక). ప్రవక్త ద్వారా మానవాళికి పంపిన ఇస్లాం మతము యొక్క చివరి పవిత్ర గ్రంథము. ఖుర్ఆను గ్రంథం దాదాపు 1400 సంవత్సరాలకు పూర్వం కారుణ్యమూర్తి మహాప్రవక్త మహమ్మద్ (స)పై రమజాను మాసంలో అవతరించింది. దాదాపు ఇరవైమూడు సంవత్సరాల సుదీర్ఘమైన కాలంలో ఈ గ్రంథం మానవుల అవసరాలకు, ఆ కాల పరిస్థితులకు అనుగుణంగా సందేశాలను మోసుకొచ్చింది.

[1] [2] [3],[4][5] అరబ్బీ భాషలో 'ఖుర్ ఆన్' అనగా 'చదువుట','వల్లె వేయుట','మాటిమాటికి చదివే' గ్రంథం అని అర్ధము.

నేను మీదగ్గర రెండు వస్తువులు వదలిపెట్టి పోతున్నాను. ఈ రెండింటిని దృఢంగా పట్టుకొని ఆచరించేవారు ఎన్నటికీ దారి తప్పలేరు. వాటిలో ఒకటి దైవగ్రంథం (ఖుర్‌ఆన్). రెండవది నా ప్రవచనాలు, సంప్రదాయాలు (హదీసులు) - మహాప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం - ఆయనపై శాంతి సౌభాగ్యాలు వర్షించుగాక).

ముసల్మానుల నమ్మకము ప్రకారము దేవుని సందేశాలు మొదటి ప్రవక్తయైన ఆదమ్తో ప్రాంభింపబడి, షుహుఫ్ ఇ ఇబ్రాహిమ్, [6] తోరాహ్ (మోషే ధర్మశాస్త్రము, పాతనిబంధన ),[7][8], జబూర్ (దావీదు కీర్తనలు),[9][10], ఇంజీల్ (క్రీస్తు సువార్త), వంటివానితో కొనసాగింపబడి, చివరకు మహమ్మదు ప్రవక్తకు తెలుపజేయబడిన ఖురాన్‌తో ముగిసినవి. పైన చెప్పిన గ్రంథాలలోని వివిధ సందేశాలను ఖుర్‌ఆన్ గుర్తిస్తుంది.[11] [12] [13]. యూదు, క్రైస్తవ గ్రంథాలలోని వివిధ ఘటనలు ఖొరాన్‌లో ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని, కొంత భేదాలతోగాని ప్రస్తావించబడ్డాయి.ఖుర్‌ఆన్ యొక్క సాధికారతను ఖొరానే స్పష్టంగా చెప్పింది. మిగిలిన విషయాన్ని ఇప్పుడు తెలియజేశాము. దీనికి రక్షణకూడా నిశ్చయంగా మేమే అని.[14][15]

ఈ ఖుర్ఆను గ్రంథం ఖలీఫా ఉమర్‌బిన్ ఖత్తాబ్ (ర) చేతుల్లోకి రాగానే ఆయన హృదయంలో ఆవరించి ఉన్న కారుచీకట్లు తొలగిపోయాయి. నిజమైన ఇస్లామీ చైతన్యస్ఫూర్తి ఆయనకు కలిగింది. ఆయన 'ఫారూఖె ఆజమ్' అనే బిరుదుతో అలంకృతులయ్యారు. ఈ ఖుర్ఆను గ్రంథం తన అనుయాయులకు పటిష్ఠమైన విశ్వాసాన్ని కలిగించింది. వారి హృదయాలు దైవభక్తితో పులకించిపోయాయి. ఆ గ్రంథం ద్వారా వ్యక్తమయ్యే ప్రతి ఆజ్ఞను వారు తు.చ. తప్పకుండా పాటించేవారు. 'ఓ ముస్లిములారా! రుకూ చేసేవారితో కలిసి మీరు కూడా రుకూ చెయ్యండి' అనే ఆజ్ఞ చెవుల్లో పడగానే వారు మసీదుల వైపు పరుగెత్తేవారు. 'వడ్డీని తీసుకోవద్దు, అది నిషిద్ధం' అనే ఆకాశవాణి విన్నంతనే వారి వడ్డీ వ్యాపారాలన్నీ మూతపడ్డాయి. 'మద్యపానం నిషిద్ధం' అనే దైవాజ్ఞ అవతరించగానే సారాయి కుండలన్నీ బద్దలైపోయాయి.

