Jump to content

ఖురాన్ పుట్టుక, పరిణామం

వికీపీడియా నుండి

వ్యాసాల పరంపర ఖురాన్

ముస్‌హఫ్

సూరా · ఆయత్

ఖురాను పఠనం

తజ్వీద్ (ఉచ్ఛారణ) · హిజ్‌బ్ · తర్‌తీల్ · Qur'anic guardian · మంజిల్ · ఖారి · జుజ్ · రస్మ్ · రుకూలు · సజ్దాలు ·

భారతీయ భాషలలో ఖురాన్ అనువాదాలు

జాబితా

ఖురాన్ పుట్టుక, పరిణామం

మక్కాలో అవతరింపబడినవి  · మదీనాలో అవతరింపబదినవి

తఫ్సీర్

ఆయత్ ల సంబంధిత వ్యక్తులు · న్యాయం · అవతరణకు గల కారణాలు · నస్‌ఖ్ · బైబిలు కథనాలు · తహ్‌రీఫ్ · బక్కాహ్ · ముఖత్తాత్ · Esoteric interpretation

ఖురాన్, సున్నహ్

Literalism · మహిమలు · సైన్స్ · స్త్రీ

ఖురాన్ గురించి అభిప్రాయాలు

షియా · విమర్శ · Desecration · Surah of Wilaya and Nurayn · తనజ్‌జులాత్ · ఖససుల్ అంబియా · బీత్ అల్ ఖురాన్


ఖురాన్ పుట్టుక, పరిణామం : ఖురాన్, ఇస్లాం మత పవిత్ర గ్రంథం. ముస్లిముల సాంప్రదాయిక విశ్వాసాల ప్రకారం, అల్లాహ్ (దేవుడు), ముహమ్మద్ ప్రవక్త పై అవతరింపజేశాడు.

ఖురాన్ పుట్టుక

ప్రపంచంలోని అనేక ప్రధాన మతాలు ఏర్పడ్డలాగే, అరేబియాలో బదూయిన్ లు, పాగన్లు, అనేక తెగల మధ్య, ఒక మతము ప్రారంభమయ్యింది. ఇబ్రాహీం మత పరంపరే ఈ ఇస్లాం మతం. ముహమ్మద్ ప్రవక్తను ఇస్లాం మత స్థాపకుడిగా కాక, ఇబ్రాహీం మత పునర్వవస్థాపకుడిగా భావిస్తారు. అటు ఇబ్రాహీం మతమూ కొత్త మతమేమీగాదు, ప్రపంచంలో ప్రథమ మానవుడైనటువంటి ఆదమ్ నుండి వస్తున్న ధార్మిక విశ్వాస విధానము. ముహమ్మద్ ప్రవక్త, ఇస్లామీయ ప్రవక్తల గొలుసులో ఆఖరు లంకెగా విశ్వసిస్తారు. అల్లాహ్, ప్రవక్తలపై ప్రకటించే గ్రంథాల సంప్రదాయాన్ని, ముహమ్మద్ ప్రవక్తకూ అన్వయింపజేశాడు. ఇస్లామీయ ప్రవక్తలలో ఆఖరి ప్రవక్తపై ప్రకటింపబడిన గ్రంథము ఖురాన్, ఇది అల్లాహ్ చే ప్రకటింపబడిన ఆఖరి గ్రంథము. ముహమ్మద్ ప్రవక్త, హిరా గుహలో ధ్యానమాచరించేవారు. ఈ ధ్యాన పరంపరలోనే, సా.శ. 610లో అల్లాహ్, తన దూతయైన జిబ్రయీల్ చే వహీ ద్వారా ఖురాన్ ను అవతరింపజేయడం ప్రారంభించాడు.