ఖురాను కు ఉన్న ఇతర పేర్లు

[మార్చు]

వ్యాసాల పరంపర ఖురాన్

ముస్‌హఫ్

సూరా · ఆయత్

ఖురాను పఠనం

తజ్వీద్ (ఉచ్ఛారణ) · హిజ్‌బ్ · తర్‌తీల్ · Qur'anic guardian · మంజిల్ · ఖారి · జుజ్ · రస్మ్ · రుకూలు · సజ్దాలు ·

భారతీయ భాషలలో ఖురాన్ అనువాదాలు

జాబితా

ఖురాన్ పుట్టుక, పరిణామం

మక్కాలో అవతరింపబడినవి  · మదీనాలో అవతరింపబదినవి

తఫ్సీర్

ఆయత్ ల సంబంధిత వ్యక్తులు · న్యాయం · అవతరణకు గల కారణాలు · నస్‌ఖ్ · బైబిలు కథనాలు · తహ్‌రీఫ్ · బక్కాహ్ · ముఖత్తాత్ · Esoteric interpretation

ఖురాన్, సున్నహ్

Literalism · మహిమలు · సైన్స్ · స్త్రీ

ఖురాన్ గురించి అభిప్రాయాలు

షియా · విమర్శ · Desecration · Surah of Wilaya and Nurayn · తనజ్‌జులాత్ · ఖససుల్ అంబియా · బీత్ అల్ ఖురాన్


కురాన్ కి ఉన్న ఇతర పేర్లు:

వరుస సంఖ్య
అరబ్బీ పేరు
అంటే అర్ధం
ఈ పేరున్న ఖురానువాక్యం కనీసం ఒకటి
1 కితాబ్ అల్లాహ్ గ్రంథం 2:2
2 కితాబ్-ఎ-ముబీన్ స్పష్టమైన ఆదేశాలు గలది 5:57
3 హుదా మార్గదర్శిని 2:120
4 ఫుర్‌ఖాన్ గీటురాయి 25:1
5 బుర్‌హాన్ ఆధారం, నిదర్శనం 4:174
6 మొయిజత్ హితోపదేశం 3:138
7 ముసద్దిఖ్ ధ్రువపచేది 5:46
8 బుష్రా శుభవార్త నిచ్చేది 17:105
9 హఖ్ సత్యం 10:108
10 జిక్రా జ్ఞాపకంవుంచుకొనేది 3:58
11 ఇల్మ్ జ్ఞానం 2:119
12 నూర్ వెలుగు 4:174
13 హకీం వివేచననిచ్చేది 36:1
14 ఇబ్రత్ గుణపాఠం నేర్పేది 12:111
15 రహ్మత్ కరుణగలది 6:157
16 బసాయిరున్ మనోనేత్రాలు తెరిచేది 28:43
17 షిఫా రోగనివారిణి, పిచ్చికుదిర్చేది 10:57, 17:82
18 ముఫస్సల్ సవివరమైనది 6:114
19 మీజాన్ ధర్మకాటా 42:17
20 ముహైమిన్ రక్షించేది 5:48
21 ఇమాం మార్గదర్శి, సారథి, నాయకుడు 16:89
22 మజీద్ మహిమ గలది 46:1
23 కరీం గౌరవప్రథమైనది, ఉన్నతమైనది 56:77
24 ఖురాన్ చదివేది 2.185
25 ముబీన్ స్పష్టమైనది 43.2
26 కలామల్లాహ్ అల్లాహ్ వాక్కులు (దేవుని మాటలు) 2.75
27 మౌవిజాహ్ హెచ్చరించేది 3.138
28 అలియ్యు ఉన్నతమైనది 43.4
29 ముబారక్ దీవెనకరమైనది 6.155
30 భయాన్ ప్రకటన 3.138
31 అజబ్ ఆశ్చర్యకరమైనది 72.1
32 తజ్కిరా బుద్ధిచెప్పేది 73.19
33 ఉర్వతిల్ ఉత్కా నమ్మకంగా నడిపించేది 31.22
34 సిద్క్ సత్యం 39.33
35 హిక్మా పనిచేసే జ్ఞానం 54.5
36 అదల్ కచ్చితమైనది 6.115
37 అమ్రుల్లాహ్ దేవుని ఆజ్ఞ 65.5
38 మునాది పిలిచేది 3.193
39 నజీర్ గెలిచేది 41.4
40 అజీజ్ అజేయమైనది 41.41
41 బలగ్ సందేశమిచ్చేది 14.52
42 సుహుఫిమ్ ముకర్రమ ఘనతగల గ్రంథాలు 80.13
43 మర్ఫువా గొప్పది 80.14
44 ముసద్దిఖ్ సాక్షి 2.89
45 బుర్హాన్ ఋజువు 4.174
46 ముహైమిన్ సంరక్షిణి 5.48
47 హబల్ అల్లాహ్ దేవుని త్రాడు 3.103
48 ఫజల్ ముగించేది 86.13
49 అహ్ సనుల్ హదీస్ అందమైన దైవ సందేశం 39.23
50 ఖయ్యీం తిన్ననిది 98.3
51 మథనీ సరిపడేది 39.23
52 ముత్షబీ అలంకారికమైనది 39.23
53 తంజీల్ బయలుపరచినది 56.80
54 రూహ్ ఆత్మ 42.52
55 వహీ దైవ సందేశం 21.45
56 హక్కుల్ యకీన్ స్థిరమైన సత్యం 56.95
57 అరబీ అరబ్బీలో వచ్చింది 12.2

అర్ధంకాని అరబ్బీ పారాయణం కంటే మాతృభాషలో అర్ధం చేసుకుంటూ చదవటం ఎంతో మేలు.

ఖుర్‌ఆన్ విభాగాలు

[మార్చు]

దస్త్రం:ఖుర్‌ఆన్ మొదటి అధ్యాయం ఫాతిహా. ఖొరాన్‌లో మొదటి ఉపోద్ఘాత ప్రార్థనా విభాగం తరువాత మొత్తం 114 సూరాలు (అధ్యాయాలు) ఉన్నాయి. మొత్తం సూక్తులు (ఆయత్ లు) 6236, మొత్తం పదాలు 86430, మొత్తం అక్ష రాలు 323760, మొత్తం ఖురాన్ అవతరించిన కాలం 22 సంవత్సరాల 5 నెలల 14 రోజులు, వ్రాసి భద్రపరచిన అనుచరులు (సహాబీలు)40 మంది. మక్కాలో వచ్చిన సూరాలు90, మదీనాలో వచ్చిన సూరాలు 24. ఖురాన్లో అల్లాహ్ పేరు 2697 సార్లు వస్తే ముహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం - ఆయనపై శాంతి సౌభాగ్యాలు వర్షించుగాక). అనే పేరు 4 సార్లు, అహ్మద్ అనే పేరు ఒక్క సారే వచ్చింది. హదీసుల ప్రకారం 1,24,000 (లక్షా ఇరవై నాలుగు వేల) ప్రవక్తలు అవతరించారు. ఖురానులో 25 ప్రవక్తల ప్రస్తావన ఉంది. అనగా ఖురానులో ప్రస్తావనకు రాని ప్రవక్తలు 1,23,975. మానవజాతి పుట్టుక ఆదమ్ ప్రవక్త నుండి మహమ్మద్(సల్లల్లాహు అలైహి వసల్లం - ఆయనపై శాంతి సౌభాగ్యాలు వర్షించుగాక). ప్రవక్త పుట్టుక మధ్యకాలంలో 1,23,998 ప్రవక్తలు అవతరించారు. ప్రతి యుగంలోనూ ప్రతి ఖండంలోనూ ప్రతి ప్రాంతంలోనూ ప్రతి జాతిలోనూ అల్లాహ్ ప్రవక్తలను అవతరింపజేశాడు. [16] మొదట్లో ఉన్న పెద్ద అధ్యాయాలలో మొహమ్మదు(సల్లల్లాహు అలైహి వసల్లం - ఆయనపై శాంతి సౌభాగ్యాలు వర్షించుగాక). తన చివరికాలంలో చెప్పిన ప్రవచనాలు ఉన్నాయి. చివరిలో ఉన్న చిన్న అధ్యాయాలలో మొహమ్మదుకు(సల్లల్లాహు అలైహి వసల్లం - ఆయనపై శాంతి సౌభాగ్యాలు వర్షించుగాక). తెలియజేయబడిన మొదటి సందేశాలున్నాయి. [17][18]

ఒక్కొక్క సూరాకు ఆ విభాగంలోని ప్రధాన విషయానికి సంబంధించిన శీర్షిక చెప్పబడింది.

హిజ్బ్ లేదా మంజిల్ విభాగాలు

[మార్చు]

మొదటి విభాగమైన సూరా అల్-ఫాతిహాను మినహాయించి మిగిలిన కొన్న్ని కొన్ని సూరాలను ఒక హిజ్బ్‌గా విభజించారు. 65 సూరాలు కలిగి ఉన్న ఏడవ హిజ్బ్ ను హిజ్బ్ ముఫాసిల్ అని కూడా అంటారు.