ఖురాన్ అవతరణ కాలము;

సా.శ. 610 నుండి 632 (ముహమ్మద్ ప్రవక్త పరమదించిన సంవత్సరము) వరకూ, దాదాపు 23 సంవత్సరములు, అవసరానుగుణంగా అవతరింపబడింది. హిరా గుహలో జిబ్రయీల్ అందించిన మొదటి, ఆఖరి ఆయత్‌లు;

మొదటి ఆయత్;

” (اے حبیب!) اپنے رب کے نام سے (آغاز کرتے ہوئے) پڑھئے جس نے (ہر چیز کو) پیدا فرمایا۔ اس نے انسان کو (رحمِ مادر میں) جونک کی طرح معلّق وجود سے پیدا کیا۔ پڑھیئے اور آپ کا رب بڑا ہی کریم ہے۔ جس نے قلم کے ذریعے (لکھنے پڑھنے کا) علم سکھایا۔ جس نے انسان کو (اس کے علاوہ بھی) وہ (کچھ) سکھا دیا جو وہ نہیں جانتا تھا۔[2] “

ఆఖరి ఆయత్;

” آج میں نے تمہارے لئے تمہارا دین مکمل کر دیا اور تم پر اپنی نعمت پوری کر دی اور تمہارے لئے اسلام کو (بطور) دین (یعنی مکمل نظامِ حیات کی حیثیت سے) پسند کر لیا۔ پھر اگر کوئی شخص بھوک (اور پیاس) کی شدت میں اضطراری (یعنی انتہائی مجبوری کی) حالت کو پہنچ جائے (اس شرط کے ساتھ) کہ گناہ کی طرف مائل ہونے والا نہ ہو (یعنی حرام چیز گناہ کی رغبت کے باعث نہ کھائے) تو بیشک اﷲ بہت بخشنے والا نہایت مہربان ہے[3]

అలీ ఇబ్న్ అబీ తాలిబ్

షియా ముస్లింల ప్రకారం ఇమాం అలీ తన వద్ద ఒక ఖురాన్ కాపీని కలిగివుండేవారు. ముహమ్మద్ ప్రవక్త మరణించిన ఆరు నెలల తరువాత దీనిని అలీ క్రోడీకరించారు. ఇలా ఖురాన్ సంకలనం మొదటి సంకలన కాపీ అయింది. దీని ప్రత్యేకత ఏమంటే ఆవిష్కరింపబడిన కాలము, క్రమము వరుసక్రమంలో వుండేది.[1] ఇదే ప్రస్తుతమున్న కురాను, అలీ వద్ద ఉన్న కురానుకు మధ్య గల తేడా.[2]: 89–90 

పురాతన చేతి వ్రాతలు

బర్మింగ్‌హామ్ ఖురాన్ మాన్యుస్క్రిప్ట్

సమర్కండ్ చేతివ్రాతలతో సహా అనేక చేతి వ్రాతలు ఉస్మాన్ పంపిన అసలు చేతివ్రాతలని చెప్పుకోవడం జరిగింది. అవి ఏడవ శతాబ్దం నాటివని చెప్పుకోవడం జరిగింది. అనేక మంది పరిశోధకులు అవి ఉస్మాన్ పంపిన చేతివ్రాతలని అంగీకరించడం లేదు. జాన్ గిల్ క్రిస్ట్ (John Gilchrist) అనే పరిశోధకుని వివరణ ప్రకారం ముహమద్ చనిపోయిన 100 సంవత్సరాల తరువాతి కాలంలోనే సమర్కండ్, తోప్కాపీ చేతివ్రాతలు వ్రాయడం జరిగింది . అవి కూఫిక్ లిపిలో వ్రాయబడినవి.