  • 1వ మంజిల్ = 3 సూరాలు (2 నుండి 4 వరకు)
  • 2వ మంజిల్ = 5 సూరాలు (5 నుండి 9 వరకు)
  • 3వ మంజిల్ = 7 సూరాలు (10 నుండి 16 వరకు)
  • 4వ మంజిల్ = 9 సూరాలు (17 నుండి 25 వరకు)
  • 5వ మంజిల్ = 11 సూరాలు (26 నుండి 36 వరకు)
  • 6వ మంజిల్ = 13 సూరాలు (37 నుండి 49 వరకు)
  • 7వ మంజిల్ = 65 సూరాలు (50 నుండి 114 వరకు)

ఖుర్‌ఆన్ ఆవిర్భావం

[మార్చు]
13వ శతాబ్దికి చెందిన ఒక ఖుర్‌ఆన్‌లో 33వ సూరా పేజీ

ప్రవక్తగా గుర్తింపబడడానికి ముందు ముహమ్మద్ తరచుగా మక్కా పట్టణం వెలుపల ఉన్న హీరా గుహలో దైవధ్యానంలో నిమగ్నుడై ఉండేవాడు. అప్పుడు ఆయనకు దైవదూత అయిన జిబ్రయీల్ (అలైహిస్సలాం - ఆయనకు శాంతి కలుగుగాక) కాంతిమయంగా కనపడి చదువు అని గంభీరమైన స్వరంతో అన్నారు. తనకు చదువురాదని ముహమ్మద్ చెప్పినా అదే ఆదేశం వినిపించింది. చకితుడైన మహమ్మదు ఇంటికి వచ్చి భార్య ఖదీజా (రజిల్లాహు అన్హు - తనపట్ల దేవుడు ప్రసన్నుడగుగాక) కు ఈ విషయం చెప్పాడు. ఆమె తన బంధువు వరఖా బిన్‌ నౌఫల్‌తో సంప్రదించి, ముహమ్మద్ ను ప్రోత్సహించింది. ఇలా ప్రారంభమయిన దైవ సందేశావతరణ 23 సంవత్సరాలు కొనసాగింది. అల్లాహ్ సందేశాలు అందుకొన్నపుడల్లా ముహమ్మద్ విచిత్రమైన అనుభూతికి లోనయ్యేవారు.

ముహమ్మద్ ప్రవక్త తనకు తెలియజేయబడిన సందేశాలను ప్రకటిస్తూ వుండగా ఆయన సహచరులు వాటిని విని తమకు ఏది అందుబాటులో ఉంటే దానిపై వ్రాశారు. రాసిన తరువాత లేఖకుడు ముహమ్మద్ కు అది చదివి వినిపించేవాడు. అదిగా సరిగా వ్రాశారని నిర్ధారించుకొన్న తరువాత దానిని భద్రపరచేవారు.

ఆదినుండి ఇస్లాం సంప్రదాయం ప్రకారం నమాజ్లో ఖుర్‌ఆన్ సూక్తులు పఠించడం వలన ఆ సూక్తులను పలువురు కంఠస్తం చేశారు. ఇక చదవడం, రాయడం వచ్చిన సహాబీలు (ప్రవక్త ప్రత్యక్ష అనుచరులు) వివిధభాగాలను స్వయంగా రాసుకొని దాచుకొనేవారు.

మహనీయుని నిర్యాణానంతరం ఆయన మొదటి ప్రతినిధి (ఖలీఫా) హజ్రత్ అబూబక్ర్ సిద్దీఖ్ (రజిల్లాహు అన్హు - తనపట్ల దేవుడు ప్రసన్నుడగుగాక) వివిధ ప్రాంతాలలో ఉన్న హాఫిజ్ అల్ ఖురాన్ (ఖుర్‌ఆన్ స్మర్త) లందరినీ రాజధానికి రావించి, జాయెద్ ఇబిన్ తాబిత్ అల్-అన్సారీ అధ్వర్యంలో ఖురాన్ ను ఒక ప్రామాణిక సంపూర్ణ గ్రంథంగా కూర్పించారు. 'ఆ ప్రతి అబూబక్ర్ వద్ద, అతని మరణానంతరం ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ వద్ద, అతని అనంతరం ఒమర్ కూతురు హఫ్సా బింతె ఉమర్ వద్ద ఉంది.[19] మూడవ ఖలీఫా హజ్రత్ ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ (రజిల్లాహు అన్హు - తనపట్ల దేవుడు ప్రసన్నుడగుగాక) పాలనా కాలంలో దాని ప్రతులు తీయించి అధికారికంగా రాజ్యాలలో వివిధ ప్రాంతాలకు పంపించారు. వాటిలో రెండు ప్రతులు ఈనాటికి కూడా లభ్యమౌతున్నాయి. ఖురాన్ ఆదినుండి ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా పరంపరాగతంగా తరతరాలుగా అందింపబడుతున్నది అని వివిధ పరిశోధనలద్వారా ధ్రువీకరింపబడింది.

అరబీ భాష, ఖురాన్

[మార్చు]

ఖుర్‌ఆన్ అవతరించిన అరబ్బీ భాష దాదాపు యాభయ్ కోట్ల మంది ప్రజలకు, 20 పైచిలుకు దేశాలలో మాతృభాషగా ఉంది. వ్యాకరణం, పదకోశం, ఉచ్చారణ, నుడికారాలు ఈ 1400 సంవత్సరాలలో స్థిరంగా ఉన్నందున ఆనాటి అరబ్బులలాగానే ఈనాడు అరబ్బీ భాష మాటలాడేవారు కూడా చదివి అర్ధం చేసుకోగలరు.

ఖురాన్ శైలి విశిష్టమైనదని సర్వత్రా గుర్తిస్తారు. అందులోని పదజాల సౌందర్యం వలన ఇది ప్రాసయుక్తమైన గద్యమని, గద్యరూపంలో ఉన్న పద్యమని వివిధ అభిప్రాయాలున్నాయి. ఇందులో పద్యానికి ఉండవలసిన లాక్షణిక నియతి ఏదీ లేకపోయినా భావగర్భితమైన పదబంధాలు, కవితా సృష్టిలోని నుడికారపు సొంపులు, పదాలంకరణలు మాత్రం ఉన్నాయి. అలాగే మరొకవైపు గద్యానికి వుండవలసిన భావగాంభీర్యం, భావ సమగ్రత, విషయానుశీలనం, వాక్యాల పటుత్వం కొట్టవచ్చినట్లు కన్పిస్తాయి. అయినా ఖురాన్ శైలి గ్రంథ రచనలా వుండదు. ఇది పూర్తిగా ప్రసంగ ధోరణిలో సాగుతుంది. ‍‌[20]

ఖుర్‌ఆన్ సవాలు

[మార్చు]

మహమ్మదీయుల విశ్వాసం ప్రకారం ఖుర్‌ఆన్‌లో చెప్పబడిన విషయం అద్భుత సత్యమవడమే కాదు. ఖుర్‌ఆన్ ఆవిర్భావమే ఒక అద్భుతం. ఇది స్వయంగా దైవవాణి. మనిషిచే రచింపబడే అవకాశమే లేదు.[21] ఈ విషయం నిరూపించడానికి ఖుర్‌ఆన్‌లోనే సవాలులు ఉన్నాయి.

  • "వారు ఖుర్‌ఆన్‌ను గురించి ఆలోచించరా? ఇది అల్లాహ్ వద్దనుండి గాక మరెవరివద్దనుండో వచ్చివుంటే ఇందులో ఎంతో భావవైరుధ్యం ఉండేది గదా?"—ఖురాను (4:82)
  • "మానవజాతి అంతా కలిసి తమ శక్తినంతా కలిపి ధారపోసినా ఇటువంటి గ్రంథాన్ని రచింపజాలరు -- ఖురాను (17:88)
  • ఒకవేళ మా దాసునిపై అవతరింపజేసిన ఈ గ్రంథం పట్ల మీకేమైనా అనుమానం ఉంటే, ఇందులో ఉన్నటువంటి ఓ అధ్యాయం రచించి తీసుకురండి. ఈ పనికోసం ఒక్క దేవుడ్ని వదలి మీ సహాయకులందరినీ పిలుచుకోండి. మీరు సత్యమంతులైతే ఈ పని చేసి చూపండి. మీరీ పని చేయలేకపోతే .... ఎంతమాత్రం చేయలేరు.... మనుషులు, పాషాణాలు ఇంధనం కాగల నరకాగ్నికి భయపడండి. సత్య తిరస్కారులకోసం అది సిద్ధంగా ఉంది.-- ఖురాను (2:23)

ఈ విధమైన సవాలులను ఎదుర్కొనే ప్రయత్నాలు (ముస్లిమేతరుల చేత) జరిగాయిగాని వాటిని ముస్లిం పండితులు ఆమోదించలేదు.[22]

ఖురాన్ సూరాల జాబితా

[మార్చు]

(ఖుర్‌ఆన్ భావామృతం - అబుల్ ఇర్ఫాన్ అనువాదం - నుండి తీసుకొన్న విషయ సూచిక: https://te.wikisource.org/wiki/%E0%B0%95%E0%B1%81%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D_%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B1%83%E0%B0%A4%E0%B0%82)

తైమూర్ కాలంలోని ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి చెందిన ఖుర్‌ఆన్ - షుమారు 1400 సంవత్సరం కాలం.