ఖురాన్ సంకలనం పై సందేహాలు

ధార్మిక గ్రంథాలపై వాటి సంకలనాలపై అనుమాలాలు రావడం మానవులకు సహజమే. అలాగే ఖురాన్ సంకలనం పై సందేహాలు అనేకం ఉన్నాయి. ఖురాన్ సంకలనం ఉస్మాన్ కాలంలో జరగలేదని భావించే పరిశోధకులు అనేక మంది ఉన్నారు. ఇప్పటికి అందుబాటులో ఉన్న అతి పురాతన ప్రతులు 9వ శతాబ్దం నాటివని ఆ పరిశోధకుల వాదన. ఇస్లామిక్ ఖలీఫాల రాజ్యాల ఆక్రమణలు, విజయాలు సంభవించిన తరువాతే ఖురాన్ సంకలనం జరిగిదని వారు అంటున్నారు. సెక్యులర్ పరిశీలకులు పాట్రిసియా క్రోన్ అందించిన సమాచారం ప్రకారం తొలితరపు ఖురాన్ వచనాలని ఇతర మతాలవారు కూడా సేకరించి గ్రీక్, ఆర్మీనియన్, హీబ్రూ, అరమాయిక్, సిరియాక్, కాప్టిక్ భాషలలో రచించడం కూడా జరిగింది. ఆ వచనాలకి, సంప్రదాయక ముస్లింలు నమ్మే వచనాలకి తేడా ఉంది అనే వాదనలూ ఉన్నాయి.[3] ఖురాన్ లో మార్పులు, చేర్పులు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖురాన్ లోని కొన్ని భాగాలు తొలిగించడం గానీ మరిచిపోవడం గానీ జరిగిందనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఉస్మాన్ కాలంలోనే కొన్ని వచనాలని తొలిగించడం జరిగిందనే వాదన కూడా ఉంది. ఒక సందర్భంలో, ఒక ప్రాంతంలోని హాఫిజ్ లు చదివే ఖురాన్ లోని అనేక వచనాలు కనిపించకుండా పోయాయని ఉస్మాన్, ఆయిషా, ఇబ్న్ కాబ్ వంటి వారు కూడా అంగీకరించారనే వాదనలూ ఉన్నాయి. [1]

జన సందేహాలు

ఖురాన్ పుట్టుక, పరిణామం క్రీస్తు శకం 610లో మొదలయ్యింది. మొదట ముహమ్మద్ చెప్పిన ప్రవచనాల వ్రాతలను అతని అనుచరులు ఎడారి చెట్ల బెరడు ముక్కలు, చెట్టు కొమ్మలు, ఎండుటాకులు, తోలు ముక్కలు, రాతి పలకలు చివరికి ఎముకలు మీద కూడా వ్రాసేవారు. క్రీస్తు శకం 653, ఉస్మాన్ కాలంలో ఆ ముక్కలన్నిటినీ సేకరించి సంకలనం చెయ్యడం జరిగింది. ముహమ్మద్ ప్రకటన ప్రకారం దేవదూత గేబ్రియల్ (జిబ్రయీల్) అతనికి ఖురాన్ వచనాలు వినిపించాడు. ఖురాన్ వచనాలను ముహమ్మద్ తన అనుచరుల చేత వ్రాయించాడు కానీ తన చేతితో వ్రాయలేదు. కొంత మంది ముహమ్మద్ చదువు రాని వాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలు నిజం కావని కూడా సమాధానాలు చెప్పేవారున్నారు. చదువుకోకుండా అన్ని వచనాలు గుర్తుపెట్టుకోవడం కష్టం. కొన్ని కవితలనైతే సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు కానీ అనేక వచనాలని గుర్తుపెట్టుకోవడం కష్టం. సైకాలజీ ప్రకారం ఒక వ్యాసం రెండు మూడు సార్లు చదివితేనే గుర్తు ఉంటుంది. ఒకసారి చదివినప్పుడు కొన్ని వాక్యాలైనా మరిచిపోవడం జరుగుతుంది. ముహమ్మద్ తోరాహ్ గ్రంథం మాత్రం చదవలేదని వాదించే యూదులు ఉన్నారు. అతను తోరాహ్ వచనాలని కేవలం విని సేకరించాడని యూదుల వాదన [2].

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. Leaman, Oliver (2006). "Ali". The Qur'an: an Encyclopedia. New York, NY: Routledge. pp. 30–31. ISBN 0-415-32639-7.
  2. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; The Qur'an: A User's Guide అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  3. Patricia Crone, Slaves on Horses, pp. 15-16.

ఇతర పఠనాలు

  • M. M. Azami (2003). The History of the Qur'anic Text from Revelation to Compilation: A Comparative Study with the Old and New Testaments. UK Islamic Academy.
  • Gibson, Dan (2011) . Qur’anic Geography: A Survey and Evaluation of the Geographical References in the Qur’an with Suggested Solutions for Various Problems and Issues. Independent Scholars Press, Canada. ISBN 978-0-9733642-8-6.
  • Jane Dammen McAuliffe, ed. (2006). The Cambridge Companion to the Quar'an. Cambridge University Press. ISBN 978-0-521-53934-0.
  • Adam J. Silverstein (2010). Islamic History: A Very Short Introduction. Oxford University Press. ISBN 978-0-19-954572-8.

బయటి లింకులు