ఖురాన్ లో 114 సూరాలు గలవు. క్రింది సూరా పేర్లను చూడండి:

సూచన : 'మక్కీ' అనగా మక్కాలో, 'మదనీ' అనగా మదీనాలో అవతరించి నట్లు (ప్రకటింప) బడినవి.shaikakbarali330

సంఖ్య అరబీ సూరా పేరు తెలుగులో అర్థం ఆయత్ లు లేదా సూక్తులు రుకూలు మక్కీ / మదనీ
1 అల్-ఫాతిహా పరిచయం/ప్రారంభం (అల్-ఫాతిహా) 7 1 మక్కీ
2 అల్-బఖరా గోవు 286 40 మదనీ
3 ఆల్-ఎ-ఇమ్రాన్ ఇమ్రాన్ (మూసా తండ్రి) కుటుంబం 200 20 మదనీ
4 అన్-నిసా స్త్రీలు 176 మదనీ
5 అల్-మాయిదా వడ్డించిన విస్తరి 120 మదనీ
6 అల్-అన్ఆమ్ పశువులు 165 మక్కీ
7 అల్-ఆరాఫ్ శిఖరాలు 206 మక్కీ
8 అల్-అన్ఫాల్ సమర సొత్తు 75 మదనీ
9 అత్-తౌబా పశ్చాత్తాపం 129 మదనీ
10 యూనుస్ యూనుస్ ప్రవక్త 109 మక్కీ
11 హూద్ హూద్ ప్రవక్త 123 మక్కీ
12 యూసుఫ్ యూసుఫ్ ప్రవక్త 111 మక్కీ
13 అర్-రాద్ మేఘ గర్జన 43 మదనీ
14 ఇబ్రాహీం ఇబ్రాహీం ప్రవక్త 52 మక్కీ
15 అల్-హిజ్ర్ హిజ్ర్ వాసులు 99 మక్కీ
16 అన్-నహల్ తేనెటీగ 128 మక్కీ
17 బనీ ఇస్రాయీల్ ఇస్రాయీల్ సంతతి 111 మక్కీ
18 అల్-కహఫ్ మహాబిలం 110 మక్కీ
19 అల్-మర్యం మరియం (ఈసా తల్లి) 98 మక్కీ
20 తాహా తాహా 135 మక్కీ
21 అల్-అంబియా దైవ ప్రవక్తలు 112 (మక్కి)
22 అల్-హజ్ హజ్ యాత్ర 78 మదనీ
23 అల్-మోమినీన్ విశ్వాసులు 118 మక్కీ
24 అన్-నూర్ జ్యోతి 64 మదనీ
25 అల్-ఫుర్ ఖాన్ గీటురాయి 77 మక్కీ
26 అష్-షుఅరా కవులు 227 మక్కీ
27 అన్-నమల్ చీమలు 93 మక్కీ
28 అల్-ఖసస్ గాధలు 88 మక్కీ
29 అల్-అన్కబూత్ సాలెపురుగు 69 మక్కీ
30 అర్-రూమ్ రోమ్ వాసులు 60 మక్కీ
31 లుఖ్ మాన్ లుఖ్ మాన్ 34 4 మక్కీ
32 అస్-సజ్దా సాష్టాంగ ప్రమాణము 30 3 మక్కీ
33 అల్-అహ్ జబ్ సైనిక దళాలు 73 9 మదనీ
34 సబా సబా జాతి 54 6 మక్కీ
35 ఫాతిర్ సృష్టికర్త 45 5 మక్కీ
36 యాసీన్ యాసీన్ 83 5 మక్కీ
37 అల్-సాఫ్ఫత్ (పంక్తులు తీరినవారు) 182 5 మక్కీ
38 సాద్ సాద్ 88 5 మక్కీ
39 అజ్-జుమర్ బృందాలు 75 8 మక్కీ
40 అల్-మోమిన్ విశ్వాసి 85 9 మక్కీ
41 హా మీమ్ హా మీమ్ 54 6 మక్కీ
42 అష్-షూరా సలహా సంప్రదింపులు 53 5 మక్కీ
43 అజ్-జుఖ్రుఫ్ బంగారు నగలు 89 7 మక్కీ
44 అద్-దుఖాన్ పొగ 59 3 మక్కీ
45 అల్-జాసియా కూలబడినవాడు 37 4 మక్కీ
46 అల్-ఆహ్ ఖఫ్ ఇసుక కొండల నేల 35 4 మక్కీ
47 ముహమ్మద్ ముహమ్మద్ 38 4 మదనీ
48 అల్-ఫతహ్ విజయం 29 2 మదనీ
49 అల్-హుజూరాత్ నివాస గ్రహాలు 18 2 మదనీ
50 ఖాఫ్ ఖాఫ్ 45 3 మక్కీ
51 అజ్-జారియా గాలి దుమారం 60 3 మక్కీ
52 అత్-తూర్ తూర్ పర్వతం 49 2 మక్కీ
53 అన్-నజ్మ్ నక్షత్రం 62 3 మక్కీ
54 అల్-ఖమర్ చంద్రుడు 55 3 మక్కీ
55 అర్-రహ్మాన్ కరుణామయుడు 78 3 మదనీ
56 అల్-వాఖియా సంఘటన 96 3 మక్కీ
57 అల్-హదీద్ ఇనుము 29 4 మదనీ
58 అల్-ముజాదిలా వాదిస్తున్న స్త్రీ 22 3 మదనీ
59 అల్-హష్ర్ దండయాత్ర 24 3 మదనీ
60 అల్-ముమ్ తహినా పరీక్షిత మహిళ 13 2 మక్కీ
61 అస్-సఫ్ఫ్ సైనిక పంక్తి 14 2 మదీనా
62 అల్-జుమా సప్తాహ సమావేశం (శుక్రవారం) 11 2 మదనీ
63 అల్-మునాఫిఖూన్ కపట విశ్వాసులు 11 2 మదనీ
64 అత్-తగాబూన్ జయాపజయాలు 18 2 మదనీ
65 అత్-తలాఖ్ విడాకులు (ఇస్లాం) 12 2 మదనీ
66 అత్-తహ్రీమ్ నిషేధం 12 2 మదనీ
67 అల్-ముల్క్ విశ్వ సార్వభౌమత్వం 30 2 మక్కీ
68 అల్-ఖలమ్ కలం 52 2 మక్కీ
69 అల్-హాక్ఖా పరమ యదార్థం 52 2 మక్కీ
70 అల్-మారిజ్ ఆరోహణా సోపానాలు 44 2 మక్కీ
71 నూహ్ నూహ్ 28 2 మక్కీ
72 అల్-జిన్న్ జిన్ 28 2 మక్కీ
73 అల్-ముజమ్మిల్ దుప్పట్లో నిదురించేవాడు 20 2 మక్కీ
74 అల్-ముదస్సిర్ దుప్పట్లో పడుకున్నవాడు 56 2 మక్కీ
75 అల్-ఖియామా ప్రళయం 40 2 మక్కీ
76 అద్-దహ్ర్ సమయం 31 2 మక్కీ
77 అల్-ముర్సలాత్ రుతుపవనాలు 50 2 మక్కీ
78 అన్-నబా సంచలనాత్మక వార్త 40 1 మక్కీ
79 అన్-నాజియాత్ దూరి లాగేవారు 46 2 మక్కీ
80 అబస భృకుటి ముడిచాడు 42 1 మక్కీ
81 అత్-తక్వీర్ చాప చుట్టలా 29 1 మక్కీ
82 అల్-ఇన్ ఫితార్ బీటలు 19 1 మక్కీ
83 అల్-ముతఫ్ఫిఫీన్ హస్తలాఘవం 36 1 మక్కీ
84 అల్-ఇన్ షిఖాఖ్ ఖండన 25 1 మక్కీ
85 అల్-బురూజ్ ఆకాశ బురుజులు 22 1 మక్కీ
86 అత్-తారిఖ్ ప్రభాత నక్షత్రం 17 1 మక్కీ
87 అల్-అలా మహోన్నతుడు 19 1 మక్కీ
88 అల్-ఘాషియా ముంచుకొస్తున్న ముప్పు 26 1 మక్కీ
89 అల్-ఫజ్ర్ ప్రాత॰కాలం (ఫజ్ర్) 30 1 మక్కీ
90 అల్-బలద్ పట్టణం 20 1 మక్కీ
91 అష్-షమ్స్ సూర్యుడు 15 1 మక్కీ
92 అల్-లైల్ రాత్రి (లైల్) 21 1 మక్కీ
93 అజ్-జుహా పగటి వెలుతురు 11 1 మక్కీ
94 అలమ్ నష్రహ్ మనశ్శాంతి 8 1 మక్కీ
95 అత్-తీన్ అంజూరం 8 1 మక్కీ
96 అల్-అలఖ్ గడ్డకట్టిన రక్తం 19 1 మక్కీ
97 అల్-ఖద్ర్ ఘనత 5 1 మక్కీ
98 అల్-బయ్యినా విస్పష్ట ప్రమాణం 8 1 మదనీ
99 అజ్-జల్ జలా భూకంపం 8 1 మదనీ
100 అల్-ఆదియాత్ తురంగం 11 1 మక్కీ
101 అల్-ఖారిఅ మహోపద్రవం 11 1 మక్కీ
102 అత్-తకాసుర్ ప్రాపంచిక వ్యామోహం 8 1 మక్కీ
103 అల్-అస్ర్ కాల చక్రం 3 1 మక్కీ
104 అల్-హుమజా నిందించేవాడు 9 1 మక్కీ
105 అల్-ఫీల్ ఏనుగు 5 1 మక్కీ
106 ఖురైష్ ఖురైషులు 4 1 మక్కీ
107 అల్-మాఊన్ సాధారణ వినియోగ వస్తువులు 7 1 మక్కీ
108 అల్-కౌసర్ శుభాల సరోవరం 3 1 మక్కీ
109 అల్-కాఫిరూన్ అవిశ్వాసులు 6 1 మక్కీ
110 అన్-నస్ర్ సహాయం 3 1 మక్కీ
111 అల్-లహబ్ అగ్నిజ్వాల 5 1 మక్కీ
112 అల్-ఇఖ్లాస్ ఏకేశ్వరత్వం 4 1 మక్కీ
113 అల్-ఫలఖ్ అరుణోదయం 5 1 మక్కీ
114 అల్-నాస్ మానవాళి 6 1 మక్కీ

ఇవికూడా చూడండి

[మార్చు]


మూలాలు

[మార్చు]
  1. Qur'ān, Chapter 2, Verses 23-24
  2. Living Religions: An Encyclopaedia of the World's Faiths, Mary Pat Fisher, 1997, page 338, I.B. Tauris Publishers,
  3. "Qur'an, Chapter 17, Verse 106". Archived from the original on 2007-12-15. Retrieved 2007-06-15.
  4. Qur'an, Chapter 33, Verse 40
  5. Watton, Victor, (1993), A student's approach to world religions:Islam, Hodder & Stoughton, pg 1. ISBN 0-340-58795-4
  6. "Qur'ān Chapter 87, Verses 18-19". Archived from the original on 2007-06-29. Retrieved 2007-06-15.
  7. Qur'ān, Chapter 3, Verse 3
  8. "Qur'ān, Chapter 5, Verse 44". Archived from the original on 2006-12-05. Retrieved 2007-06-15.
  9. "Qur'ān, Chapter 4, Verse 163". Archived from the original on 2007-06-10. Retrieved 2007-06-15.
  10. "Qur'ān, Chapter 17, Verse 55". Archived from the original on 2007-12-15. Retrieved 2007-06-15.
  11. Qur'ān, Chapter 3, Verse 84
  12. "Quran, Chapter 4, Verse 136". Archived from the original on 2007-06-10. Retrieved 2007-06-15.
  13. "The Qur'an assumes the reader to be familiar with the traditions of the ancestors since the age of the Patriarchs, not necessarily in the version of the "Children of Israel" as described in the Bible but also in the version of the "Children of Ismail" as it was alive orally, though interspersed with polytheist elements, at the time of the Prophet Muhammad (s). The term Jahiliya (ignorance) used for the pre-Islamic time does not mean that the Arabs were not familiar with their traditional roots but that their knowledge of ethical and spiritual values had been lost." Exegesis of Bible and Qur'an, H. Krausen. https://web.archive.org/web/20091019233234/http://geocities.com/Athens/Thebes/8206/hkrausen/exegesis.htm
  14. "Qur'ān, Chapter 15, Verse 9". Archived from the original on 2007-04-02. Retrieved 2007-06-15.
  15. "Qur'ān Chapter 5, Verse 46". Archived from the original on 2006-12-05. Retrieved 2007-06-15.
  16. Sydney Nettleton Fisher, The Middle East: a history, p.55
  17. Molloy (2006), p.451
  18. Esposito (2002), p.8
  19. However, the Quran in a single manuscript form was only made during the reign of the Caliph Othman who ordered the production of several copies.Sahih Bukhari, Volume 6, Book 60, Number 201 Archived 2008-01-19 at the Wayback Machine
  20. 'అబుల్ ఇర్ఫాన్' అనువదించిన "ఖుర్‌ఆన్ భావామృతం" ఉపోద్ఘాతం నుండి.
  21. "Inimitable Qur'an - Qu'ranic Style". Archived from the original on 2007-09-20. Retrieved 2007-06-15.
  22. Islamic-Awareness.org - The Challenge of the Qur'an

వనరులు

[మార్చు]

అనువాదాలు

[మార్చు]

ప్రాచీన విశ్లేక్షణ

[మార్చు]
  • al-Tabari, Muhammad ibn Jarir -- Jami‘ al-bayân `an ta'wil al-Qur'ân, Cairo 1955-69, transl. J. Cooper (ed.), The Commentary on the Qur'an, Oxford University Press, 1987. ISBN 0-19-920142-0
  • Tafsir Ibn-Kathir, Hafiz Imad al-din Abu al-Fida Ismail ibn Kathir al-Damishqi al-Shafi'i - (died 774 Hijrah (Islamic Calendar))
  • Tafsir Al-Qurtubi (Al-Jami'li-Ahkam), Abu Abdullah Muhammad ibn Ahmad Abi Bakr ibn Farah al-Qurtubi - (died 671 Hijrah (Islamic Calendar))

పాత విశ్లేషణ

[మార్చు]

ఇటీవలి విశ్లేక్షణ

[మార్చు]

డైరెక్టరీలు

[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఖోరాన్&oldid=4338408" నుండి వెలికితీశారు